newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

టీడీపీ ఆందోళనల పర్వం.. ఇసుక కొరతపై నిరసన గళం

30-08-201930-08-2019 09:46:32 IST
Updated On 30-08-2019 09:46:29 ISTUpdated On 30-08-20192019-08-30T04:16:32.598Z30-08-2019 2019-08-30T04:14:49.484Z - 2019-08-30T04:16:29.246Z - 30-08-2019

 టీడీపీ ఆందోళనల పర్వం.. ఇసుక కొరతపై నిరసన గళం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై టీడీపీ ప్రత్యక్షపోరుకి సిద్ధమయింది. ఏపీలో వైసీపీ పాలన మొదలై మూడు నెలలవుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆగస్టు 30న మూడు నెలలు పూర్తి చేసుకుంటున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని ఆ పార్టీ నేతలు చెబుతుంటే.. ప్రధాన విపక్షం టీడీపీ మాత్రం ప్రజలకు జగన్ పాలనతో ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదంటోంది. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం చెందింది అంటోంది.

రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ముందుకు సాగాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ప్రజల్లోకి ఎలా వెళితే మంచిదని పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పార్టీలో యువ నేతలతో ఓ సమావేశాన్ని నిర్వహించారు.

తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటూ టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలతో యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. మొత్తానికి వైసీపీ సర్కార్‌పై సమర భేరి మోగించేందుకు లోకేష్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. 

జిల్లా స్థాయిల్లో వైసీపీ సర్కార్‌పై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నారువైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ రాష్ట్రంలో అస్తవ్యస్త విధానాలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

వైసీపీ వచ్చాక సిమెంట్ కన్నా ఇసుక ధర పెరిగిపోయిందని,  20 లక్షల మంది సెంట్రింగ్, కార్పెంటరీ, తాపీవంటి నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. 32 రకాల ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని చంద్రబాబునాయుడు ట్విట్టర్లో విమర్శించారు. 

ఇసుక  కొరతతో వివిధ రంగాలపై పడిన ప్రభావాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తోంది. అలాగే, టీడీపీ కార్యకర్తలపై వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

ఇకపై ప్రతివారంలో 2 రోజులు జిల్లాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వం అసమర్థతను నిరాసిస్తూ అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ధర్నాలు చేపట్టింది. మంగళగిరి ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి లోకేష్ టీడీపీ ధర్నాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడే నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle