newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

20-11-201920-11-2019 16:02:59 IST
2019-11-20T10:32:59.719Z20-11-2019 2019-11-20T10:32:55.433Z - - 13-08-2020

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బలహీనుడిని బలవంతుడు కొడితే.. బలవంతుడిని భగవంతుడు కొడతారంటారు. కొద్దిపాటి మార్పులతో ఈ సామెతను ఏపీ రాజకీయ అవసరాలకు వాడుకోవచ్చేమో అనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారంతో బలంగా ఉన్న వైసీపీ బలహీనంగా ఉన్న ప్రతిపక్షాన్ని ఓ ఆట ఆడేసుకుంటుంది. ఇక ఆ పార్టీ నేతలైతే ప్రతిపక్ష నేత, మాజీ సీఎంను సైతం నోటికి ఎంతటి మాటలొస్తే అంతటి దూషణలతో లెక్కలేకుండా తిట్టిపోస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని తలిస్తే వైసీపీ గట్టి షాక్ ఇచ్చి టీడీపీని కోలుకోకుండా చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇలా రెచ్చిపోతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికార పార్టీకి అప్పుడప్పుడు ఝలక్ లు ఇస్తుంది. ఏపీ మంత్రి కొడాలి నానీ ఈ మధ్య కాలంలో బాగా వార్తలలో నానుతున్నారు. ప్రతిపక్షం మీద నోరుపారేసుకోవడంలో ముందుండే ఈయనపై ఇప్పుడు బీజేపీ నేతలు ఫిర్యాదులు చేశారు.

ఈ మధ్యనే కొడాలి నానీ.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద అంతెత్తున లేచారు. ఉన్నత పదవిలో ఉన్న కొడాలి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేశారు. ఆ మాటలలోనే సీఎం జగన్ తిరుమలకు వస్తే సంతకం పెట్టాలా? తిరుపతి ఏమైనా చంద్రబాబు తాత కట్టించారా అంటూ దుర్భాషలాడారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావ్ భూపాల్‌కు ఫిర్యాదు చేశారు.

మంత్రి కొడాలి నానీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, చట్టాన్ని అతిక్రమించేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని, అలా మాట్లాడడం శిక్షార్హమైన నేరమని ఆధారాలతో సహా ఎస్పీకి అందించి కేసు నమోదు చేయాలని కోరారు. ముందుగా విచారణ చేసి సమాధానం చెప్తామని బీజేపీ నేతలకు సమాధానమిచ్చారు. దీనిపై బీజేపీ నేతలు మరింత ఒత్తిడి తెచ్చే సూచనలే కనిపిస్తున్నాయి.

నిజానికి ఈ విషయంలో మంత్రి కొడాలి వ్యాఖ్యలపై అందరూ మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారిని అన్యమతస్థులెవరైనా సరే దర్శించుకునే ముందు డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ దేవుడి మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉండడంతోనే దర్శనానికి వెళ్తున్నామని ఆ డిక్లరేషన్ ఉద్దేశ్యం. ఇందుకు ఎంతపెద్ద స్థాయిలో ఉన్న అన్యమతస్థుడైనా అతీతం కాదు. ఇదే తిరుమల సంప్రదాయం.

మరి జగన్ సీఎం అయినంత మాత్రాన సంప్రదాయాలను పక్కనపెట్టాలని మంత్రి కొడాలి మాట్లాడారా? హోదాలో ఉన్నంతమాత్రాన  అన్యమతస్థులు డిక్లరేషన్ లేకుండా దర్శనానికి వెళ్లవచ్చని చెబుతున్నారా? అనే విమర్శలు తలెత్తుతున్నాయి. గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చే శ్రీవారికి దర్శనానికి వెళ్లారు. అదే గౌరవం కూడా.. మరి ఈ విషయం మంత్రి నానీకి బొధపడేది ఎప్పుడో?

 

 

 

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

   24 minutes ago


ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   an hour ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   an hour ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   an hour ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   3 hours ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   3 hours ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   3 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   3 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   3 hours ago


  పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

   5 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle