newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు

07-12-201907-12-2019 13:46:32 IST
Updated On 07-12-2019 17:48:53 ISTUpdated On 07-12-20192019-12-07T08:16:32.350Z07-12-2019 2019-12-07T08:16:30.589Z - 2019-12-07T12:18:53.549Z - 07-12-2019

టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి షాకిచ్చారు ఆ పార్టీ నేత,  కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు. పార్టీ కండువాకప్పి మస్తాన్‌రావును వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్. దీంతో నెల్లూరు టీడీపీకి భారీ షాక్ తగిలినట్టయింది.

నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపించిన ఆయన వెంటనే జగన్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఆయన్ని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం బీద మస్తాన్ రావు ఏపీ సీఎంగా జగన్ విప్లవాత్మకమయిన పథకాలు చేపట్టారని, ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయన్నారు. ఎలక్షన్‌ మ్యానిఫెస్టోను వైఎస్సార్‌ సీపీ భగవద్గీత, బైబుల్‌, ఖురాన్‌గా భావిస్తోందని అన్నారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని మస్తాన్ రావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.

టీడీపీలో సరైన గౌరవం ఇవ్వడంలేదనే ఉద్దేశంతోనే ఆయన పార్టీని వీడారని అంటున్నారు. బీద మస్తాన్ రావు చేరికతో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని ఆపార్టీ నేతలు అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle