newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

టీడీపీకి షాక్..యువనేత గుడ్‌బై..? వైసీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్‌

20-10-201920-10-2019 08:23:23 IST
2019-10-20T02:53:23.299Z20-10-2019 2019-10-20T02:52:54.940Z - - 13-12-2019

టీడీపీకి షాక్..యువనేత గుడ్‌బై..? వైసీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి మ‌రో షాక్ త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. పార్టీ యువ‌నేత‌, తెలుగుయువ‌త రాష్ట్ర అధ్య‌క్షులు దేవినేని అవినాష్ పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇప్ప‌టికే వైసీపీ నేత‌ల‌తో సంప్ర‌దింపులు కూడా జ‌రిపార‌ని, ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రెండు రోజుల్లో ఆయ‌న వైసీపీ గూటికి చేరే అవ‌కాశం ఉంది.

కాగా, తెలుగుదేశం పార్టీ ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అవినాష్ భ‌విష్య‌త్‌కు భ‌రోసా త‌న‌దే అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాట‌గా టీడీపీ నేత‌లు ఆయ‌న‌కు చెబుతున్నారు. అయితే, అవినాష్ మాత్రం ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యం తీసుకున్నార‌ని, 23వ తేదీన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి దేవినేని నెహ్రు వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అవినాష్ విజ‌య‌వాడ న‌గ‌రంలో మంచి ప‌ట్టు సంపాదించారు. ప్ర‌త్యేకించి యువ‌త‌లో ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆర్థికంగానూ బ‌ల‌వంతుడు.

దీంతో అన‌తికాలంలోనే ఆయ‌న‌కు టీడీపీలో మంచి గుర్తింపు ల‌భించింది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఇష్టం లేకున్నా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించారు. చివ‌రి నిమిషంలో వెళ్లినా అంగ‌, అర్థ‌, సామాజ‌క‌వ‌ర్గ బ‌లంతో అక్క‌డ కొడాలి నానికి గ‌ట్టి పోటీ ఇచ్చాడు అవినాష్‌.

ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్ప‌టికే ప‌లుమార్లు ఆయ‌న పార్టీ మార‌తానే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న ఖండిస్తూ వ‌స్తున్నారు. పైగా, టీడీపీ చేప‌డుతున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఆందోళ‌న‌ల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. క‌ర‌క‌ట్టపై చంద్ర‌బాబు నివాసం వ్య‌వ‌హారంలో ఆయన ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేశారు. దీంతో అవినాష్ ఇక టీడీపీలోనే కొన‌సాగుతార‌ని అంతా భావించారు.

కానీ, త‌న‌కు విజ‌య‌వాడ న‌గ‌రంపై ప‌ట్టుండ‌టం, న‌గ‌రంలో త‌న‌కు టీడీపీ టిక్కెట్ ద‌క్కే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఆయ‌న భ‌విష్య‌త్‌పై బెంగ‌తో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ నుంచి ఆయ‌న‌కు పిలుపు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

అవినాష్ పార్టీలోకి వ‌స్తే విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పేందుకు వైసీపీ అంగీక‌రించింద‌ని స‌మాచారం.

ఒక‌వేళ ఆయ‌న వైసీపీలో చేరితే కృష్ణ జిల్లాలో, ప్ర‌త్యేకించి విజ‌య‌వాడ న‌గ‌రంలో అద‌న‌పు బ‌లం చేకూర‌నుంది. తెలుగుదేశం పార్టీకి కొంత న‌ష్టం క‌ల‌గ‌వ‌చ్చు. అయితే, క‌మ్మ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన అవినాష్ వైసీపీలోకి వెళితే ఆయ‌న వెంట క్యాడ‌ర్ వెళుతుందా, టీడీపీలోనే ఉండిపోతుందా అనేది చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle