newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

టీటీడీ ప్రక్షాళనపై ‘జగన్’ ఫోకస్.. కీలక బదిలీలు!

02-07-201902-07-2019 15:55:46 IST
2019-07-02T10:25:46.789Z02-07-2019 2019-07-02T10:25:42.855Z - - 20-09-2019

టీటీడీ ప్రక్షాళనపై ‘జగన్’ ఫోకస్.. కీలక బదిలీలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధికారంలోకి వచ్చి నెలరోజులు పూర్తయింది. ఏడాదిలో ఉత్తమ సీఎం అనిపించుకుంటానని ప్రమాణ స్వీకారం నాడే చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన రీతిలో పాలనలో మార్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగంపై దృ‌ష్టిపెట్టారు. తాజాగా ప్రతిష్టాత్మకమయిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉంచిన తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ పగ్గాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీలో ఎంతోకాలంగా తిష్టవేసుకుని కూర్చున్న అధికారులపై బదిలీ వేటు వేస్తున్నారు. 

తాజాగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుని బదిలీ చేశారు. ఆయన స్థానంలో బసంత్ కుమార్ ను నియమించారు. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. బసంత్‌కుమార్‌ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, బసంత్‌కుమార్‌ ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. టీటీడీలో ఏ అధికారి బదిలీ అయినా శ్రీనివాసరాజు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నియమించబడ్డ శ్రీనివాసరాజుని మార్చాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. కానీ ఆయన్ని మార్చలేకపోయారు. 

ఏడున్నరేళ్లకు పైగా ఒకే పోస్టులో ఉంటూ హ‌వా సృష్టించిన టీటీడీ జేఈవో శ్రీనివాస రాజును సీఎం జగన్ అక్కడినించి కదిలించారు. ఢిల్లీలో రాజ్యాంగ‌బ‌ద్ద ప‌ద‌విలో ఉన్న వ్యక్తి ఆశీస్సుల‌తోనే ఆయ‌న అక్కడ కొన‌సాగార‌నే ప్రచారం ఉంది. అదే విధంగా తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒక ద‌శ‌లో టీడీపీ నుండి పోటీ చేస్తార‌ని చెప్పుకున్నారు. కానీ అదేం జరగలేదు.

టీటీడీలో ఈవో కంటే ఒక విధంగా శ్రీనివాస రాజే అన్ని విభాగాల్లోనూ కీల‌కంగా మారారు. ప్రధాని, రాష్ట్రపతి, వివిధ దేశాల అధ్యక్షులు, ప్రముఖ వ్యక్తులు..పారిశ్రామిక వేత్తలు..రాజ‌కీయ నేత‌లు .. న్యాయ‌మూర్తులు ఎవ‌రు శ్రీవారి ద‌ర్శనానికి వ‌చ్చిన శ్రీనివాస రాజు దగ్గరుండి వారికి దర్శనం ఏర్పాట్లు చేయించేవారు. టీటీడీ ఈవో కంటే టీటీడీ జేఈవోనే కీలకంగా వ్యవహరించేవారు. ఆయన్ని మార్చడంతో టీటీడీలో ఎన్నో ఏళ్ళుగా ఉన్న అధికారులకు మరిన్ని బదిలీలు తప్పవంటున్నారు. 

అలాగే స్వామివారి దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రస్తుతం ప్రొటోకాల్ దర్శనంతో పాటు ఎల్1, ఎల్2, ఎల్3లుగా ఉన్న వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించాలని భావిస్తున్నారు.

అందులో భాగంగా వివిధ రకాల వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేయడం ద్వారా సామాన్యులకు చేరువ చేయనున్నారు. త్వరలో ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిగా ఏర్పడిన తరువాత తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద టీటీడీ ప్రక్షాళనకు ఇది ముందడుగు మాత్రమేనని ఇంకా చేయాల్సింది ఎంతో ఉందంటున్నారు సుబ్బారెడ్డి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle