newssting
BITING NEWS :
*ఏపీ కేబినెట్ భేటీ. శాసనమండలి రద్దుకి ఆమోదం*భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

టీటీడీ వెబ్‌సైట్‌లో శ్రీయేసయ్యః శ్రీవేంకటేశాయనమః!

02-12-201902-12-2019 12:35:40 IST
2019-12-02T07:05:40.517Z02-12-2019 2019-12-02T07:05:17.429Z - - 27-01-2020

టీటీడీ వెబ్‌సైట్‌లో శ్రీయేసయ్యః శ్రీవేంకటేశాయనమః!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్యమత ప్రచారం ఎక్కువగా జరిగిపోతుందని పలువులు హిందూమత సానుభూతిపరులు, హిందూ ధార్మిక సంఘాలు పలుసందర్భాలలో అభిప్రాయపడుతున్న సంగతి అందరూ చూస్తున్నదే. ఇక రాజకీయ పార్టీల ఆరోపణలకైతే కొదువేలేదు. దీనిపై ఏపీ ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ఖండించినా ఆరోపణలకు అవకాశం కల్పించే ఘటనలు మాత్రం పునరావృతమవుతూనే ఉన్నాయి.

తిరుమలలో అన్యమతప్రచారం జరిగిపోతుందని తీవ్రంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై టీటీడీలో పనిచేసే ఉద్యోగులు చర్చిలలో ప్రార్ధనలకు వెళ్ళడం దగ్గర నుండి కొండపైనే అన్యమతప్రచారం వరకు పలు సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో వీడియోల రూపంలో చక్కర్లు కొట్టాయి. వీటికి తోడు రాష్ట్ర దేవాదాయ శాఖ నిధులను క్రైస్తవ మతస్థుల జెరూసలేం యాత్ర కోసం ఆర్ధిక సాయంకు మళ్లించారని ఆరోపణలొచ్చాయి.

టీటీడీ వ్యవహారంలో అతిగా జోక్యం చేసుకున్నారనే సిఎస్ గా ఉన్న ఎల్వీసుబ్రహ్మణ్యంను తొలగించారని కథనాలు వినిపించాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పిన ప్రభుత్వ పెద్దలు అన్యమత ప్రచారానికి మాత్రం కట్టడి చేసే చర్యలను తీసుకోవడంలో విఫలమవుతున్నారు. తాజాగా ఏకంగా టీటీడీ వెబ్ సైట్లోనే శ్రీ యేసయ్య, శ్రీవేంకటేశాయ నమః అని కనిపించడం వెంకన్న భక్తులను విస్తుగోలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరుడు భక్తులలో టీటీడీ క్యాలెండర్ పై మీద కూడా అంతే నమ్మకాలుంటాయి. ఆ క్యాలెండర్ తమ ఇంట్లో ఉండాలని అని కోరుకొనే వాళ్ళు కోట్లాదిమంది ఉన్నారు. ఈక్రమంలోనే టీటీడీ 2020 క్యాలెండర్ కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తుంటే టీటీడీ అధికారిక వెబ్ సైట్ 'టీటీడీ.ఓఆర్జీ'లో 'శ్రీయేసయ్య, శ్రీవేంకటేశాయ నమః వికారి నమ సంవత్సర సిద్దాన పంచాబ్ధము' అని కనిపించడంతో ఖంగుతిన్నారు.

Image result for Sri Yesayya Sri Venkatesaya Namaha words on the TTD website!

2020 సంవత్సర పంచాంగాన్ని టీటీడీ ఉగాది రోజైన ఏప్రిల్‌ 6న అప్‌లోడ్‌ చేసింది. అప్పుడు ‘శ్రీ ఐ నమః శ్రీ వేంకటేశాయనమః’ అని ఉండగా శుక్రవారం ఉదయం నుండి  ‘శ్రీయేసయ్యః శ్రీవేంకటేశాయనమః’ అని మారిపోయింది. దీనిపై హిందూ సంఘాలు ఈఓకు ఫిర్యాదు చేయడంతో శనివారం మధ్యాహ్నం వరకు కూడా వెబ్ సైట్ లో కనిపించకుండా చేశారు. అయితే గూగుల్ సెర్చ్ లో మాత్రం అది కనిపిస్తూనే ఉంది.

ఆదివారం ఉదయానికి కానీ గూగుల్ సెర్చ్ లో కూడా కనిపించకుండా చేయగలిగారు. దీనిపై స్పందించిన టీటీడీ అధికారులు మాత్రం ఇది ఇంటర్ ప్రిటేషన్ వలన జరిగిన పొరపాటుగా పేర్కొన్నారు. కానీ అదే నిజమైతే ఆరు నెలలుగా కనిపించకపోవడం, అక్షర దోషాలు లేదా పదాల తప్పులు ఉండాలి కానీ స్పష్టంగా శ్రీ యేసయ్య అని పదం ప్రత్యక్షం కావడం అసంభవం అని టెక్నీకల్ నిపుణులు చెప్తున్నారు.

ఇక హ్యాకర్లు చేసిన పని అయ్యే అవకాశం కూడా లేదని, హ్యాకర్లు అయితే కొత్త పదాన్ని జోడించి మాత్రమే ఎందుకు వదిలేస్తారని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది ఖచ్చితంగా వెబ్ సైట్ యాక్సిస్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసిన పనిగా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం సైబర్ నిపుణులతో విచారణ జరిపితే ఇది ఎవరి పని అన్నది సులభంగా తేల్చేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.

కానీ ప్రభుత్వం, టీటీడీ పెద్దలు మాత్రం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఎవరికీ అంతుబట్టని వ్యవహారంగా పేర్కొంటున్నారు. గతంలో కూడా ఇదే టీటీడీ అధికారిక వెబ్ సైట్లో శ్రీవారి సంకీర్తనల్లో అన్యమత దైవాన్ని స్తుతించే కీర్తనలు కనిపించాయి. అప్పుడు కూడా టీటీడీ వాటిని తొలగించి సరిపెట్టుకోగా ఇప్పుడు పదాలను తొలగించి విజిలెన్స్ విచారణకు ఆదేశించడం అనుమానాలకు తావిస్తుంది. దీనిపై సైబర్ విచారణ జరపడం ఎంతైనా అవసరమని నిపుణుల అభిప్రాయం.

 

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   an hour ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   2 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   4 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   4 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   4 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   4 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   8 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   8 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   9 hours ago


టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ ప్లాన్‌కు నేష‌న‌ల్ పార్టీల లోక‌ల్ కౌంట‌ర్‌..!

టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ ప్లాన్‌కు నేష‌న‌ల్ పార్టీల లోక‌ల్ కౌంట‌ర్‌..!

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle