newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

జ‌న‌సేన‌కు జేడీ దూర‌మైన‌ట్లేనా..?

21-09-201921-09-2019 12:41:59 IST
2019-09-21T07:11:59.895Z21-09-2019 2019-09-21T07:11:58.092Z - - 06-12-2019

జ‌న‌సేన‌కు జేడీ దూర‌మైన‌ట్లేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీబీఐ జేడీగా ఎంతో దూకుడుగా వ్య‌వ‌హ‌రించి మంచి గుర్తింపు పొందిన ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయంగా మాత్రం ఎప్పుడూ డైల‌మాలో ఉంటున్నారు. ఆయ‌న జ‌న‌సేన‌లో చేరే ముందు వ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయ అడుగులు ఎటువైపు అనే దానిపై అనేక ఊహాగానాలు వ‌చ్చాయి. ఇప్పుడు జ‌న‌సేన‌లో చేరినా ఆయ‌న ఆ పార్టీలో చురుగ్గా లేక‌పోవ‌డంతో ఆయ‌న త‌ర్వాతి అడుగులు ఎటు వైపు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

సీబీఐ జేడీగా తెలుగు ప్ర‌జ‌ల‌కు ల‌క్ష్మీనారాయ‌ణ సుప‌రిచితులు. ఒబులాపురం గ‌నుల కేసు, జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు విచార‌ణ‌తో ఆయ‌న కొన్ని రోజుల పాటు కీల‌కంగా మారారు. నిజాయితీ గ‌ల అధికారిగా ఆయ‌న‌కు పేరొచ్చింది. ఆ త‌ర్వాత కొన్నేళ్లు మ‌హారాష్ట్రలో ప‌నిచేసిన ఆయ‌న ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చేసి ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చేశారు. రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించి యువ‌త‌, రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.

దీంతో ఆయ‌న స్వంతంగా పార్టీ పెడ‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. త‌ర్వాత ఆయ‌న బీజేపీలో లేదా టీడీపీలో చేరేందుకు చ‌ర్చలు జ‌రిపార‌నే ఊహాగానాలూ వ‌చ్చాయి. చివ‌ర‌కు ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో జ‌న‌సేన పార్టీలో చేరారు. ఎన్నికలు పూర్త‌య్యే వ‌ర‌కు ఆయ‌న పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌రించారు. అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనే క‌నిపిస్తూ పార్టీలో నెంబ‌ర్ -2 అన్న‌ట్లుగా ఉన్నారు.

ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీలో చేరే వ‌ర‌కు పార్టీలో ప‌వ‌న్ త‌ర్వాత మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌న్ కీల‌కంగా ఉండేవారు. ల‌క్ష్మీనారాయ‌ణ చేరాక మాత్రం నాదెండ్ల ఎందుకో కొంత సైడ్ అయ్యారు. విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా పోటీ చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ ఓట్లును చెప్పుకోద‌గ్గ స్థాయిలో సాధించినా ఓట‌మి పాల‌య్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన వివిధ క‌మిటీల్లోనూ ఆయ‌న లేరు.

ఇదే స‌మ‌యంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. దీంతో ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేనను వీడ‌తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ, వీటిని ల‌క్ష్మీనారాయ‌ణ ఖండించారు. పార్టీ అధినేత త‌న సేవ‌లు అవ‌స‌రం అనుకున్నన్ని రోజులు పార్టీలోనే ఉంటాన‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. దీంతో మ‌ళ్లీ ఆయ‌న పార్టీలో యాక్టీవ్ అవుతార‌ని అంతా అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు.

ల‌క్ష్మీనారాయ‌ణ ఇంకా పార్టీ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇదే స‌మ‌యంలో ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో మాత్రం ఆయ‌న పాల్గొంటున్నారు. దీంతో అస‌లు ల‌క్ష్మీనారాయ‌ణ మ‌దిలో ఏముంద‌నేది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఆయ‌న బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఆయ‌న మాత్రం నోరు విప్ప‌డం లేదు. ల‌క్ష్మీనారాయ‌ణ దూర‌మైతే మాత్రం జ‌న‌సేన‌కు కొంత న‌ష్టం జ‌ర‌గ‌డం ఖాయం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle