newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

టీడీపీ నేతల ఉక్కిరి బిక్కిరి.. కేసుల మీద కేసులు

12-10-201912-10-2019 09:53:24 IST
2019-10-12T04:23:24.631Z12-10-2019 2019-10-12T04:23:10.908Z - - 31-05-2020

టీడీపీ నేతల ఉక్కిరి బిక్కిరి.. కేసుల మీద కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో 2019 ఎన్నికల అనంతరం టీడీపీ- వైసీపీ నేతల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇటు మాటల దాడితో పాటు సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. ఇవి చాలవన్నట్టుగా నేతల మీద కేసులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలువురు టీడీపీ కీలక నేతలిప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని బెయిళ్ళ కోసం తిప్పలు పడుతున్నారు.

తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది. విశాఖ నగరానికి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్ లిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల అనుమతి లేకుండా నగరంలో ర్యాలీ నిర్వహించారని పోలీసులు అభియోగాలు మోపారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ నగర పర్యటన సందర్భంగా  ఎలాంటి అనుమతి లేకుండా వారిద్దరు స్వాగత ర్యాలీలో నిర్వహించడమే వీరి నేరమని పోలీసులు చెబుతున్నారు.

అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు వెళ్ళిన పోలీసులపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో సివిల్ పోలీసులు ఈ మేరకు కేసులు నమోదు చేశారు.

చంద్రబాబు పర్యటనలో టీడీపీ నేతలపై కేసులు, వేధింపుల గురించి విమర్శలు చేశారు. తమ పార్టీ శ్రేణులపై ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. పోలీసులు ఓవరాక్షన్ మానుకోవాలని హెచ్చరించారు. ఆయన ఈ మేరకు హెచ్చరిక చేసిన 24 గంటల్లోనే పోలీసులు ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశం అవుతోంది. 

ఇప్పటికే టీడీపీ నేత, మాజీ విప్ చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్, మాజీ స్పీకర్ కోడెల తనయుడు శివరాం వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

చంద్రబాబు తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు భాష, బాడీ లాంగ్వేజ్‌ ఏ మాత్రం సరిగా లేదని లేదని..సీనియర్‌ నాయకుడు మాట్లాడాల్సిన భాష కాదని అవంతి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబుకు మతిమరుపు ఎక్కువయిందని, కంటివెలుగులో కంటి చూపు టెస్ట్ చేయించుకుంటే మంచిదని ఆయన ఎద్దేవా చేశారు.

గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా పోలీసులతో అడ్డుకునేలా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పోలీసులపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారన్నారు. మరి ఇదే డీజీపీ చంద్రబాబు ప్రభుత్వంలో కమిషనర్‌గా పనిచేయలేదా అని ప్రశ్నించారు.  పోలీసులను విమర్శించడం తగదని హితవు పలికారు. చంద్రబాబు ఇప్పటికైనా మబ్బుల్లో నుంచి బయటకు రావాలని సూచించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle