newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

టీడీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ గురి.. ఆరెస్సెస్‌ను ఆశ్రయించిన బాబు?

11-11-201911-11-2019 00:45:20 IST
2019-11-10T19:15:20.572Z11-11-2019 2019-11-10T19:02:41.448Z - - 16-11-2019

టీడీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ గురి.. ఆరెస్సెస్‌ను ఆశ్రయించిన బాబు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏపార్టీలోకి జంప్‌ అవుతారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఏపీ అసెంబ్లీలో కీలక పాత్ర పోషించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండటంతో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మరింత కష్టాలు ఎదురుకానున్నాయి. ఇప్పటికే గంటా శ్రీనివాస్‌రావుతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ పెద్దలతో చర్చలుసైతం జరిపినట్లు ప్రచారం సాగుతుంది.

సుధీర్ఘరాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుసైతం టీడీపీ ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత బీజేపీ దూకుడు ప్రభావాన్ని టీడీపీపై పడకుండా ఉండేందుకు బాబు తన పాత పరిచయాలను వినియోగించుకుంటున్నట్లు టీడీపీ శ్రేణుల్లో చర్చసాగుతుంది. బీజేపీకి అనుసంధానంగా ఉండే ఆరెస్సెస్‌ పెద్దలతో చంద్రబాబు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. తద్వారా ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలవాలని భావిస్తున్న బీజేపీ ఎత్తుగడలకు అడ్డకట్ట వేయాలని బాబు భావిస్తున్నారంట.

ఇప్పటికే బీజేపీలో గంటా శ్రీనివాస్‌రావు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు వల్లభనేని వంశీసైతం బీజేపీలోకే వెళ్తారని తెలుస్తోంది. వంశీ వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. బీజేపీ కేంద్ర పెద్దలు వైసీపీ పెద్దలకు ఫోన్‌ చేయడం ద్వారా వంశీ చేరిక వాయిదా పడినట్లు ఏపీలో ప్రచారం సాగుతుంది. వంశీని బీజేపీలోకి తీసుకుంటామని వైసీపీలోకి ఆహ్వానించవద్దని బీజేపీ పెద్దల ఫోన్‌ సారాంశంగా తెలుస్తుంది. మరోవైపు గంటాతో పాటు వచ్చే వారం రోజుల్లో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఏపీలో టీడీపీ మనుగడ కష్టంగా మారడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు బీజేపీ ఎత్తుగడలకు ఏపీ స్పీకర్‌ అడ్డంకిగా మారే అవకాశాలు లేకపోలేదని ప్రచారం సాగుతుంది. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని, పార్టీ మరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఒప్పుకోవాలని స్పీకర్‌ తమ్మినేనికి సీఎం జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకుంటే స్పీకర్‌ తీసుకొనే నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఏపీలో బీజేపీ బలపడాలంటే టీడీపీని బలహీనపర్చితే సాధ్యమవుతుందని ఆ పార్టీ కేంద్ర పెద్దలు ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ నుంచి సీనియర్‌, జూనియర్‌ నేతలు ఎవరు వచ్చినా పార్టీ కండువా కప్పేందుకు ఆ పార్టీ రాష్ట్ర పెద్దలు సిద్ధమయ్యారు. త్వరలో ఏపీకిలో కేంద్ర మంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. ఆయన పర్యటనలో బీజేపీలోకి వచ్చే టీడీపీ ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ సీనియర్‌, జూనియర్‌ నేతలు పలువురికి బీజేపీ కండువా కప్పనున్నట్లు బీజేపీలోని కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే జరిగితే ఏపీలో చంద్రబాబు పార్టీ పరిస్థితి దయనీయంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బీజేపీ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు చంద్రబాబు వ్యూహం ప్రకారం ఆరెస్సెస్‌ నేతలు ఏ విధంగా కాపాడతారు.. ఒకవేళ ఆరెస్సెస్‌ పెద్దలు చెప్పినా బీజేపీ నేతలు వినే పరిస్థితి ఉంటుందా అనేది టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. మొత్తానికి బీజేపీ గురి టీడీపీపై పడటం ఖాయమని బీజేపీ పెద్దలు స్పష్టం చేస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle