newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జ‌గ‌న్ స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నారా..?

10-12-201910-12-2019 08:04:11 IST
Updated On 10-12-2019 13:44:37 ISTUpdated On 10-12-20192019-12-10T02:34:11.473Z10-12-2019 2019-12-10T02:33:47.703Z - 2019-12-10T08:14:37.599Z - 10-12-2019

జ‌గ‌న్ స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న‌ర్సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణంరాజు రాజ‌కీయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి త‌ల‌నొప్పిగా మారుతోంది. పార్టీ లైన్ దాటుతూ ఆయ‌న జ‌గ‌న్ స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నారు. ఇప్ప‌టికే ఓ వైపు వైసీపీ ఎంపీలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని సుజ‌నా చౌద‌రి వంటి బీజేపీ నేత‌లు ప్ర‌క‌టన‌లు ఇస్తుంటే రఘురామ‌కృష్ణంరాజు ఈ ప్రచారానికి బ‌లం చేకూర్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇటీవ‌ల పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంను త‌ప్ప‌నిస‌రి చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌, బీజేపీ తీవ్రంగా వ్య‌తిరేకించాయి.

కానీ, ఈ విష‌యంలో జ‌గ‌న్ మొండిగా ముందుకెళ్లారు. ఇంగ్లీష్ విష‌యంలో ఎటువంటి అవాంత‌రాలు వ‌చ్చినా వెన‌క్కు త‌గ్గేది లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌మ అధినేతకు ఇంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఇంగ్లీష్ విద్య ఉన్నందున వైసీపీ నేత‌లంతా ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు.

కానీ, తెలుగును చంపేస్తున్నారా అంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. ఈ విష‌యాన్ని టీడీపీ పార్ల‌మెంటులో కూడా లేవ‌నెత్తగా ర‌ఘురామ‌కృష్ణం రాజు సైతం మాట్లాడి తెలుగును కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని గుర్తు చేశారు.

ఇది వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. ఆయ‌న‌పై జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. పిలిపించుకొని మాట్లాడారు. మ‌ళ్లీ ఇలా జ‌ర‌గ‌వ‌ద్ద‌ని సున్నితంగా చెప్పారు.

అయినా, ఆయ‌న డోంట్ కేర్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నట్లు క‌నిపిస్తోంది. విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి లేకుండా కేంద్ర ప్ర‌భుత్వంలో ఎవ‌రినీ క‌ల‌వ‌వ‌ద్ద‌ని పార్టీ ఎంపీల‌కు ఒక సూచ‌న చేసింది. కానీ, రాఘురామ‌కృష్ణంరాజు మాత్రం ఈ సూచ‌న‌ల‌ను బేఖాత‌రు చేస్తున్నారు.

బీజేపీలో ప‌నిచేసినందున ఆయ‌న‌కు ప్ర‌ధాని మోడీ, అమిత్ షా స‌హా బీజేపీ పెద్ద‌ల‌తో సంబంధాలు ఉన్నాయి. వీటి ఆధారంగా ఆయ‌న కేంద్ర పెద్ద‌ల‌ను త‌ర‌చూ క‌లుస్తున్నారు.

ఇక‌, తాజాగా ఎంపీలంద‌రికీ ఘ‌నంగా విందు ఇవ్వాల‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు నిర్ణ‌యించారు. ఇప్పుడు ఇదే ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ విందును త‌న వియ్యంకుడు, కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు ఇంట్లో ఇవ్వ‌నున్నారు.

త‌న‌కు ఇంకా ఢిల్లీలో ఇల్లు కేటాయించ‌నందున కేవీపీ ఇంట్లో విందు ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న చెబుతున్నారు. ఈ విందుకు అన్ని పార్టీల ఎంపీల‌తో పాటు ప్ర‌ధాని మోడీ, అమిత్ షాను కూడా ఆహ్వానించారు.

కేవీపీతో జ‌గ‌న్‌కు అంత స‌ఖ్య‌త లేదు. వైఎస్ ఆత్మ‌గా చెప్పుకునే కేవీపీ వైఎస్ మ‌ర‌ణానంత‌రం జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. అటువంటిది కేవీపీ ఇంట్లో త‌మ ఎంపీ విందు పెట్ట‌డం జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారింది.

ఈ విందుకు జ‌గ‌న్‌ను ఆహ్వానించారా లేదా, ఆహ్వానిస్తే వెళ్తారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలా ఢిల్లీలో రఘురామ‌కృష్ణంరాజు స్వంతంగా రాజ‌కీయం చేసుకుంటున్నారు.

దీంతో వైసీపీ కూడా ఆయ‌న‌కు సీరియ‌స్‌గా చెక్ పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా న‌ర్సాపురానికే చెందిన మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది.

వీరి ద్వారా ర‌ఘురామ‌కృష్ణంరాజు దూకుడుకు క‌ళ్లెం వేయాల‌ని వైసీపీ భావిస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ నుంచి బీజేపీలోకి, అక్క‌డి నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి మ‌ళ్లీ వైసీపీలోకి వ‌చ్చి టిక్కెట్ ద‌క్కించుకున్నారు ర‌ఘురామ‌కృష్ణంరాజు. ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ బీజేపీలోకి ద‌గ్గ‌ర‌వ‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle