newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

టీడీపీ ఎమ్మెల్యేలపై నిఘా.. అందుకేనా?

15-06-201915-06-2019 12:59:33 IST
Updated On 22-06-2019 12:50:22 ISTUpdated On 22-06-20192019-06-15T07:29:33.806Z15-06-2019 2019-06-15T07:29:31.668Z - 2019-06-22T07:20:22.319Z - 22-06-2019

టీడీపీ ఎమ్మెల్యేలపై నిఘా.. అందుకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారా? వారి ఫోన్ కాల్స్ అన్నీ రికార్డు అవుతున్నాయా? అవుననే అంటున్నారు ఏపీ నేతలు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చాయి. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది తనతో టచ్లో ఉన్నారని, తాను గేటు తీస్తే టీడీపీ ఖాళీ అవుతుందని జగన్ వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి, తాను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతవుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కలవరపడుతున్నారు. 

జగన్ తో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై చంద్రబాబు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ అయితే తర్వాత ఏం చేయాలి? వారిని కాపాడుకోవడం ఎలా? పార్టీ భవిష్యత్ ఏంటనేది బాబుకి ఆందోళన కలిగిస్తోంది. టిడిపికి ఇప్పుడు అసెంబ్లీలో కక్కలేని మింగలేని పరిస్థితి నెలకొంది. ఏపీ సీఎం జగన్ తన దూకుడు చూపిస్తున్నారు.

ఇది చంద్రబాబుకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. అంతేకాదు ఇప్పటికే టిడిపి హయాంలో చేసిన పలు అభివృద్ధి పనులపై, తీసుకున్న కీలక నిర్ణయాలపై సమీక్ష చేసి తిరిగి నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్.

టీడీపీ హయాంలో వివిధ కాంట్రాక్టులు తీసుకున్న నేతలు జగన్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకొచ్చిన గొడవ జగన్మోహన్ రెడ్డితో రాజీకి వద్దామని భావిస్తున్నారు. దీంతో చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలపై నిఘా షురూ చేసినట్టు తెలుస్తోంది . తమ పార్టీ కీలక నేతల పైన ఎమ్మెల్యేల పైన నిఘా ఏర్పాటు చేశారు.

వైసీపీ, బీజేపీ నేతలతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల పై నిఘా పెట్టిన చంద్రబాబు ఇప్పటికే వారిని ఓ కంట కనిపెడుతూ ఉన్నారు. ఏది ఏమైనా జగన్ మాటల ఎఫెక్ట్ చంద్రబాబుకు గట్టిగా తగిలినట్టు గానే కనిపిస్తుంది. కాకుంటే నిఘా పెట్టినా, బతిమాలినా పార్టీ మారాలనుకునే వారు ఆగుతారా?

చంద్రబాబు అనవసరపు నిఘా కాకుంటే అన్న చర్చ సైతం ఇప్పుడు ఏపీలో జరుగుతోంది. అప్పట్లో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు అనుసరించిన విధానం... జగన్ అనుసరిస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి.. టీడీపీకి తప్పకపోవచ్చు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle