newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

టీడీపీని నైతికంగా దెబ్బతీసే వైసీపీ మాస్టర్ ప్లాన్?

28-10-201928-10-2019 09:30:25 IST
2019-10-28T04:00:25.793Z28-10-2019 2019-10-28T04:00:09.485Z - - 16-11-2019

టీడీపీని నైతికంగా దెబ్బతీసే వైసీపీ మాస్టర్ ప్లాన్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ హవా కొనసాగుతుంది. ఆయన కారు జోరుకి ప్రతిపక్ష పార్టీలు ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. రాష్ట్ర ఉద్యోగులు, ప్రభుత్వంలో సేవకులు సైతం అయనకు జీ హుజూర్ అనాల్సిందే. కెసిఆర్ అంతగా ప్రజాదరణ సాధించడంతోనే అయన మాటకు తిరుగులేకుండా పోతుంది. తెలంగాణ గులాబీ సామ్రాజ్యంలో ప్రస్తుతం ప్రతిపక్షం పేరుకి మాత్రమే. మిగతా పార్టీలకు తిరిగి కోలుకోని అవకాశం లేకుండా రాజకీయ చతురతతో ఆయన కొట్టే దెబ్బకి ప్రతిపక్షాలు విలవిలలాడిపోతున్నాయి.

సరిగా ఇప్పుడే అదే విధానాన్ని ఏపీలో కెసిఆర్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి కూడా అవలంభించేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి 151 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. అది రాష్ట్ర చరిత్రలో తిరుగులేని విజయం కాగా టీడీపీకి కోలుకోలేని దెబ్బ. టీడీపీ తిరిగి పూర్వ వైభవం కోసం ప్రయత్నాలను మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న తన పాత మిత్రుడు బీజేపీతో దోస్తీకి సిద్దమై అధికారం పార్టీపై ఒత్తిడి పెంచాలని చూస్తుంది.

బీజేపీ చంద్రబాబు స్నేహానికి దారిస్తుందా అన్నది పక్కనపెడితే టీడీపీ పుంజుకునేందుకు మాత్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే అధికార వైసీపీ ఇదే అదనుగా టీడీపీని నైతికంగా దెబ్బతీసేందుకు మాస్టర్ ప్లాన్ ఒకటి సిద్ధం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇందులో భాగంగా ముందుగా ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం.. అనంతరం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్లి తిరిగి విజయాలను సాధించి టీడీపీ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం.

ముందుగా టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలతో పార్టీకి రాజీనామా చేయించి తటస్థంగా ఉంచుతూ ఆడించడం.. ముగ్గురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లడం ప్లాన్ లో మొదటి అంకంగా కనిపిస్తుంది. వైసీపీ వద్ద ఇప్పుడు అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. ఇప్పటికే కేసులకు బయపడి ద్వితీయ శ్రేణి నుండి ప్రధమ శ్రేణి నాయకులు కొందరు సరెండర్ అయిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఉపఎన్నికలకు వెళ్తే గెలుపు సులువే అవుతుందని.. ఆ గెలుపు టీడీపీ క్యాడర్ ను మరింత నిస్తేజంలోకి నెట్టడంతో పాటు ఇక టీడీపీ మళ్ళీ తిరిగి కోలుకోవడం కష్టమే అనే సంకేతాలను బలంగా పంపాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లుగా గూగుసలాడుకుంటున్నారు. రాష్ట్రానికి రాజకీయంగానే కాకుండా రాజధానిగా ఉన్న కృష్ణాజిల్లా నుండే ఈ ప్లాన్ లో భాగంగా పావులు కదపడం మొదలుపెట్టారట.

గత మూడు రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో హీట్ పెంచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ముందుగా పార్టీకి రాజీనామా చేయించి అవసరాన్ని బట్టి తటస్థంగా ఉండే బృందం.. లేదంటే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికల బ్యాచ్ గా ఉపయోగించుకోనున్నారట. రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమను మూడు భాగాలుగా విభజించి ఒక్కో ప్రాంతానికి ఒక్కో వ్యూహంతో టీడీపీని తిరిగి కోలుకోలేని దెబ్బకొట్టాలని సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారట.

మరి రాజకీయ చతురతుడిగా పేరున్న చంద్రబాబు ఈ వ్యూహాన్ని ఎలా ఛేదిస్తారు? ఇప్పటికీ ఘోర పరాజయం నుండి బయటకు రాలేని క్యాడర్ లో నూతన ఉత్తేజాన్ని నింపే మంత్రమేంటి? ఎన్నో సంక్షోభాలను చూసిన చంద్రబాబు ఈ విపత్తు నుండి ఎలా బయటపడనున్నారు? పార్టీ నేతలు ఆయన్ని విశ్వసించేందుకు అయన ముందున్న ప్రణాళికలేంటి? అన్నది వేచి చూడాల్సిఉంది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle