newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యంపై ప్ర‌శంస‌లు

14-12-201914-12-2019 09:16:50 IST
Updated On 14-12-2019 10:15:43 ISTUpdated On 14-12-20192019-12-14T03:46:50.491Z14-12-2019 2019-12-14T03:45:18.877Z - 2019-12-14T04:45:43.134Z - 14-12-2019

జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యంపై ప్ర‌శంస‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హిళ‌లపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డితే 21 రోజుల్లో ఉరి శిక్ష విధించేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన దిశ యాక్ట్ ప‌ట్ల ప్ర‌శంస‌ల‌జ‌ల్లు కురుస్తోంది. జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకువ‌చ్చిన ఈ చ‌ట్టాన్ని ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగానూ స్వాగ‌తిస్తున్నారు. మ‌హిళా హ‌క్కుల కోసం ప‌నిచేసే సంస్థ‌లు ఈ చ‌ట్టం తీసుకురావ‌డం ప‌ట్ల జ‌గ‌న్ స‌ర్కార్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నాయి.

ఇటీవ‌ల హైద‌రాబాద్ శివారులో వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశ దారుణ‌హ‌త్య దేశ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నంగా మారిందో తెలిసిందే. ఈ ఘ‌ట‌న ప‌ట్ల దేశ ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు ర‌గిలాయి.

నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఊరూవాడా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. చివ‌ర‌కు న‌లుగురు నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌డంతో అంతా శాంతించారు. అయితే, ఎన్‌కౌంట‌ర్‌పై భిన్న స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. నిందితుల‌కు చ‌ట్ట ప్ర‌కారం ఉరిశిక్ష ప‌డితే బాగుండేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌న దేశంలో చ‌ట్టాల్లో ఉన్న లొసుగులు, శిక్ష త‌ప్పించుకునేందుకు, తాత్కాలికంగా శిక్ష అమ‌లును వాయిదా వేయించుకునేందుకు ఉన్న అవ‌కాశాల‌ను నిందితులు బాగా ఉప‌యోగించుకుంటున్నారు.

ఈ ధైర్యంతోనే త‌మ‌కు ఏమీ కాద‌నే ఇటువంటి దారుణాల‌కు ఒడిగ‌డుతున్నారు. కాబ‌ట్టి, అడ‌వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డే వారికి క‌ఠిన శిక్ష‌లు వేయాల‌నే డిమాండ్లు మొద‌ల‌య్యాయి.

మొట్ట‌మొద‌ట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈ మేర‌కు ఆలోచించింది. అత్యాచారాల‌కు పాల్ప‌డితే 7 రోజుల్లో పోలీసు ద‌ర్యాప్తు పూర్తి చేసేలా, అన్ని ఆధారాలు ఉంటే 14 రోజుల్లో కోర్టు విచార‌ణ పూర్తి చేసి ఉరి శిక్ష విధించేలా చ‌ట్టం చేసింది.

శుక్ర‌వారం ఈ చ‌ట్టానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ చ‌ట్టాన్ని ప్ర‌తిప‌క్షం టీడీపీకి కూడా స్వాగ‌తించింది. ఈ చ‌ట్టం సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లు ప‌క్క‌న పెడితే దిశ ఉదంతం త‌ర్వాత ఆడ‌వారి ర‌క్ష‌ణ‌కు ఏపీ స‌ర్కార్ ఒక ముంద‌డుగు వేసింది.

దీంతో దేశ‌మంతా ఈ చ‌ట్టం చేసిన ఏపీ వైపు చూసింది. జాతీయ మీడియా సైతం ప్ర‌ధానంగా ఈ చ‌ట్టం గురించి ప్ర‌సారం చేసింది. ఇది సంచ‌ల‌నాత్మ‌క చ‌ట్టంగా, ధైర్యంతో చేసిన చ‌ట్టంగా అభివ‌ర్ణించింది. సోష‌ల్ మీడియాలోనూ ఈ విష‌యం ట్రెండింగ్‌లో న‌డిచింది. 

నెటిజ‌న్లు ఈ చ‌ట్టంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. దిశ త‌ల్లిదండ్రులు సైతం ఈ చ‌ట్టం తీసుకువ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ కూతురు కొవ్వొత్తులా క‌రిగిపోయినా మిగ‌తా వారికి వెలుగునిచ్చింద‌నే సంతృప్తి ఉంద‌ని వారు వ్యాఖ్యానించారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle