newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

టీటీడీ బంపర్ ఆఫర్.. భక్తులకు ఉచిత లడ్డూ

01-01-202001-01-2020 08:53:36 IST
2020-01-01T03:23:36.127Z01-01-2020 2020-01-01T03:23:20.111Z - - 22-01-2020

టీటీడీ బంపర్ ఆఫర్.. భక్తులకు ఉచిత లడ్డూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం రోజూ వేలాదిమంది ఏడుకొండలకు వెళతారు. కొందరు భక్తులు కాలినడకన స్వామివారిని దర్శించుకుంటే.. మరికొందరు క్యూ కాంప్లెక్స్ లో వేచి వుండి స్వామిని దర్శించకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం దైవ దర్శనం చేసుకున్న భక్తులకు నూతన సంవత్సర కానుక అందించనుంది. స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించింది. 

Image result for tirumala temple laddu"

ఒక భక్తునికి ఒక లడ్డు ఇవ్వనుంది. అలాగే, అదనపు లడ్డు కోసం సిఫార్సు లెటర్ లేకుండా  ఇవ్వాలని టిటిడి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వైకుంఠ ఏకాదశి నుంచి అమలు చేయనుండడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Image result for tirumala temple"

ఇంతకుముందు నడకదారిలో వచ్చే భక్తులకు, వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చేవారికి మాత్రమే ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించేవారు. కానీ ఇప్పుడు అందరూ ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. దళారీ వ్యవస్థకు స్వస్తి పలికేందుకు టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు 24 లక్షల విలువైన లడ్డూలు అందించనున్నారు. ఈ లడ్డూ ధర రూ.50. ఇందుకోసం టీటీడీ రోజూ లడ్డూల తయారీ సామర్ధ్యాన్ని పెంచనుంది. 

Image result for tirumala temple"

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle