newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

టీటీడీ కీలక నిర్ణయాలు.. కాశీ, కాశ్మీర్లో శ్రీవారి ఆలయాలు

29-12-201929-12-2019 09:32:33 IST
2019-12-29T04:02:33.082Z29-12-2019 2019-12-29T04:02:24.373Z - - 13-08-2020

టీటీడీ కీలక నిర్ణయాలు.. కాశీ, కాశ్మీర్లో శ్రీవారి ఆలయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ బడ్జెట్‌ రూ.3243.19 కోట్లకు సవరించామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగిందని ఆయన చెప్పారు. రూ.1231 కోట్లు అంచనా వేయగా...ఇప్పుడు రూ.1285 కోట్లు వచ్చాయి. ప్రసాదాలకు రూ.270 కోట్లు ఉంటే దాన్ని రూ.330 కోట్లు వస్తుందని అంచనా వేయడం జరిగింది. తిరుమల తిరుపతిలోని పద్మావతి శ్రీనివాస మండపంలో సెంట్రలైజ్డ్‌ఏసీ ఏర్పాటుకు రూ.3 కోట్లు మంజూరు చేశామన్నారు.2

పరిపాలన భవనాలకు మరమ్మతులకు రూ. 14.5 కోట్లు మంజూరు, కొంతమంది టీటీడీ అకౌంటింగ్‌డిపార్టుమెంట్‌లో త్వరలో రిక్రూట్ మెంట్ పూర్తిచేయనున్నారు. పాలక మండలి సమావేశంలో రమణదీక్షితులకు గౌరవ ప్రధాన అర్చకుడి హోదా కల్పిస్తూ తీర్మానం చేశారు.

ప్రస్తుతం ఉన్న నలుగురు అర్చకులు అదే విధంగా ఉంటారని రమణ దీక్షీతులు అనుభవంతో ఆగమ సంప్రదాయల పట్ల మిగతా అర్చకులకు సలహాలు ఇస్తారని టీటీడీ వెల్లడించింది.తిరుమలలోని రెండు ఘాట్ రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు పది కోట్లు, ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 30 కోట్ల నిధులు మంజూరు చేశారు.

అలాగే జమ్మూకశ్మీర్‌లో కూడా వెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించనుంది.  ఆలయం కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాయనుంది టీటీడీ. ఇటు యూపీలోని వారణాసిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించడానికి బోర్డులో నిర్ణయం తీసుకుంది. యూపీ గవర్నమెంట్‌కు భూ కేటాయింపుకు లేఖ రాయనుంది. తిరుమలలోని వరహా స్వామి ఆలయానికి రాగి రేకులు, బంగారు పనులు చేపట్టేందుకు రూ.14 కోట్లతో టీటీడీ ఖజానా నుంచి బంగారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. 

తిరుమల ఘాట్ రోడ్లకు బీటీ వేయాలా, సీసీ రోడ్లు వేయాలా అనేది నిపుణుల కమిటీ నిర్ఱయిస్తుందని సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే తిరుమల, తిరుపతిలో సైబర్‌సెక్యూరిటీ విభాగాన్ని పూర్తిస్థాయిలో  ఏర్పాటు చేయనుంది. సోషల్‌మీడియా సైబర్‌సెక్యూరిటీ వింగ్‌ కంట్రోల్‌ చేయలేకపోతే దుష్ప్రచారానికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది.

లోగడ జరిగిన కొన్ని దుష్ప్రచారాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎవరన్నా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే, పేపర్లలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఎలా కంట్రోల్ చేయాలి, అలా చేసిన వారిని వెంటనే ఎలా గుర్తించాలి, వారిపై ఎలా చర్యలు తీసుకోవాలో చర్చించామన్నారు.

టీటీడీపై చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన వార్లలపై పరువునష్టం కేసు వేస్తామన్నారు. స్వామివారి పరువుకు భంగం కలిగిస్తే వారిపై 100 కోట్లకుపైగా పరువు నష్టం కేసు వేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. . వైకుంఠ ఏకాదశి రోజు కూడా గతంలో విఐపీలకు ఇచ్చిన దర్శన సమయానికి అరగంట తక్కువే ఇస్తూ, సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది టీటీడీ. 

 

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

   30 minutes ago


ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

   an hour ago


ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   an hour ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   2 hours ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   2 hours ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   3 hours ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   3 hours ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   4 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   4 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle