newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

టీడీపీలో ముదిరిన అంత‌ర్గ‌త పోరు..!

13-09-201913-09-2019 12:21:52 IST
2019-09-13T06:51:52.578Z13-09-2019 2019-09-13T06:51:50.708Z - - 20-09-2019

టీడీపీలో ముదిరిన అంత‌ర్గ‌త పోరు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ టీడీపీలో అంత‌ర్గ‌త పోరు ర‌చ్చ‌కెక్కింది. అర్బ‌న్ పార్టీలో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. విశాఖ అర్బ‌న్ టీడీపీ అధ్యక్షుడు రెహ్మాన్ నాయ‌క‌త్వాన్ని ఎమ్మెల్యే వాస‌ప‌ల్లి గ‌ణేష్ కుమార్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

ఆయ‌న అర్బ‌న్ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్నంత కాలం టీడీపీ కార్యాల‌యానికి రాన‌ని ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ శ‌ప‌థం చేశారు. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే అర్బ‌న్ పార్టీ స‌మావేశాల‌కు రావ‌డం లేదు.

విశాఖ టీడీపీ ఆఫీసులో ఇటీవ‌ల నాలుగు కీల‌క‌మైన స‌మావేశాలు జ‌రిగాయి. మాజీ మంత్రులు అయ్య‌న్న పాత్రుడు, గంటా శ్రీ‌నివాస‌రావు కూడా ఈ స‌మావేశాల‌కు వ‌చ్చినా  వాసుప‌ల్లి గ‌ణేష్ మాత్రం అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఇటు ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో జ‌రిగే నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు సైతం అర్బ‌న్ పార్టీ అధ్య‌క్షుడికి క‌నీసం పిలుపు ఉండ‌టం లేదు.

అయితే విశాఖ‌కు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వ‌చ్చిన రోజే ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌కు రెహ్మాన్ ఘాటైన లేఖ రాశారు. పార్టీ జెండాపై గెలిచిన మీరు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఎందుకు రావ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ లేఖ‌కు అదే లెవ‌ల్లో ఎమ్మెల్యే స‌మాధాన‌మిచ్చారు. అర్బ‌న్ పార్టీ అధ్య‌క్షుడిగా రెహ్మాన్‌ను అంగీక‌రించ‌డం లేదంటూ బాంబు పేల్చారు వాసుప‌ల్లి. అత‌ని ఎన్నిక ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌ర‌గ‌లేదని విమ‌ర్శించారు.

ఎమ్మెల్యే వాసుప‌ల్లి, రెహ్మాన్ మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన‌డానికి బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయ‌న్న‌ది పార్టీ వ‌ర్గాల విశ్లేష‌ణ‌. ఎన్నిక‌ల ముందే వీరి మ‌ధ్య విబేధాలు ముదిరాయి. దీంతో జోక్యం చేసుకున్న అధిష్టానం  

ఏడేళ్ల‌పాటు అర్బ‌న్ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న వాసుప‌ల్లిని ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. వాసుప‌ల్లికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. రెహ్మాన్‌కు అర్బ‌న్ ప‌గ్గాలు అప్ప‌గించారు. అయితే అప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన గ్యాప్ రోజు రోజుకు పెరుగుతూ వ‌చ్చింది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌మంతా టీడీపీ ఘోరంగా దెబ్బ‌తింది. కానీ విశాఖ సిటీలో మాత్రం ఫ‌లితాలు కాస్త ఊర‌ట‌నిచ్చాయి. విశాఖ న‌గరంలో ఏకంగా నాలుగు ఎమ్మెల్యే సీట్ల‌ను టీడీపీ త‌న ఖాతాలో వేసుకుంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు త్వ‌ర‌లో వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ రెహ‌మాన్ వాసుప‌ల్లి గ‌ణేష్ మ‌ధ్య వార్ పార్టీలో ఎటువంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందోన‌న్న చ‌ర్చ పార్టీలో న‌డుస్తుంది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle