newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

టీడీపీకి మ‌రో బిగ్ షాక్.. రాజీనామా చేసిన కీల‌క నేత‌..!

26-12-201926-12-2019 16:03:44 IST
Updated On 27-12-2019 11:27:20 ISTUpdated On 27-12-20192019-12-26T10:33:44.748Z26-12-2019 2019-12-26T10:33:40.214Z - 2019-12-27T05:57:20.510Z - 27-12-2019

టీడీపీకి మ‌రో బిగ్ షాక్.. రాజీనామా చేసిన కీల‌క నేత‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ టీడీపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యం కాక రేపుతోంది. అయితే, ఇప్ప‌టికే పార్టీ అధిష్టానం వైఖ‌రికి వ్య‌తిరేకంగా జిల్లా నేత‌లంతా రాజ‌ధానిని స్వాగ‌తిస్తూ తీర్మానం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, విశాఖ అర్బ‌న్ టీడీపీ అధ్యక్షుడు రెహ్మాన్ పార్టీకి రాజీనామా చేశారు. మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకించాలంటూ పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌మ‌ను ఆదేశించార‌ని,

విశాఖ‌కు రాజ‌ధాని వ‌స్తుంటే తామెందుకు వ్య‌తిరేకించాలి..? అంటూ ప్ర‌శ్నించారు. నారా లోకేష్ వైఖ‌రి వ‌ల్లే పార్టీలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని రెహ్మాన్‌ అన్నారు.

కాసేప‌టి క్రితం మీడియాతో మాట్లాడిన రెహ్మాన్ ఎక్క‌డో మూల‌న ఉన్న ప్రాంతాన్ని రాజ‌ధాని చేయ‌డ‌మేంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించ‌డం తామంతా అవ‌మానంగా భావిస్తున్నామ‌న్నారు. అసలు చంద్ర‌బాబు కంటికి విశాఖ ప్ర‌జ‌లు ఎలా క‌న‌ప‌డుతున్నారు..? మా లాంటి నాయ‌కుల‌కు రాజ‌కీయం వ‌ద్దు.. మా ప్రాంత అభివృద్ధే ముద్దు అని రెహ్మాన్ అన్నారు.

క‌నుక‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డాన్ని మేమంతా స్వాగ‌తిస్తున్నాం. గ‌త ఐదేళ్ల క్రితం మీరు అమ‌రావ‌తిలో రాజ‌ధానిని ఏర్పాటు చేస్తామంటే మేమంతా ఒప్పుకున్నాం క‌దా..?  కానీ, ఆ ఐదేళ్ల‌లో ఆ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయ‌లేక‌పోయారు..?  ఆ విష‌యాన్ని టీడీపీ చేత‌గానిత‌నంగా భావించిన ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప‌ట్టం క‌ట్టార‌న్నారు.

గ‌త పాల‌న‌లో రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయ‌లేదో చెప్ప‌కుండా మిగ‌తా విష‌యాల‌న్నింటిని చంద్ర‌బాబు మాట్లాడ‌టం హాస్యాస్పందంగా ఉంద‌ని రెహ్మాన్ ఎద్దేవ చేశారు. నారా లోకేష్ రానంత వ‌ర‌కు టీడీపీ బ్ర‌హ్మాండంగా న‌డిచింది. ఆయ‌న వ‌చ్చిన త‌రువాత పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించాడు. నారా లోకేష్ కార‌ణంగా పార్టీలోని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ విష‌యాల‌న్నిటిని క‌డుపు చించుకుంటే కాళ్ల‌మీద ప‌డుతుందని ఇప్ప‌టి వ‌ర‌కు నేనెప్పుడూ మీడియా ముందు మాట్లాడ‌లేదు.

కాగా, ప్ర‌స్తుతం విశాఖ అర్బ‌న్ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉంటున్న రెహ్మాన్ కొద్దిసేప‌టి క్రిత‌మే ఆ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, అర్బ‌న్ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే, ప్ర‌ధానంగా ఎన్ఆర్‌సీ బిల్లు, సీఏఏ బిల్లుతోపాటు విశాఖ‌ను కార్య‌నిర్వాహ‌క రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై రెహ్మాన్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

పార్టీ అధిష్టానం నుంచి మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను ఖండిచాలంటూ ఆదేశాలు వ‌చ్చినా, ఒక విశాఖ‌వాసిగా, స్థిర నివాసం ఏర్పరుచుకున్న వ్య‌క్తిగా తాను జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యానికి ఎలా అడ్డుప‌డ‌గ‌ల‌ను అంటూ చంద్ర‌బాబు నిర్ణ‌యంతో రెహ్మాన్ విభేదించిన‌ట్టు తెలుస్తుంది. అంతేకాక త‌న రాజీనామా లేఖ‌ను ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి పంపుతాన‌ని రెహ్మాన్ చెప్పారు. 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle