newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

టీడీపీకి తలనొప్పిగా 'జేసీ' పార్టీ శ్రేణుల్లో ఆందోళన!

20-12-201920-12-2019 13:17:40 IST
2019-12-20T07:47:40.548Z20-12-2019 2019-12-20T07:47:26.823Z - - 05-08-2020

టీడీపీకి తలనొప్పిగా 'జేసీ'  పార్టీ శ్రేణుల్లో ఆందోళన!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జేసీ దివాకర్‌రెడ్డి.. ఆయన ఎక్కడ ఉంటే వివాదం అక్కడే ఉంటుంది. ఆయన వ్యాఖ్యలుసైతం ఇతరులను రెచ్చగొట్టి గొడవకు వచ్చేలా చేస్తాయి.. ఆయన స్వభావం అలాంటిదా.. లేక కావాలనే చేస్తాడో ఎవరికి అర్థంకాదు.. కానీ ఇప్పుడు జేసీ తీరు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి కొంత డ్యామేజ్‌ తెచ్చిపెట్టగా.. తాజాగా పోలీసులతో పెట్టుకొని టీడీపీకి జేసీ మరో తలనొప్పి తెచ్చిపెడుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

జేసీ దివాకర్‌రెడ్డి పేరెత్తితే.. సొంత పార్టీ అయిన టీడీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోడో.. ఎక్కడ తలనొప్పి తెచ్చిపెడతాడో అర్థంకాక ఆ పార్టీనేతలు తలలు పట్టుకుంటున్నారు. అలాఅని జేసీ వ్యాఖ్యలను తప్పుపట్టే ధైర్యం చేసేందుకు సాహసించడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఎంపీగా ఉన్న జేసీ వివాదాస్పద వ్యాఖ్యలే చూస్తూ వచ్చాడు. అడపాదడపా అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఆయన తన స్వభావాన్ని ఏమాత్రం మార్చుకోలేదు.

ఎన్నికల ముందు జేసీ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి కొంత డ్యామేజ్‌ తెచ్చాయని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. పలుసార్లు స్వయంగా పార్టీలోని నేతలపై.. అంతెందుకు చంద్రబాబుపైనా జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పలుసార్లు జేసీ వైసీపీకి కోవర్టులా వ్యవహరిస్తున్నాడా అనే అనుమానాలు టీడీపీ నేతలు వచ్చాయి. దీంతో చంద్రబాబు జేసీతో స్వయంగా మాట్లాడి తీరుమార్చుకోవాలని సూచించారు. చంద్రబాబు సభలు పెడితే అక్కడ జేసీ ఉంటే మైక్‌ ఇవ్వాలన్నా టీడీపీ నేతలు వణికిపోయేవారు. మైక్‌ తీసుకొని చంద్రబాబును పొగుడతాడో.. తిడతారో అర్థంకాని పరిస్థితి. పలుసార్లు సభల్లో జేసీ మాట్లాడుతుండగానే టీడీపీ నేతలు మైక్‌లాక్కున్న ఘటనలు ఉన్నాయి.

తాజాగా ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా జేసీ తనతీరును మార్చుకోలేదు. ఆయన మాట్లాడిన ప్రతిసారి టీడీపీ నేతగా మాట్లాడుతున్నాడా..? వైసీపీ నేతగా మాట్లాడుతున్నాడా..? అర్థంకాని పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్‌రెడ్డి గెలిచిన తరువాత పలుసార్లు మాట్లాడిన జేసీ.. వైసీపీ పాలన బాగుందని చెప్పుకొచ్చారు. జగన్‌ను మావాడు అంటూనే జగన్‌పై ప్రశంసలు కురిపించిన ఘటనలు ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలతో పార్టీ నేతలు ఏం చేయలేక తలలు పట్టుకోవాల్సి వస్తుంది.

తాజాగా జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరంలో గత రెండు రోజుల క్రితం చంద్రబాబు పర్యటించిన సమయంలో అక్కడ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో జేసీ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీకి తొత్తులుగా ఉన్నారని.. తాము అధికారంలోకి వస్తామని.. మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేసీ తీరుపై పోలీస్‌ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జేసీ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఘాటుగా విమర్శించారు.

జేసీతోనే ఆగకుండా పోలీస్‌ అసోసియేషన్‌ నేతలు చంద్రబాబుపైనా మండిపడ్డారు. జేసీ పోలీసులపై అనుచితవ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు చూస్తుండిపోవటం సరికాదని అన్నారు. అంతటితో ఆగకుండా వైసీపీ ఎంపీ, మాజీపోలీస్‌ మాధవ్‌.. పోలీసుల బూటు తుడిచి, ముద్దు పెట్టుకొని పోలీస్‌ గౌరవాన్ని చాటుతూ జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో జేసీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ వర్సెస్‌ పోలీసులు అన్నట్లుగా మారిపోయింది.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై కేసులు బనాయిస్తుంది. దీంతో అక్కడక్కడా పలువురి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా జేసీ వ్యాఖ్యలతో టీడీపీ వర్సెస్‌ పోలీసులుగా మారడంతో ఇకపై మరిన్ని కష్టాలు ఎదురవుతాయని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు కొద్దోగొప్పో మధ్యస్తంగా ఉన్న పోలీసులుసైతం ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందని, ఇదంతా జేసీ తీరే కారణమని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలోనూ జేసీ తీరుతో కొంత నష్టపోయామని, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ఆయన తీరు తమకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. జేసీ పై చంద్రబాబు ఏదోఒక చర్య తీసుకోవాలని, లేకుంటే పార్టీకి నష్టం చేకూరుతుందని పార్టీలోని పలువురు నేతలు స్పష్టం చేస్తున్నారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle