newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

19-02-202019-02-2020 16:18:01 IST
2020-02-19T10:48:01.657Z19-02-2020 2020-02-19T10:47:58.274Z - - 07-04-2020

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిన్న సంచలనం రేపిన వ్యవహారం ఈరోజు మాయం.. రోజుకో కొత్త అంశం చర్చకు రావడమే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రెండ్. ఎప్పటికప్పుడు ప్రజలు చర్చించుకొనేందుకు అక్కడి రాజకీయాలు రోజుకో కొత్త అంశాన్ని తెరమీదకి తెస్తున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. ఎన్డీఏలో వైకాపా భాగస్వామ్యం అయ్యే అవకాశాలు.. దాని తాలూకు చర్చలు పూర్తికాగానే ప్రతిపక్ష టీడీపీ ఇప్పుడు కొత్త సవాల్ విసురుతుంది.

సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య ఆసియా లేదా ఐరోపా దేశాలకు వెళ్లే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డే కాదు విచారణలో ఉన్న ఆయన అక్రమాస్తుల కేసులలో దర్యాప్తు సంస్థలు ఏ 1 నుండి ఏ 14 వరకు పేర్కొన్న వ్యక్తులెవరికైనా ఆయా దేశాలకు వెళ్లే దమ్ముందా అని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు తాజాగా మీడియా సమావేశం పెట్టి సవాల్ విసిరారు.

దీనికి కారణం కూడా బోండా ఉమా చెప్పేశారు. అక్రమాస్తుల కేసులలో విచారణ ఎదుర్కొంటున్న ఏ1 నుంచి ఏ14 వరకు ఎవరు విదేశాలకు వెళ్లినా ఇంటర్పోల్ వారిని విమానాశ్రయాలలో అదుపులోకి తీసుకుంటుందన్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డితో సహా ఈ 14 మందిలో ఎవరు ఆ విదేశాలకు వెళ్ళే దమ్ము లేదని ఉమా వ్యాఖ్యానించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనతో పాటు ఛార్జ్ షీట్లలో నిందితులుగా ఉన్న వ్యక్తులు కానీ విదేశాలకు వెళ్లేందుకు భయపడే దావోస్ సదస్సుకు కూడా మొహం చాటేసి రాష్ట్రానికి పెట్టుబడులను కూడా తాకట్టు పెట్టేశారన్నారు. ఈ 14 మంది ఇప్పుడు ఇంతగా భయపడడానికి కారణంగా వాన్ పిక్ కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అదే మాదిరి కొద్ది నెలల క్రితం విదేశీ పర్యటనలో ఉండగా అరెస్టు చేసి అక్కడే జైల్లో ఉంచారు.

ప్రస్తుతం నిమ్మగడ్డ బెయిల్ మీద ఉన్నా తిరిగి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అదే కేసులో ఏ 1 గా ఉన్న సీఎం జగన్ వెళ్లినా మిగతా వాళ్ళు వెళ్లినా అక్కడ ఇంటర్ పోల్ అదే చేస్తుందని బోండా వివరించారు. అంతే కాదు, ఇంటర్ పోల్ వ్యవహారానికి భయపడే సీఎం జగన్ తాజాగా కేంద్రం వద్దకు కాళ్ళ బేరానికి వెళ్లారని విమర్శలు చేశారు. దీన్ని కవర్ చేసేందుకే ఎన్డీఏలో భాగస్వామ్యం అనే నాటకానికి తెరలేపారన్నారు.

ఇన్ని నెలలుగా సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినా కనీసం ఆ భేటీలో జరిగిన చర్చల గురించి కానీ రాష్ట్రానికి రావాలిన నిధుల గురించి కానీ డిమాండ్ చేశామని చెప్తూ ఒక్క మీడియా సమావేశమైనా నిర్వహించారా? కేవలం కేసుల నుండి బయటపడేందుకే ఆరాటం తప్ప.. రాష్ట్ర సమస్యలను పట్టించుకొనే పరిస్థితిలో సీఎం లేరని బోండా తీవ్ర ఆరోపణలు చేశారు. యధావిధిగా బోండా వ్యాఖ్యలు మరోసారి ఏపీ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

 

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   6 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   10 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   10 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   12 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   16 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   18 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle