newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

జ‌గ‌న్ వేయబోయే తొలి అడుగు ఏంటి?

30-05-201930-05-2019 08:19:46 IST
2019-05-30T02:49:46.459Z30-05-2019 2019-05-30T02:49:35.517Z - - 26-08-2019

జ‌గ‌న్ వేయబోయే తొలి అడుగు ఏంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇవాళ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను న‌మ్మిన ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ కు అఖండ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. న‌వ‌ర‌త్నాల ద్వారా ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపుతాన‌ని ఆయ‌న ఇచ్చిన హామీని ప్ర‌జ‌లు పూర్తిగా విశ్వ‌సించారు.

అయితే, ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత జ‌గ‌న్ వేసే మొద‌టి అడుగు ఏంట‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న తండ్రి ముఖ్య‌మంత్రి అయ్యాక మొద‌టి సంత‌కాన్ని రైతుల‌కు ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై చేసిన‌ట్లే జ‌గ‌న్ కూడా మొద‌టి సంత‌కం ఏ ప‌థ‌కంపై చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ విష‌యాన్ని ఇంత‌వ‌ర‌కు ఎక్క‌డా జ‌గ‌న్ బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి అనేక ఇంట‌ర్వ్యూల్లో జ‌గ‌న్ ను ఈ ప్ర‌శ్న‌లు అడిగినా జ‌గ‌న్ మాత్రం దాట‌వేశారు. న‌వ‌రత్నాల‌ను అమ‌లు చేయ‌డ‌మే త‌న ల‌క్ష్యంగా జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు. అయితే, ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ఆయ‌న మొద‌టి సంత‌కాన్నే న‌వ‌ర‌త్నాలు అమ‌లు చేసేలా ఉండ‌క‌పోవ‌చ్చు.

అయితే, ప్ర‌మాణ‌స్వీకారం త‌ర్వాత జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా భావిస్తున్నారు. ఇప్ప‌టికే అన్ని శాఖ‌ల కార్యాద‌ర్శులు, సీఎస్ తో ప‌లుమార్లు స‌మావేశ‌మైన జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌లో ఒక‌దానిపై ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం కానీ, మొద‌టి సంత‌కం చేయ‌డం కానీ ఉండ‌వ‌చ్చు.

ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేయ‌వ‌చ్చు అంటున్నారు. ఆయ‌న రెండేళ్లుగా ఈ హామీ ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే ప్ర‌తీ పార్ల‌మెంటు నియోజ‌కవ‌ర్గాన్ని ఒక జిల్లాగా మార్చి పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ మేర‌కు జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం త‌ర్వాత ప్ర‌క‌ట‌న చేయ‌వ‌చ్చు అంటున్నారు.

ఇక‌, పాల‌న‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని, ఆరు నెల‌ల్లో మంచి ముఖ్య‌మంత్రి అనిపించుకుంటాన‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. మ‌రి, ఈ మేర‌కు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నాక ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle