newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

జ‌గ‌న్ స‌ర్కార్ హామీలు - అమ‌ల‌య్యే తేదీలు ఇవే..!

14-09-201914-09-2019 08:28:23 IST
2019-09-14T02:58:23.798Z14-09-2019 2019-09-14T02:57:46.611Z - - 05-08-2020

జ‌గ‌న్ స‌ర్కార్ హామీలు - అమ‌ల‌య్యే తేదీలు ఇవే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయ‌న తీసుకుంటున్న ప్ర‌తి నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారుతోంది. దీంతో రాజ‌కీయ విశ్లేష‌కుల ఫోక‌స్ నిత్యం జ‌గ‌న్ వైపు మ‌ళ్లుతోంది. తాజాగా సీఎం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా వంద‌ల రోజుల పాల‌న‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌ర్య‌టించిన జ‌గ‌న్ ఇక‌పై ప్ర‌తీ నెలా ప్ర‌జ‌ల‌కు పండ‌గ‌లా ముగియ‌నుందని చెప్ప‌డంతోపాటు రానున్న కాలంలో త‌మ‌ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోయే సంక్షేమ ప‌థ‌కాల క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టించారు. దీంతో నెల‌కో స్కీమ్ చొప్పున ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేసింది.

కాగా, శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జ‌గన్ ఇప్ప‌టికే ఉద్దానం కిడ్నీ బాధితుల‌కు అత్యాధునిక చికిత్స‌ను అందించే 200 ప‌డ‌క‌ల సూప‌ర్ స్పెషాలిటీ కిడ్నీ ఆస్ప‌త్రికి శంకుస్థాప‌న చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస కాశీబుగ్గ‌లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్ ఆ ప్రాంతంలోని 807 గ్రామాల‌కు 600 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించే ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేశారు.

ప్ర‌స్తుతం కిడ్నీ వ్యాధి బాధితుల్లో డ‌యాల‌సిస్ చేయించుకుంటున్న వారికి నెల‌కు రూ.10వేల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అందిస్తోంది. అలాగే స్టేజ్ -3 కిడ్నీ బాధితుల‌కు కూడా నెల‌కు రూ.5వేల ఆర్థిక‌సాయం సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే.

 

తెల్ల‌రేష‌న్ కార్డులు ఉన్న పేద‌ల‌కు నాణ్య‌మైన బియ్యం పంపిణీని ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించిన జ‌గ‌న్ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. న‌వ‌ర‌త్నాల అమ‌లుకు క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించిన జ‌గ‌న్ సొంత ఆటోలు, క్యాబ్ క‌లిగిన డ్రైవ‌ర్‌ల‌కు రూ.10వేల ఆర్థిక‌సాయం అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే రైతు భ‌రోసా ప‌థ‌కం కింద అక్టోబ‌ర్ 15 నుంచి అన్న‌దాత‌ల‌కు 12,500లను జ‌గ‌న్ స‌ర్కార్ ఇవ్వ‌నుంది.

అలాగే, న‌వంబ‌ర్ 21న మ‌త్య్స‌కారుల కుటుంబాల‌కు రూ.10వేల ఆర్థిక‌సాయం చేయ‌డంతోపాటు డీజిల్ స‌బ్సిడీ ప‌థ‌కాన్ని ఏపీ ప్ర‌భుత్వం ప్రారంభించ‌నుంది. డిసెంబ‌ర్ 21న చేనేత కార్మికుల‌కు రూ.24వేలు ఇవ్వ‌నున్నారు.

జ‌న‌వ‌రి 26 నుంచి అమ్మ ఒడి ప‌థ‌కం కింద పిల్ల‌ల్ని బ‌డికి పంపిన త‌ల్లుల‌కు రూ.15వేలు చేతిలో పెడ‌తారు. ఫిబ్ర‌వరిలో నాయీ బ్రాహ్మ‌ణులు, టైల‌ర్లు, ర‌జ‌కుల‌కు రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్ర‌భుత్వం అందించ‌నుంది.

మార్చి చివ‌రి వారంలో ధూప‌దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లుతోపాటు ఇమాంలు, మౌజంలు, పాస్ట‌ర్‌ల‌కు గౌర‌వ వేత‌నం చెల్లించేంద‌కు స‌ర్కార్ స‌మాయ‌త్త‌మైంది.

ఉగాదికి మ‌హిళ‌ల పేరు మీద 25 ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌గా, ఏప్రిల్ 2 నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణయించారు. ఇలా ప్ర‌తి ప‌థ‌కం కూడా నేరుగా ప్ర‌జ‌ల‌కు అందేలా ఏర్పాట్ల‌ను చేస్తోంది జ‌గ‌న్ స‌ర్కార్.  మొత్తం మీద వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లోని ప్ర‌తి హామీ అమ‌లుకు సీఎం జ‌గ‌న్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌డంప‌ట్ల ప్ర‌జ‌ల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   an hour ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   2 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   3 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   4 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   4 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   4 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   5 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   17 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle