newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

టార్గెట్‌ చంద్రబాబు..! వైసీపీకే డ్యామేజ్‌!!

17-12-201917-12-2019 12:32:27 IST
2019-12-17T07:02:27.006Z17-12-2019 2019-12-17T07:02:24.319Z - - 22-01-2020

టార్గెట్‌ చంద్రబాబు..! వైసీపీకే డ్యామేజ్‌!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా అంటూ కాలుదువ్వుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా వైసీపీని ఇరికాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గతవారం రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వీరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వైసీపీలోని సభ్యులంతా ప్రతిపక్షనేత చంద్రబాబునే టార్గెట్‌గా ప్రసంగాలు చేశారు. ఈ పరిణామాలు ప్రజల్లో వైసీపీకే డ్యామేజ్‌ను కలిగిస్తాయనే వాదన వినిపిస్తుంది.

అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటినుంచి సభలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి దగ్గర నుండి వైసీపీలో మొదటిసారి గెలిచిన ప్రతీ సభ్యుడి వరకు ప్రతిపక్షనేత చంద్రబాబును టార్గెట్‌గా ప్రసంగాలు చేశారు. ప్రతిపక్షం నుంచి ఏ సభ్యుడు అధికార పార్టీకి ప్రశ్నలు సంధించినా.. వైసీపీ సభ్యులు మాత్రం చంద్రబాబు పేరును ప్రస్తావించిన తరువాతనే సమాధానమిస్తూ రావటం అసెంబ్లీలో స్పష్టంగా కనిపించింది. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సభ్యులుసైతం చంద్రబాబుపై పంచ్‌ల వర్షంకురిపించడం గమనార్హం. తొలి రెండుమూడు రోజులు చంద్రబాబుసైతం ఘాటుగా స్పందించినా తరువాత వారిమాటలను పట్టించుకోవటం మానేశారు.

ముఖ్యంగా వైసీపీలోని మహిళా సభ్యులుకూడా చంద్రబాబు పేరులేకుండా అసెంబ్లీలో మాట్లాడిన ఘటనలు చాలాతక్కువనే చెప్పవచ్చు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన పొరపాట్లు, చేయని వాటినిసైతం ఆపాదిస్తూ పలువురు వైసీపీ మహిళా సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించటం కొసమెరుపు. మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తిని తొలిసారి సభలో అడుగుపెట్టిన సభ్యులుసైతం కార్నర్‌ చేయడం, దానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు మద్దతుగా నిలవడం ప్రజల్లో చంద్రబాబు పట్ల సానుభూతిని కలిగించిందనే వాదన వినిపిస్తుంది.

గత ఐదేళ్లలో టీడీపీ హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ.. ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డిని టీడీపీ సభ్యులు టార్గెట్‌చేస్తూ మాట్లాడారు. కానీ టీడీపీలోని సభ్యులందరూ జగన్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన దాఖలాలు లేవు. కేవలం మంత్రులు, సీనియర్‌ సభ్యులు మాత్రమే జగన్‌పై మాటలదాడికి దిగారు. కానీ ఇప్పుడు అలాకాదు.. వైసీపీ నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన సభ్యుడుసైతం చంద్రబాబే టార్గెట్‌గా మాటల దాడిచేయటంతో చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతిని కలిగించిందనే వాదన వినిపిస్తుంది.

గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డిపై ప్రజలు ఎలాంటి సానుభూతిని చూపారో.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పైనా ఆవిధంగా సానుభూతి వ్యక్తమవుతుందన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తుంది. చంద్రబాబుపై అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు ఆపార్టీ కార్యకర్తలకు సంతోషాన్ని ఇస్తున్నా.. టీడీపీ కార్యకర్తలతో పాటు మధ్యస్తంగా ఉన్న ప్రజల్లో మాత్రం బాబు పట్ల సానుభూతి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశమే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీలోని పలువురు నేతలు అభిప్రాయపడటం గమనార్హం. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle