newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

టీడీపీ కంచుకోట‌లో ఈసారి ఫ్యాన్ హ‌వా..?

13-05-201913-05-2019 07:28:59 IST
Updated On 28-06-2019 13:20:37 ISTUpdated On 28-06-20192019-05-13T01:58:59.178Z13-05-2019 2019-05-13T01:58:00.131Z - 2019-06-28T07:50:37.528Z - 28-06-2019

టీడీపీ కంచుకోట‌లో ఈసారి ఫ్యాన్ హ‌వా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎనిమిది సార్లు అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా ఆరు సార్లు ఆ పార్టీ అభ్య‌ర్థులే గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో అయితే ఏకంగా 37 వేల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. అటువంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ఫ్యాను గాలి వీచిన‌ట్లు తెలుస్తుంది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ప‌క్కా గెలిచే సీట్ల‌లో భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ముందుంటుంద‌ని లెక్క‌లేసుకుంటున్నారు ఆ పార్టీ నేత‌లు.

భీమిలి నియోజ‌కవ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ బ‌లంగా ఉంది. 1983 నుంచి 2004, 2009లో మిన‌హా అన్ని ఎన్నిక‌ల్లో టీడీపీనే విజ‌యం సాధిస్తూ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాస‌రావు 37,226 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్య‌ర్థి క‌ర్రి సీతారాంపై విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కించుకున్నారు.

టీడీపీ బ‌లంగా ఉన్న ఇక్క‌డ మొద‌ట మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ సీటు కోసం అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు(అవంతి) చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నించారు. మంత్రి గంటా సైతం తాను నియోజ‌క‌వ‌ర్గం మారేందుకు సిద్ధ‌ప‌డ్డారు. కానీ, అనూహ్యంగా అవంతి శ్రీనివాస‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ తెచ్చుకున్నారు.

ఇక్క‌డి నుంచి 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున అవంతి శ్రీనివాస‌రావు విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచినా ఆయ‌న మ‌న‌స్సు మాత్రం భీమిలి నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉండేది. అక్క‌డ ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా అనుచ‌ర‌వ‌ర్గం ఉంది. దీంతో ఈసారి ఆయ‌న వైసీపీ నుంచి ఇదే స్థానానికి పోటీ చేశారు.

భీమిలిలో వైసీపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంతో టీడీపీ కూడా అనూహ్యంగా మాజీ ఎంపీ స‌బ్బం హ‌రిని పార్టీలో చేర్చుకోకుండానే టిక్కెట్ ఇచ్చి పోటీ చేయించింది. దీంతో ఇక్క‌డ రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగింది. భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో కాపులు అధికం. వీరే గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆ వ‌ర్గానికి చెందిన అవంతి శ్రీనివాసరావు వీరి ఓట్ల‌పై ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు.

ఆర్థికంగానూ అవంతి బ‌లంగా ఉన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు అంద‌రికీ అందుబాటులో ఉన్నాన‌ని, అభివృద్ధి చేశాన‌ని చెప్పి ఓట్ల‌డిగారు. దీంతో స‌బ్బం లోక‌ల్ ఫీలింగ్ ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు. తాను స్థానికుడిన‌ని ప్ర‌చారం చేసుకున్నారు. దీనికి కౌంట‌ర్ గా అవంతి సైతం త‌న‌ది కృష్ణా జిల్లానేనైనా తాను స్థిర‌ప‌డింది, విద్యాసంస్థ‌ల‌ను స్థాపించింది భీమిలిలో కాబ‌ట్టి తాను కూడా లోక‌ల్ అని ప్ర‌చారం చేశారు.

ఇక‌, జ‌న‌సేన అభ్య‌ర్థి పంచ‌క‌ర్ల సందీప్ కూడా ఇక్క‌డ బాగానే ఓట్లు చీల్చే అవ‌కాశం ఉంది. మొత్తంగా టీడీపీ సులువుగా గెలుస్తుంద‌నుకున్న భీమిలి సీటులో ఈసారి వైసీపీ బ‌ల‌మైన పోటీ ఇచ్చింద‌ని, స్వ‌ల్ప మెజారిటీతోనైనా ఆ పార్టీ ఇక్క‌డ విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్నాయ‌నే అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి, ఏం జ‌రుగుతుందో 23న చూడాలి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle