newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జ‌గ‌న్ సాలిడ్ దెబ్బ ఎట్టుండాది..?

22-12-201922-12-2019 00:39:46 IST
Updated On 23-12-2019 12:22:39 ISTUpdated On 23-12-20192019-12-21T19:09:46.226Z22-12-2019 2019-12-21T18:51:55.079Z - 2019-12-23T06:52:39.737Z - 23-12-2019

జ‌గ‌న్ సాలిడ్ దెబ్బ ఎట్టుండాది..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా క‌ర్నూలులో హైకోర్టు, విశాఖ‌లో కార్య‌నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌, అమ‌రావ‌తిలో శాస‌న వ్య‌వ‌స్థ ఏర్పాటు చేస్తామంటూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేసిన ప్ర‌క‌టన‌పై టీడీపీ ఏ మాత్రం ఆలోచ‌న చేయ‌కుండానే ఎదురుదాడి మొద‌లుపెట్టింది. అసెంబ్లీలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌క‌ట‌న చేసిన కొద్ది నిమిషాల‌కే అసెంబ్లీ బ‌య‌ట చంద్ర‌బాబు మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి విశాఖ‌, క‌ర్నూలు రాజ‌ధానుల ఆలోచ‌న‌ను వ్య‌తిరేకించేశారు.

ఇలా వ్య‌తిరేకిస్తూ ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటారో అన్న ఆలోచ‌న కూడా చంద్ర‌బాబు ఆ క్ష‌ణానికి చేయ‌లేక‌పోయారు. ఆరు ప్రాణాలు అమ‌రావ‌తిపైనే పెట్టుకోవ‌డంతో ఆ వ్యామోహం కార‌ణంగా మ‌రో ఆలోచ‌న ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబుకు త‌ట్టి ఉండ‌క‌పోవ‌చ్చు.

కాక‌పోతే, ఇప్పుడు మూడు రాజ‌ధానుల అంశం వైసీపీపైన‌, టీడీపీపైన‌, రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది అన్న‌ది ముఖ్య‌మే. జ‌గ‌న్ వేసిన ఉచ్చులో చంద్ర‌బాబు ఇరుక్కోవ‌డ‌మే కాకుండా తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఇరికించేలా ఉన్నారు. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఈ అంశంపై ఎక్క‌డా స్పందించ‌డం లేదు. క‌నీసం లీకులు కూడా ఇవ్వ‌డం లేదు.

అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు, టీడీపీ దాని అనుకూల మీడియాలు విశాఖ‌లో కార్య‌నిర్వాహ‌క, క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్ప‌ష్ట‌మైన లైన్ తీసుకుని ముందుకు వెళుతున్నాయి. అమ‌రావ‌తిలో కొంద‌రు రైతులు పురుగుమందుల డ‌బ్బాల‌తో ధ‌ర్నాలు చేయ‌గా, టీడీపీ ప‌త్రిక‌ల్లో ఆ ఫోటోలే బ్యాన‌ర్ స్టోరీలుగా మారాయి.  అంత‌కు మించి టీడీపీకి మ‌ద్ద‌తుగా ల‌భిస్తున్న సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు.

బీజేపీ నేత‌లు, క‌మ్యూనిస్టు నాయ‌కులు, మేధావులు కూడా నేరుగా ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమకు అభివృద్ధిని వికేంద్రీక‌రించే ఆలోచ‌న‌ను వ్య‌తిరేకించే సాహ‌సం చేయ‌డం లేదు. కాక‌పోతే ప‌త్రిక‌లు, టీడీపీ చానెళ్లు రెండు కూడా రాజ‌కీయంగా రెండుగా చీలిన నేప‌థ్యంలో ఏ ఛానెల్ గొట్టం ముందు ఎలా మాట్లాడ‌ట‌మ‌న్న‌ది ఏపీలోని మేధావులు, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఇటీవ‌ల బాగా వంట‌బ‌ట్టింది.

ఈ అనుకూల‌త కార‌ణంగా చాలా మంది మేధావులు, ఇత‌ర పార్టీల నేత‌లు ప్ర‌భుత్వ నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తున్నార‌న్న భావ‌న క‌లిగించేందుకు, గంద‌ర‌గోళం సృష్టించేందుకు టీడీపీ మీడియా ప్ర‌య‌త్నిస్తుందేకానీ సాలీడ్‌గా చంద్ర‌బాబు అండ్ టీమ్‌కు ఎక్క‌డా స‌పోర్టు దొర‌క‌డం లేదు.

ఇక ప్ర‌జ‌ల స్పంద‌న చూస్తే చంద్ర‌బాబు నాయుడు కార‌ణంగా టీడీపీ ఏమైపోతుందోన‌న్న భ‌యం, అమ‌రావ‌తి భూముల‌తో సంబంధం లేని టీడీపీ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే మొద‌ల‌య్యే ఉంటుంది. ద‌శాబ్దాలుగా నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్న ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ప్రాణం లేచి వ‌చ్చిన‌ట్లు అయింది. ఉత్త‌రాంధ్ర మూడు జిల్లాల ప్ర‌జ‌లు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని త‌మ కోసం వ‌చ్చిన బాహుబ‌లిగా ఇప్పుడు భావిస్తున్నాయి.

ఇక టీడీపీ విష‌యానికొస్తే త‌క్ష‌ణం ఈ మూడు రాజ‌ధానుల అంశంపై వ్య‌తిరేక ప్ర‌చారం, పోరాటం ఆప‌క‌పోతే తెలుగుదేశం మూలాలు క‌దిలిపోయినా ఆశ్చ‌ర్యం లేదు. అంతా అమ‌రావ‌తిలోనే ఉండాలంటూ ప‌దిమంది రైతులు ఆందోళ‌న‌చేస్తే దాన్నే టీడీపీ ప‌త్రిక‌లు రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌తిరేక‌త వ‌స్తుంది అన్న‌ట్టు క‌థ‌నాలు రాయ‌డంబ‌ట్టే వారి ఉద్దేశం స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది.

ఇలా జాతీయ స్థాయి పార్టీ అని చెప్పుకునే టీడీపీ ఇప్ప‌టికే తెలంగాణ‌లో చాప‌చుట్టేసిన సంగ‌తి తెలిసిందే. రాయ‌ల‌సీమ ప్రాంతంలో కేవ‌లం మూడు సీట్ల‌కే ప‌రిమిత‌మైపోయే స్థితి ప్ర‌స్తుతం టీడీపీకి వ‌చ్చింది. ఈ దిశ‌లోనే పురోగ‌మించ‌డ‌మా..?  లేదా గ‌త వైభ‌వం దిశ‌గా తిరోగ‌మించ‌డ‌మా..? అన్న‌ది టీడీపీ నాయ‌క‌త్వ‌మే తేల్చుకోవాలి. ఏదేమైనా మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చంద్ర‌బాబుపై జ‌గ‌న్ సాలిదెబ్బ‌గా అభివ‌ర్ణిస్తున్న వైసీపీ శ్రేణులు ఎట్టుండాది..? అంటూ సోష‌ల్ మీడియాలో త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను ప్ర‌శ్నించ‌డం గ‌మనార్హం.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle