newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

టీడీపీని వెంటాడుతున్న మరో భయం..!

19-10-201919-10-2019 12:25:08 IST
2019-10-19T06:55:08.767Z19-10-2019 2019-10-19T06:54:52.565Z - - 14-11-2019

టీడీపీని వెంటాడుతున్న మరో భయం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీకి కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు బీజేపీ ఏపీలో వేగంగా విస్తరించే క్రమంలో టీడీపీ నేతలను టార్గెట్‌ చేస్తోంది. టీడీపీలో కీలకంగా ఉన్న నేతలను తమవైపుకి లాగుతోంది. ఇప్పటికే సుజనాచౌదరి, సీఎం రమేష్‌, టీ.జీ. వెంకటేశ్‌, గరికపాటి రామ్మోహన్‌లను బీజేపీలోకి చేర్చుకుంది. మరోవైపు వైసీపీ సైతం టీడీపీలోని కీలకనేతలపై గాళమేసింది. దీంతో ఇటీవల జూపూడి ప్రభాకర్‌తో పాటు పలువురు నేతలు వైసీపీలో చేరారు. ఈ పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు అప్రత్తమయ్యారు. పార్టీ నుండి క్యాడర్‌ చేజారకుండా చర్యలు చేపట్టారు.

ఇప్పుడు మరో సమస్య టీడీపీని వెంటాడుతోంది. ఓట్ల తొలగింపు అంశం ఆపార్టీ నేతల్లో గుబులు రేపుతుంది. ఎన్నికల ముందు లక్షల్లో వచ్చిన ఫామ్‌ -7లపై అప్పట్లో టీడీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. వేల సంఖ్యలో ఓట్ల తొలగింపుకు కుట్ర జరిగిందని టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలుసైతం చేశారు. ఇప్పుడదే సమస్య టీడీపీ నేతల్లో భయానికి కారణమైంది.

ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల ద్వారా టీడీపీ కార్యకర్తల ఓట్ల తొలగింపుకు కుట్ర జరుగుతుందని భావిస్తున్న టీడీపీ.. ఇప్పటి నుండే ఫిర్యాదుల పర్వానికి తెరలేపింది. గతంలో ఓట్ల తొలగింపుతో నష్టపోయామని భావిస్తున్న టీడీపీ మళ్లీ ఆనష్టం జరగకుండా ముందస్తుగా మేల్కొంది.

ఏపీలో లక్షల సంఖ్యలో గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. ప్రతీ 50ఇళ్లకు ఒక వాలంటీర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలను అందించనున్నట్లు వైసీపీ ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వ సొమ్ముతో జీతాలు చెల్లించి వైసీపీ కార్యకర్తలను పోషిస్తుందని, వారిని ఎన్నికల సమయంలో పార్టీ పనులకు ఉపయోగించుకొనేందుకు వారిని నియమించారని టీడీపీ వాదిస్తుంది.

ముఖ్యంగా గ్రామాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, వారి సమస్యలేమిటి తెలుసుకొని వారిని వైసీపీ వైపు తిప్పుకొనేందుకు వాలంటీర్లను వాడుతుందని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా గ్రామ వాలంటిర్ల ద్వారా టీడీపీ కార్యకర్తల లిస్ట్‌ ను తెప్పించుకొని ఫలానావారు గ్రామాల్లో ఉండటం లేదనే సాకుతో వారి ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముందే ఈ విషయంపై ఆందోళన బాట పట్టడం ద్వారా వైసీపీ ప్రయత్నాలకు చెక్‌పెట్టవచ్చని టీడీపీ భావిస్తుంది.

ఒక్కసారి ఓటు తొలగింపు జరిగితే తీవ్రనష్టం జరుగుతుందని టీడీపీ అంచనాకు వచ్చింది. దీంతో ప్రభుత్వ వాలంటీర్ల ద్వారా ఓట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఓట్లకు సంబంధించి ఏ ప్రక్రియలోనూ వాలంటీర్లను వినియోగించవద్దని ఈసీని అభ్యర్థించింది. సిబ్బంది కొరత పేరుతో వాలంటీర్లకు ఆ పనిని అప్పగిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఏపీ ఎన్నికల ప్రధాన కార్యదర్శికి ఆ పార్టీ నేతలు విజ్ఞప్తులు చేశారు.

వాలంటీర్ల ప్రమేయం ఉంటే రానున్న లోకల్‌ బాడీ, మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌లకు మాత్రమే ఓట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియపై అవకాశం ఇవ్వాలని టీడీపీ డిమాండ్‌ చేస్తుంది. మరి టీడీపీ విజ్ఞప్తులను ఎన్నికల కమిషన్‌ ఏమేరకు పట్టించుకుంటుంది, వైసీపీ ఎత్తుగడల నుంచి టీడీపీ ఏవిధంగా తప్పించుకుంటుందో వేచి చూడాల్సిందే.

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle