newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. ఓటమి అంచున మంత్రులు

23-05-201923-05-2019 10:51:53 IST
Updated On 27-06-2019 11:34:39 ISTUpdated On 27-06-20192019-05-23T05:21:53.516Z23-05-2019 2019-05-23T05:21:51.931Z - 2019-06-27T06:04:39.220Z - 27-06-2019

టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. ఓటమి అంచున మంత్రులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతోంది. దాదాపు 130కు పైగా శాసనసభా స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీడీపీ సుమారు 30 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం. పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. కిడారి శ్రవణ్‌, నారాయణ, అఖిలప్రియ, లోకేశ్‌, సోమిరెడ్డి, అయ్యన్న పాత్రుడు, పితాని, సుజయ్ క‌ృ‌ష్ణ రంగారావు, చినరాజప్పలు వెనుకంజలో ఉండగా, దేవినేని ఉమ, జవహర్‌ తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం చంద్రబాబునాయుడు  తనయుడు మంత్రి నారా లోకేశ్‌ వెనుకంజలో ఉన్నారు. 

టీడీపీకీ కంచుకోటలాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి చావుదెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో 4 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంటే, పశ్చిమగోదావరి జిల్లాలో 1 చోట ఆధిక్యంలో టీడీపీ కొనసాగుతోంది. రెండు జిల్లాల్లో టీడీపీ ప్రభంజనం కలగా మిగిలింది. ఇక్కడ గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ముందునుంచీ ఆనవాయితీ ఉంది.

ఈసారి మాత్రం గోదావరి ఉప్పెనలో సైకిల్ కొట్టుకుపోయింది. ఫ్యాన్‌ జోరుకు అధికార టీడీపీ బేజార్‌ అయింది. ఆస్థాన సర్వేలు చేసే లగడపాటి రాజగోపాల్‌ పలికిన పలుకులతో ధీమాగా ఉన్న టీడీపీ క్యాడర్‌.. ఫలితాలు చూసి కంగుతింది. వైఎస్సార్‌సీపీ 135 సీట్ల ఆధిక్యం సాధించడంతో తమ్ముళ్లు ముఖం చాటేశారు. ఎప్పుడూ హడావిడిగా ఉండే చంద్రబాబు నివాసం వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో బోసిపోయింది. పార్టీ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. తొడకొట్టిన బుడ్డా వెంకన్న ఆచూకీదొరకడం లేదని వైసీపీ నేతలు కామెంట్లు చేయడం కనిపించింది. 

ఫలితాలన్ని వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా వస్తుండటం.. పార్టీ అధినేత, 40 ఏళ్ల అనుభవజ్ఞుడు చంద్రబాబే ఓటమి దిశగా కుప్పంలో వెనుకంజలో నిలవడం.. తెలుగు తమ్ముళ్లను దిక్కుతోచని స్థితి పడేసింది. ఇక ఎప్పుడు సోషల్‌ మీడియా వేదికగా హడావుడి చేసే తమ్ముళ్లు తాజా ఫలితాలతో నోరు మెదపడం లేదు. యాక్టివ్‌గా ఉండే చంద్రబాబు ఆయన సుపుత్ర రత్నం నారాలోకేష్‌, టీడీపీ అధికారిక ట్విటర్‌ అకౌంట్లు మూగబోయాయి. మొత్తం మీద మే 23 టీడీపీ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం సృష్టించబోతోందని, టీడీపీ చరిత్రలో ఇన్ని తక్కువ సీట్లు రావడం ఇదే ప్రథమం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle