newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

జ‌న‌సేన‌పై ఆవేశంతో ఊగిపోతున్న టీడీపీ..!

15-11-201915-11-2019 15:00:46 IST
Updated On 15-11-2019 16:17:03 ISTUpdated On 15-11-20192019-11-15T09:30:46.185Z15-11-2019 2019-11-15T09:30:35.971Z - 2019-11-15T10:47:03.803Z - 15-11-2019

జ‌న‌సేన‌పై ఆవేశంతో ఊగిపోతున్న టీడీపీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ‌ప్ర‌దేశ్‌లో వైసీపీ స‌ర్కార్‌పై ప్ర‌తిప‌క్షాల‌న్నీ దుమ్మెత్తి పోసేలా ఇసుక వివాదం చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇసుక కొర‌త‌ను అవ‌కాశంగా భావించిన ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఎవ‌రికి వారు ప్ర‌భుత్వంపై ఒంట‌రి పోరాటం చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆ క్ర‌మంలోనే మొన్న‌టికి మొన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం లాంగ్ మార్చ్ అంటూ విశాఖ‌లో ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో  పాల్గొనాలంటూ ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్ని పార్టీల నేత‌లకూ ఆహ్వానాలు పంపారు. కానీ, టీడీపీ త‌రుపున త‌ప్ప మ‌రే పార్టీ నేత ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు.

జ‌న‌సేన కార్య‌క్ర‌మానికి బీజేపీ మ‌ద్ద‌తు తెలిపినా ప్ర‌తినిధుల‌నెవ్వ‌రినీ పంపించ‌లేదు. బీజేపీ త‌ర‌హాలోనే మిగ‌తా పార్టీలూ వ్య‌వ‌హ‌రించాయి. ఏ పార్టీ కూడా జ‌న‌సేన‌తో క‌లిసి వ‌చ్చేందుకు సిద్ధం కాలేదు. టీడీపీ త‌రుపున ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్య‌న్న పాత్రుడు మాత్ర‌మే పాల్గొన్నారు.

ఇవ‌న్నీ తెలిసిన విష‌యాలే అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డే అస‌లు విష‌యం ఉందంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు స‌రికొత్త చ‌ర్చ‌ను తెర‌పైకి తీసుకొస్తున్నారు. చంద్ర‌బాబు కూడా ఇసుక స‌మ‌స్య‌పై నిరాహార దీక్ష చేప‌ట్ట‌డంతోపాటు అన్ని పార్టీల మ‌ద్ద‌తు కోరారు. అందుకు కమ్యూనిస్టులు, ఆప్ ఇలా అంద‌రూ మ‌ద్ద‌తు ఇవ్వ‌గా, ప్ర‌తినిధుల‌ను పంప‌క‌పోయినా సంఘీభావం ఉంటుంద‌ని బీజేపీ త‌రుపున క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ కూడా చెప్పుకొచ్చారు.

కాక‌పోతే జ‌న‌సేన త‌రుపున ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చేస్తాడులే అని చంద్ర‌బాబు భావించారు. కానీ, ఆయ‌న రాకుండా త‌న ప్ర‌తినిధులుగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర ప్ర‌సాద్. శివ‌శంక‌ర్‌ల‌ను పంపించారు. ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చిప‌డింది.

చంద్ర‌బాబు అంత‌టి వ్య‌క్తి నిరాహార‌దీక్ష చేస్తుంటే పార్టీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాలేక‌పోయినా క‌నీసం పేరున్న నాదెండ్ల మ‌నోహ‌ర్, మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ లాంటి వాళ్ల‌ను కాకుండా వీళ్ల‌ను పంపిస్తారా..? అంటూ టీడీపీ శ్రేణులు వారిలో వారే చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

మరోప‌క్క జ‌న‌సేన లాంగ్ మార్చ్‌కు ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు టీడీపీ త‌రుపున మాజీ మంత్రుల స్థాయి ఉన్న నేత‌ల‌ను పంపించామ‌ని, కానీ, జ‌న‌సేన త‌రుపున అలా జ‌ర‌గ‌లేద‌ని టీడీపీ నేత‌లు బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, దీనికి జ‌న‌సేన‌వ‌ర్గాలు మ‌రో క‌థ‌నాన్ని వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే బ‌య‌ట నానా ర‌కాలుగా అనుకుంటున్నార‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తే ఇక రెండు పార్టీలు ఒక్క‌టే అని అనేస్తారంటున్నార‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు జ‌న‌సేన శ్రేణులు.

స‌రే అలా కాద‌ని సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌, నాదెండ్ల‌ను పంపిస్తే మ‌రోలా అనుకుంటార‌ని కూడా కార‌ణాలు చూపిస్తున్నారు. అప్ప‌ట్లో జ‌గ‌న్‌పై కేసులు పెట్ట‌డంతో మాజీ జేడీని చంద్ర‌బాబు వాడుకున్నార‌న్న అప‌వాదు వ‌స్తుంద‌ని వారు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా వినే వారు ఉంటే ఎన్ని మాట‌లైనా చెబుతారులే అనుకోవ‌డం జ‌నాల వంతైంతి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle