newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

జ‌న‌సేనాని టార్గెట్ చేస్తున్న వైసీపీ నేత‌లు..?

20-09-201920-09-2019 09:02:08 IST
Updated On 20-09-2019 15:30:32 ISTUpdated On 20-09-20192019-09-20T03:32:08.945Z20-09-2019 2019-09-20T03:32:01.378Z - 2019-09-20T10:00:32.873Z - 20-09-2019

జ‌న‌సేనాని టార్గెట్ చేస్తున్న వైసీపీ నేత‌లు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వైసీపీలోని కాపు నేత‌ల‌కు సీఎం జ‌గ‌న్ అంటే భ‌య‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ఒకే ఒక్క విమ‌ర్శ వైసీపీ కాపు నేత‌లు ఫైర్ అయ్యేలా చేసింది. సీన్ క‌ట్ చేస్తే ఆ.. మాకేం భ‌య‌మంటూ ఒక్కొక్క వైసీపీ నేత తెర‌మీద‌కు వ‌స్తున్నారు. ఉన్న‌ట్టుండి వీరు మీడియా ముందు ఇంత యాక్టివ్ అయ్యారేమిటా..? అన్న అనుమానానికి స‌మాధానం ఇదేనా..?  అని స‌గ‌టు తెలుగువారు షాక్ అయ్యేలా మొత్తం వ్య‌వ‌హారం ఉంది.

నిజానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా కామెంట్‌లు చేసే స‌మ‌యంలో వారంతా సైలెంట్‌గానే ఉన్నారు. ఆ త‌రువాతే వారంతా స్టేట్‌మెంట్‌లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. వీరంద‌రి కామ‌న్ పాయింట్ ఒక్క‌టే. తాము సీఎం జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డ‌టం లేద‌ని చెప్పుకోవ‌డం, జ‌గ‌న్ త‌మ‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నార‌ని వివ‌రించుకోవ‌డం. అయితే ముల్లును ముల్లుతోనే తీయాల‌న్న ఫార్ములాను ఉప‌యోగిస్తున్న వైసీపీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌తోనే కౌంట‌ర్‌లు చేయిస్తోంది. కానీ, అక్క‌డే వారంతా అడ్డంగా బుక్క‌య్యార‌ని జ‌న‌సైనికులు ఆరోపిస్తున్నారు.

కాపు రిజ‌ర్వేష‌న్‌ల విష‌యంలో సీఎం జ‌గ‌న్ అన్యాయం చేసినా వైసీపీలోని కాపు నేత‌లు మాట్లాడ‌టం లేద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శించారు. అయినా అవేమీ వైసీపీలోని కాపు నేత‌ల‌ను కేర్ చేయ‌డం లేద‌ని స‌మాచారం. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చే కౌంట‌ర్‌లో అస‌లు మేట‌ర్ మిస్ అయిందేమోన‌న్న విమ‌ర్శ‌లు వైసీపీ శ్రేల్లోనే వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని, ఆయ‌న టీడీపీ ఆర్టిస్ట్ అంటూ విమ‌ర్శించ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రొటీన్‌గా మారిపోయింది.

అంతేకాకుండా టీడీపీ స్క్రిప్ట్ చ‌దువుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ కామెంట్ చేసిమ‌రీ వైసీపీ నేత‌లు చేతులు దులుపుకోవ‌డం జ‌న‌సేన‌తోపాటు వైసీపీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సొంత సామాజికవ‌ర్గం ప్ర‌యోజ‌నాల కోసం తాము పోరాడ‌లేక‌పోతున్నామ‌ని, అధికార పార్టీలో ఉండి తాము త‌మ సామాజిక‌వ‌ర్గం కోసం ఒక్క‌మాటా మాట్లాడ‌లేక‌పోతున్నామంటూ వారు ఫీల్ కావ‌డం లేద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల చ‌ర్చ‌ల్లో భాగ‌మైంది.

వైసీపీ వంద రోజుల పాల‌న‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిపోర్టు ఇవ్వ‌గానే ఓ రేంజ్‌లో అధికార‌పార్టీ తిప్పికొట్టాల్సిన ప‌నేముంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంశాల వారీగా విమ‌ర్శ‌లు చేస్తే వైసీపీ నేత‌లు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. మ‌రోవైపు వైసీపీ నేత రోజా ప్యాకేజీ స్టార్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాట‌ల దాడి చేస్తున్నారు. టీడీపీ ప్రిపేర్ చేసిన ప్లాన్‌ను చ‌దివార‌ని విమ‌ర్శిస్తున్నారు. మ‌రి నాడు టీడీపీ ఐదేళ్ల పాల‌న‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎటువంటి రిపోర్టు ఎందుకు ప్రిపేర్ చేయ‌లేద‌న్న‌ది ఎమ్మెల్యే రోజా వాద‌న‌.  ఇలా ఓ వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు గుమ్మ‌రిస్తుంటే మ‌రోవైపు బ్రింగ్ బ్యాక్ జ‌న‌సేన సోష‌ల్ మీడియా అనే హాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల‌లో దూసుకుపోయేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle