newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

టీడీపీకి షాక్.. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా

21-01-202021-01-2020 13:15:29 IST
Updated On 21-01-2020 13:32:17 ISTUpdated On 21-01-20202020-01-21T07:45:29.869Z21-01-2020 2020-01-21T07:45:27.128Z - 2020-01-21T08:02:17.948Z - 21-01-2020

టీడీపీకి షాక్.. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపికి షాకిచ్చారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇవాళ కీలకమయిన ఏపీ మూడురాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు మండలి సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ సమావేశాలకు హాజరుకాలేదు మాణిక్య వరప్రసాద్. గత అసెంబ్లీ ఎన్నికలలో పత్తిపాడు నుండి పోటీ చేశారు.  డొక్కా రాజీనామాపై టీడీపీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీలో ఆయన కీలక నేతగా వ్యవహరించారు.

Image

తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపించారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు.. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

డొక్కా మాణిక్యవరప్రసాద్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదని భావించి మాజీ ఎంపీ రాయపాటి సూచన మేరకు టీడీపీలోకి వచ్చారు. దీంతో చంద్రబాబు కూడా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్సీ పదవితో పాటూ విప్ బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు.

అయితే, ప్రస్తుత హోంమంత్రి మేకతోటి సుచరిత చేతిలో డొక్కా ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ నిర్ణయం టీడీపీ వర్గాలకు షాకిచ్చేలా వుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle