newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

టీడీపీకి మ‌రో బిగ్ షాక్‌..!

14-11-201914-11-2019 14:14:30 IST
Updated On 14-11-2019 15:34:01 ISTUpdated On 14-11-20192019-11-14T08:44:30.559Z14-11-2019 2019-11-14T08:44:25.517Z - 2019-11-14T10:04:01.613Z - 14-11-2019

టీడీపీకి మ‌రో బిగ్ షాక్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి తేరుకోక‌ముందే న‌లుగురు ఎంపీలు హ్యాండ్ ఇచ్చేశారు. సైకిల్ దిగి క‌మ‌లం గూటికి చేరిపోయారు. ఆ దెబ్బ‌నుంచి కోలుకుంటుండ‌గానే వ‌ల్ల‌భ‌నేని వంశీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇలా వ‌రుస ప‌రిణామాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సైకిల్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మ‌రో ఇద్ద‌రు కీల‌క నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు.

విజ‌య‌వాడ‌కు చెందిన దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌త కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటూ వ‌స్తున్న దేవినేని అవినాష్ వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గుణ‌ద‌ల‌లోని ఆయ‌న నివాసంలో త‌న అనుచ‌రులు, అభిమానుల‌తో దేవినేని అవినాష్ స‌మావేశ‌మ‌య్యారు.

వైపీపీలోకి వెళ్లాల‌ని అవినాష్‌పై అనుచరులు, అభిమానులు ఒత్తిడి తెచ్చారు. త‌మ‌కు టీడీపీలో గుర్తింపు లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీలో అవినాష్‌కు స‌రైన ప్రాధాన్య‌త లేద‌ని, జ‌గ‌న్ పార్టీలో చేరాల‌ని అభిమానులు సూచించారు. అంతేకాకుండా వైఎస్‌తో దేవినేని నెహ్రూకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేశారు. దీంతో అనుచ‌రుల సూచ‌న‌ల‌తో వైసీపీలో చేరాల‌ని అవినాష్ నిర్ణ‌యించుకున్నారు.

ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిపోయిన లీడ‌ర్ పార్టీని వీడినా పెద్ద‌గా న‌ష్టంలేద‌ని అనుకునే ప‌రిస్థితి టీడీపీకి లేకుండా పోయింది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు కూడా సైకిల్ పార్టీకి షాక్ ఇచ్చే అవ‌కాశం ఉంది. గంటా శ్రీ‌నివాస‌రావు బీజేపీ గూటికి చేర‌డం దాదాపు ఖాయ‌మైంది.

కొన్నాళ్ల క్రిత‌మే బీజేపీ అగ్ర‌నేత‌ల‌ను క‌లిసిన గంటా శ్రీ‌నివాస‌రావు తాజాగా ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో భేటీ అవ‌డం టీడీపీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. గంటాతో భేటీ త‌రువాత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబు మాట‌లను న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరని, త్వ‌ర‌లోనే టీడీపీ ఖాళీ అవ‌డం ఖాయ‌మ‌ని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే చాలా మంది నేత‌లు బీజేపీలోకి వ‌స్తార‌ని చెప్పారు. ఇలా అటు అవినాష్‌, ఇటు గంటా శ్రీ‌నివాస‌రావు ఇద్ద‌రు నేత‌లు పార్టీ మారుతుండ‌టం టీడీపీకి మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హార‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.  ఇప్ప‌టికే చాలా మంది నేత‌ల‌ను పోగొట్టుకున్న టీడీపీ ఈ ఇద్ద‌రు నేత‌ల విష‌యంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle