newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

టీడీపీలో ఆనందం.. వైసీపీలో కన్ఫ్యూజన్!

24-11-201924-11-2019 08:16:51 IST
2019-11-24T02:46:51.442Z24-11-2019 2019-11-24T02:46:48.859Z - - 15-12-2019

టీడీపీలో ఆనందం.. వైసీపీలో కన్ఫ్యూజన్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ-టీడీపీ పార్టీలలో ఆనందం-కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. గత ఐదు నెలలుగా అసహనం, అవమానాలే కనిపించిన టీడీపీలో రెండు రోజులుగా ఆనందం కనిపిస్తుంటే.. వైసీపీ ఇప్పుడు కొత్తగా కన్ఫ్యూజన్ ప్రారంభమైంది. ఇంతకీ ఇది ఎందుకంటే భారత సరికొత్త మ్యాప్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయమే కారణంగా చెప్పుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య విడుదల చేసిన అధికారిక మ్యాప్ లో దేశంలోని అన్ని రాష్ట్రాలు.. వాటి రాజధానులను తెలియపరుస్తూ కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఆ మ్యాప్ లో ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటైన జమ్మూకాశ్మీర్ ను కూడా సూచించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని మాత్రం పిన్ చేయలేదు. అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మ్యాప్ లో వదిలేశారు. దీనిమీద అప్పుడే విమర్శలు వచ్చాయి.

ఇక అసలే రాజధాని అమరావతి మీద ఏ మాత్రం స్పష్టత లేకుండా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర నిర్ణయం కూడా ఓ ఆయుధంగా మారింది కేంద్రమే అమరావతిని రాజధానిగా గుర్తించనపుడు తాము పునరాలోచించడం తప్పేముందని వైసీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడారు. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్ ను విడుదల చేసింది.

ఇందుకు కారణం కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కావడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో అమరావతి లేని మ్యాప్ పై కేంద్రానికి సూటి ప్రశ్నలు వేశారు. సాక్షాత్తు ప్రధాని మోడీనే వచ్చి శంఖుస్థాపన చేసిన అమరావతిని ఆ కేంద్రమే గుర్తించకపోవడం ప్రధానికి అవమానం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో కేంద్రం అమరావతితో కూడిన మ్యాప్ ను విడుదల చేసింది.

ఇదే ఇప్పుడు టీడీపీలో ఒకింత ఆనందంగా కలిగిస్తుంది. మాజీ సీఎం చంద్రబాబు మానసపుత్రికగా చెప్పుకున్న అమరావతిని కేంద్రం రాజధానిగా గుర్తించడం టీడీపీ శ్రేణులు చంద్రబాబుకి దక్కిన గౌరవంగానే భావిస్తున్నారు. అదీ కాక రాష్ట్రంలో వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా పార్లమెంటులో రాజధాని పేరు అంశాన్ని లేవనెత్తలేకపోగా ముగ్గురే ఉన్న టీడీపీ ఎంపీ ఆ పనిచేయడం కూడా టీడీపీ ఆనందానికి మరోకారణం.

అయితే రాజధానిగా అమరావతి ఉండాలా లేదా అని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది కన్ఫ్యూజన్ గా మారింది. ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని నిర్ణయాన్ని ఓ కమిటీ చేతుల్లో పెట్టింది. అయితే రేపు ఆ కమిటీ రాజధానిగా అమరావతిని కాదంటే కేంద్రం గుర్తించినా రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకొని రాజధానిని మార్చేసిందన్న భావన వస్తుందేమోనని ఆలోచనలో పడేసినట్లుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కేంద్ర నిర్ణయం టీడీపీకి రాజధాని అంశంలో కొద్దిగా ఊరట కలిగించగా వైసీపీకి మాత్రం పాలుపోనట్లుగా కనిపిస్తుంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle