newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

టీటీడీ బోర్డులో సంపన్నులకు తప్ప భక్తులకు చోటే లేదా?

19-09-201919-09-2019 10:02:27 IST
Updated On 19-09-2019 13:29:23 ISTUpdated On 19-09-20192019-09-19T04:32:27.595Z19-09-2019 2019-09-19T04:32:21.862Z - 2019-09-19T07:59:23.317Z - 19-09-2019

టీటీడీ బోర్డులో సంపన్నులకు తప్ప భక్తులకు చోటే లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వాలు ఎన్ని మారినా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నడత మాత్రం మారలేదు. బోర్డు సభ్యుల ఎంపిక ప్రక్రియ విధానం దానికదే ఒక బ్రహ్మపదార్థంలా మారిపోవడం గమనార్హం. ఇంతవరకు టీటీడీ బోర్డులో వ్యాపారస్థులు, ఉన్నతవర్గాలు, రాజకీయ నేతలు మాత్రమే సభ్యులుగా చేరే అదృష్టం దక్కించుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయం చివరకు సంపన్నుల సేవలోనే తరిస్తోందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

బుధవారం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన టీటీడీ బోర్డు సభ్యుల జాబితాను పరిశీలిస్తే ఒక్క సామాన్యుడికి కూడా బోర్డులో చోటు దక్కలేదని స్పష్టమవుతుంది. ఒక చైర్మన్, 24 మంది నామినేటెడ్ సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కూడిన పూర్తి స్థాయి బోర్డు జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో సభ్యులుగా నియమితులైన వారి జాబితా చూస్తే టీటీడీ బోర్డు సామాన్యులకు ఇంత దూరం జరిగిందా అని ఎవరికైనా ఆలోచన రాకతప్పదు.

ఒక్కసారి ఈ జాబితా కేసి చూద్దాం. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ నారాయణస్వామి శ్రీనివాసన్, తెలంగాణ ప్రముఖ వ్యావార వేత్త, మై హోమ్స్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, హెటెరో గ్రూప్ చైర్మన్ బి. పార్థసారధి రెడ్డి, ప్రముఖ సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి, కావేరి సీడ్స్ చైర్మన్, ఎండీ వంటి అపర సంపన్నులే టీడీడీ బోర్డుకు చెందిన 24 మంది సభ్యులుగా నియమితులయ్యారు.

లోక్‌సభ మాజీ ఎంపీ, వైఎస్ జగన్ సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి గతంలోనే టీటీడీ చైర్మన్‌గా నియమితులయ్యారు. గతవారం ప్రభుత్వం చైర్మన్, సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులతో సహా బోర్డు సభ్యులను 19 నుంచి 29కి పెంచింది.  ఏపీ, తెలంగాణ వైఎస్సార్ సీపీకి చెందిన నేతలకు బోర్డుసభ్యులుగా అవకాశం దక్కింది. తెలంగాణలో వైసీపీ నేత పుట్టా ప్రతాప్ రెడ్డి, కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత చిప్పగిరి ప్రసాద్ కుమార్‌కి టీటీడీ బోర్డు సభ్యత్వం దక్కింది.

అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను కూడా టీడీడీ బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఏపీ నుంచి 8 మంది, తెలంగాణ నుంచి 7మంది, తమిళనాడు నుంచి 4గురు, ఢిల్లీ నుంచి ఒకరు, కర్ణాటక నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి ఒకరు టీడీడీ సభ్యులుగా నియమితులయ్యారు.

ఏపీ చెందిన ఎమ్మెల్యేలు యూవీ రమణ మూర్తి, మల్లికార్జున రెడ్డి, కె. పార్థసారధిరెడ్డితోపాటు వి. ప్రశాంతి, నాదెండ్ల సుబ్బారావు, డిపి. అనంత, చిప్పగిరి ప్రసాద్ కుమార్‌లకు బోర్డు సభ్యత్వం దక్కింది. ఇక తెలంగాణ నుంచి రామేశ్వరరావు, పార్థసారథి రెడ్డి, యు వెంకట భాస్కరరావు, మూరం సెట్టి రాములు, డి దామోదర రావు, కె. శివకుమార్, పుట్టా ప్రతాపరెడ్డి బోర్డులో స్థానం దక్కించుకున్నారు. తమిళనాడు నుంచి కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్ శ్రీనివాసన్, డాక్టర్ నచిత ముత్తవరపు, కుమారగురు (ఎమ్మెల్యే) కి బోర్డు సభ్యత్వం దక్కగా, కర్నాటక నుంచి రమేష్ సెట్టి, సంపత్ రావి నారాయణ, సుధానారాయణ మూర్తి బోర్డు సభ్యత్వం పొందారు. ఢిల్లీ నుంచి శ్రీమతి శివ శంకరన్, మహారాష్ట్ర నుంచి రాజేశ్  శర్మ కూడా టీటీడీ బోర్డు సభ్యులయ్యారు.

వీరితోపాటు  ప్రభుత్వం నలుగురు ఎక్స్ అపిషియో సభ్యులను బోర్డు సభ్యులుగా నియమించింది. వీరిలో తుడా చైర్మన్, దేవాదాయ శాఖ కమిషనర్, టీటీడీ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు.ఈ  సభ్యుల వివరాలు, వారి హోదాలు అన్నీ బాగున్నాయి కానీ సంవత్సరానికి రూ.3,100 కోట్ల బడ్జెట్తో నడుస్తున్న టీడీడీకీ సామాన్య భక్తులే నిత్యం ఆపారమైన కానుకలను, నగదును హుండీ రూపంలో అందిస్తున్నారు.

ప్రభుత్వ పదవుల్లో, నామినెటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో బీసీలకు, ఎస్సీలకు, మహిళలకు సగం స్థానాలు కల్పించి సంచలన సృష్టించిన వైఎస్ జగన్ టీటీడీ బోర్డు సభ్యుల్లో కూడా ఈ రిజర్వేషన్ పాటించి ఉంటే సమన్యాయం జరిగి ఉండేదని పలువురి వ్యాఖ్య.

ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం ఆర్జిస్తున్న హిందూ దేవాలయంగా ప్రసిద్ధి కెక్కిన తిరుమల ఆలయంలో అన్ని విభాగాల్లో  సామాజిక న్యాయం అమలు కాకపోవడం విచారకరం.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle