newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

టీఆర్ఎస్- వైసీపీ రహస్య బంధం...?

14-03-201914-03-2019 12:40:45 IST
2019-03-14T07:10:45.546Z14-03-2019 2019-03-14T07:10:43.240Z - - 21-08-2019

టీఆర్ఎస్- వైసీపీ రహస్య బంధం...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్ఎస్- వైసీపీ రహస్య స్నేహానికి సంబంధించి ఒక ఫోటో ప్రచార మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం కోసం టీఆర్ఎస్ వాహనాలు వాడుతున్నారని నెల్లూరులో ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ సిద్ధం చేసుకున్న జిప్సీలో సీటింగ్ కవర్లు టీఆర్ఎస్ సింబల్‌తో కనిపిస్తున్నాయి. గులాబీ సీట్లు..కారు సింబల్ ఉన్న ఈ వాహనం నెల్లూరులో కనిపించటంతో ఇవి తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ ఉపయోగించుకున్న వాహనాలనే..రీ స్టికరింగ్ చేసి వైసీపీ వాడుకుంటోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.

వైసీపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహనకు ఇవే నిదర్శనం అంటూ టీడీపీ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. ఏపీపై కుట్ర చేసేందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటి అయ్యాయని ఏపీ సీఎంతో సహా టీడీపీ నేతలంతా మీడియా సాక్షిగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో టీఆర్ఎస్ గోడ గడియారాలను రీ స్టిక్కరింగ్ చేసి వైసీపీ పంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ పెయింటింగ్ ఉన్న ప్రచార వాహనంలో టీఆర్ఎస్ సింబల్ ఉండటంతో మరోసారి దుమారం రేగుతోంది. ఎన్నికల వేళ ఏ చిన్న అవకాశాన్నీ టీడీపీ వదులుకోవడం లేదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle