newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

టీడీపీ ప్రచారం షురూ..!

17-02-201917-02-2019 09:00:20 IST
2019-02-17T03:30:20.722Z17-02-2019 2019-02-17T03:30:03.043Z - - 17-07-2019

టీడీపీ ప్రచారం షురూ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ముంచుకొస్తున్న ఎన్నికలు... కలవరపెడుతున్న వలసల మధ్య తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది. ఇవాళ్టి నుంచి ప్రచార బరిలోకి వెళ్ళాలని చంద్రబాబు యోచిస్తున్నారు. శనివారం జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పుల్వామా ఘటనను పార్టీ తీవ్రంగా ఖండించింది. అమరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండునిముషాలు మౌనం పాటించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు చంద్రబాబు. 

ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల కోసం  ప్రచారాన్ని ప్రారంభిస్తామని ఏపీ మంత్రి సొమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రకటనకు ముందే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నామని చెప్పారు. అభ్యర్థుల ఎంపికకు అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై చంద్రబాబు సమీక్షించారని సోమిరెడ్డి చెప్పారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 

టీడీపీ గత నాలుగేళ్ళ 9 నెలల పాటు చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చంద్రబాబు మంత్రులు, నేతలకు సూచించారు. టీడీపీ సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలంటున్నారు టీడీపీ నేతలు. పార్టీనుంచి వలసలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఇందుకు కారణం సీట్ల సర్దుబాటులో విబేధాలే అని, వాటిని పరిష్కరించుకుందామన్నారు. కులం పేరుతో కొందరు టీడీపీపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఏపీలో ఎంపీ స్థానాలను అధికంగా గెలుచుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అంటున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle