newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

టీడీపీని అందుకే గోదాట్లో క‌లిపార‌ట‌..!

05-11-201905-11-2019 09:27:54 IST
2019-11-05T03:57:54.101Z05-11-2019 2019-11-05T03:57:50.895Z - - 14-11-2019

టీడీపీని అందుకే గోదాట్లో క‌లిపార‌ట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో తెలుగుదేశం పార్టీ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. 2014 ఎన్నిక‌ల్లో జిల్లాలోని మొత్తం 15 సీట్లు గెలుచుకున్న టీడీపీ 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం రెండు సీట్ల‌కే ప‌రిమితం అయింది. 15 సీట్లు ఇచ్చినా గ‌డిచిన ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీ లేద‌ని జిల్లా వాసులు మండిప‌డుతున్నారు. అందుకే ఈ సారి ఓడించామంటున్నారు.

అభివృద్ధి ప‌నులు చేయ‌క‌పోగా నేత‌లు అడ్డ‌గోలుగా దోచుకున్నార‌ని, అందుకే వారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారంటు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఓట‌మి త‌రువాత నాయ‌కులు క‌నుమ‌రుగైపోవ‌డంతో కేడ‌ర్ కూడా తీవ్రమైన నిస్తేజంలో ఉన్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీలో కార్య‌క‌ర్త‌లు త‌ప్ప నాయ‌కులెవ్వ‌రూ మిగ‌ల్లేదు.

2014 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త‌ప‌ల్లి జ‌వ‌హ‌ర్ ఎక్సైజ్‌శాఖా మ‌త్రిగా ప‌నిచేశారు. ఆయ‌న తీరు న‌చ్చ‌క సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే తిరుగుబాటు చేశారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానం ముందు ధ‌ర్నాకు దిగారు. చంద్ర‌బాబు చెప్పినా తెలుగు త‌మ్ముళ్లు విన‌క‌పోవడంతో జ‌వ‌హ‌ర్‌కు టికెట్ ఇవ్వ‌లేదు. ఆయ‌న్ను కృష్ణా జిల్లా తిరువూరుకు పంపి కొవ్వూరులో అనిత‌కు సీటు ఇచ్చారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి తానేటి వ‌నిత చేతిలో ఆమె ఓడిపోయారు. అంత‌కు ముందు పాయ‌కరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అనిత‌పై కూడా అవినీతి ఆరోప‌ణలు ఉన్నాయి. ఇటు తిరువూరు నుంచి పోటీచేసిన జ‌వ‌హ‌ర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి ర‌క్ష‌ణ నిధి చేతిలో ఓడిపోయారు. ఇద్ద‌రు సిట్టింగ్‌లు నియోజ‌క‌వ‌ర్గాలు మార్చి పోటీచేసినా ఇద్ద‌రూ ఓడిపోయారంటే ప్ర‌జ‌ల్లో ఏ స్థాయిలో వ్య‌తిరేక‌త ఉందో అర్ధ‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే కొత్త‌ప‌ల్లి జ‌వ‌హ‌ర్ ఎమ్మెల్యేగా ప‌నిచేసిన స‌మయంలో త‌న కుమారుడి రిసార్ట్ నిర్మాణం కోసం కొవ్వూరు శ్రీ‌నివాస్‌ఘాట్ వ‌ద్ద ఉన్న దేవ‌తా విగ్ర‌హాల‌ను తొల‌గించారు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళ‌నలు చేశారు. ఓట‌మి త‌రువాత అనిత‌కానీ.. జ‌వ‌హ‌ర్‌కానీ నియోజ‌క‌వ‌ర్గంవైపు కన్నెత్తి చూడ‌లేదు. కొవ్వూరు టీడీపీలో ప్రస్తుతం స్తంబ్ద‌త నెల‌కొంది. దీంతో కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకునే నాధుడే క‌రువయ్యారు.

టీడీపీ నాయ‌కులు పెండ్యాల అచ్చిబాబు, జొన్న‌గ‌డ్డ చౌద‌రిలు కూడా అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో టీడీపీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ఎవ‌రో తెలియ‌ని ప‌రిస్థితి.

ఈ మ‌ధ్య చేసిన ఇసుక దీక్ష‌కు లోక‌ల్ లీడ‌ర్లు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పొరుగు నియోజ‌క‌వ‌ర్గం గోపాల‌పురం క‌న్వీన‌ర్ ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌చ్చారు. ఇటు జ‌వ‌హ‌ర్‌కానీ.. అటు అనిత‌కానీ కార్య‌క్ర‌మానికి రాక‌పోవ‌డంతో కొవ్వూరు టీడీపీలో ఏం జ‌రుగుతుందో తెలియ‌క కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అయోమయంలో ఉన్నారు. ఈ ప‌రిస్థితుల‌న్నింటిని దృష్టిలో ఉంచుకున్న అధికార వైసీపీ త‌న‌దైన శైలిలో టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఇలా ప్ర‌జ‌ల‌ను, న‌మ్ముకున్న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను మోసం చేయ‌డం కార‌ణంగానే ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు టీడీపీని గోదాట్లో క‌లిపారంటూ వైసీపీ నుంచి సెటైర్లు వినిపిస్తున్నాయి.

 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle