newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

జ‌న‌సేనాని.. మెర్క్యూరీ బ‌ల్బులా వెలిగేదెన్నడు..?

28-10-201928-10-2019 11:18:29 IST
2019-10-28T05:48:29.775Z28-10-2019 2019-10-28T05:48:22.188Z - - 14-11-2019

జ‌న‌సేనాని.. మెర్క్యూరీ బ‌ల్బులా వెలిగేదెన్నడు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 

శ‌త్రువు మీద దాడి చేయాల‌నుకున్న‌ప్పుడు వారం, వ‌జ్రం, తిథులు, గ‌డియ‌లు చూసుకుని చేస్తామంటే కుద‌ర‌దు. అది రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌కైనా వ‌ర్తిస్తుంది. కానీ, జనసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఏం చేయాల‌న్నా అన్నీ చూసుకుని చేసేలా క‌నిపిస్తున్నాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు.

ప్ర‌భుత్వం త‌ప్పుచేస్తే నిల‌దీయ‌డానికి ముందుంటాన‌ని, ప్ర‌జ‌ల త‌రుపున పోరాటం చేయ‌డానికి తానెప్పుడూ సిద్ధ‌మేన‌ని జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతుండ‌టం అంద‌రికి తెలిసిందే. కాక‌ప‌తే స‌మ‌స్య అంతా ఎక్క‌డ వ‌స్తుందంటే..? స‌మ‌స్య ఈ రోజైతే.. ప‌వ‌న్ మాత్రం ఎంతో నింపాదిగా వారం.. ప‌ది రోజుల త‌రువాత ఆందోళ‌న‌లు చేయడానికి రెడీ అవుతుంటార‌ని అనుకుంటున్నారు.

కాగా, ప్ర‌స్తుతం ఏపీలో ఇసుక కొర‌త బాగానే ఇబ్బంది పెడుతోంది. జ‌నాలు కూడా ఇసుక స‌రిగ్గా దొర‌క్క నిర్మాణాలు జ‌రుపుకోలేక దిక్కులు చూస్తున్నారు. మొత్తం మీద ఇసుక పాల‌సీ పెద్ద దుమారాన్నే రేపుతుంటే.. దాని మీద వ‌చ్చే నెల 3న జ‌న‌సేన త‌రుపున పెద్ద పోరాటం చేస్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చేశారు.

దీంతో ప్ర‌జ‌ల్లో ప‌లు అనుమానాలు త‌లెత్తాయి. అయినా స‌మ‌స్య ఇప్పుడు త‌లెత్తితే.. అప్పుడెప్పుడో ఆందోళ‌న‌లు చేస్తానని ప‌వ‌న్ చెప్ప‌డ‌మేంట‌ని జ‌నాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత‌కు ముందు కూడా ప్ర‌తిప‌క్షాల‌న్నీ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల మీద ఆందోళ‌న‌లు చేసేసి రిలాక్స్ అయ్యాక.. అప్పుడు జ‌న‌సేన రంగంలోకి దిగి.. మ‌నం కూడా ఆందోళ‌న‌లు చేయాలి.. లేకుంటే బాగుండ‌దేమోన‌న్న ఉద్దేశంతో ప‌వ‌న్ ఉన్నాడేమోన‌ని ప్ర‌జ‌లు తెగ చెవులు కొరికేసుకుంటున్నారు.

మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే..? ప‌్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం ఏదైనా అంశం మీద రెండు మూడు రోజుల త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆందోళ‌న‌ల‌కు దిగడం చూస్తుంటే అదేదో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్తే చేసిన‌ట్టుగా ఉంటుంద‌ని జనంతో పాటు ఆయ‌న ఫ్యాన్స్ కూడా అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. రానున్న రోజుల్లో కూడా జ‌న‌సేన వైఖ‌రి ఇలాగే కొన‌సాగితే ప్ర‌శ్నించే పార్టీ ప‌రిస్థితి ప్ర‌శ్నార్ధ‌కం అన్న మాట‌లు విన‌వ‌స్తున్నాయి.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle