newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

13-11-201913-11-2019 14:22:51 IST
2019-11-13T08:52:51.742Z13-11-2019 2019-11-13T08:52:23.351Z - - 05-08-2020

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయాల్లో కులాల ప్ర‌భావం ఎంత‌లా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌త్యేకించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల్లో సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు పార్టీల గెలుపోట‌ముల‌పై ప్ర‌భావితం చేస్తాయి. అనేక ఏళ్లుగా కొన్ని సామాజ‌క‌వ‌ర్గాల్లోని మెజారిటీ ప్ర‌జ‌లు ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉంటున్నార‌నే అంచ‌నాలు ఉన్నాయి.

అయితే, ఏ ఒక్క సామాజ‌క‌వ‌ర్గం మ‌ద్ద‌తుతో ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు. అందుకే ఇటీవ‌ల పార్టీల‌కు ఒక కులానికి ప‌రిమితం చేసేందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి.

ఇటీవ‌లి కాలంలో జ‌న‌సేన నాయ‌కులు, ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగాల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సంబోధించే విధానం వెనుక ప‌క్కా వ్యూహం ఉంది.

ఆయ‌న ముఖ్య‌మంత్రిని ఎప్పుడు జ‌గ‌న్ రెడ్డి అంటూనే సంబోధిస్తుంటారు. ఆ పార్టీ విడుద‌ల చేసే ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల్లోనూ జ‌గ‌న్‌ను జ‌గ‌న్ 'రెడ్డి' అనే అంటుంటారు. జ‌న‌సేన క్యాడ‌ర్ కూడా ఇదే విధానాన్ని పాటిస్తుంది.

వాస్త‌వానికి, ముఖ్య‌మంత్రిని అంద‌రూ జ‌గ‌న్ లేదా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అని మాత్ర‌మే పిలుస్తారు. ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ మాత్రం జ‌గ‌న్ బాబు అని పిలుచుకుంటారు. కానీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ప‌దేప‌దే జ‌గ‌న్ రెడ్డి అని ఒత్తి ప‌ల‌క‌డం ప‌క్కా రాజ‌కీయ వ్యూహ‌మే. ఇటీవ‌లి ఎన్నికల్లో జ‌గ‌న్‌కు అన్ని సామాజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తిచ్చారు.

అందుకే చ‌రిత్ర‌లో ఎరుగ‌ని భారీ విజ‌యాన్ని ఆయ‌న న‌మోదు చేసుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వంత సామాజిక‌వ‌ర్గం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ జ‌గ‌న్ హ‌వా వీచింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆయ‌న స్వంత సామాజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు కూడా ఊహించిన స్థాయిలో మ‌ద్ద‌తు ఇవ్వలేద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ప‌లుమార్లు అంగీక‌రించారు.

ఇప్పుడు జ‌గ‌న్‌ను జ‌గ‌న్ రెడ్డి అని పిల‌వ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గాన్ని ప‌దేప‌దే గుర్తు చేయాల‌నే ఉద్దేశ్యం జ‌న‌సేన వ్యూహంలో క‌నిపిస్తోంది.

ఈ విష‌యాన్ని వైసీపీ కూడా గుర్తించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌వ‌న్ నాయుడు అంటూ పిల‌వ‌డం ప్రారంభించింది. ఇలా పార్టీల‌కు కులాల‌ను అంట‌గ‌ట్ట‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ పార్టీ కూడా త‌క్కువ కాదు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఒకే సామాజ‌క‌వ‌ర్గానికి పెద్ద పీట వేస్తున్నార‌ని వైసీపీ అనేక ఆరోప‌ణ‌లు చేసింది. టీడీపీపై, చంద్ర‌బాబుపై స్వంత సామాజ‌క‌వ‌ర్గ ప‌క్ష‌పాతి అనే ముద్ర‌ను వైసీపీ వేయ‌గ‌లిగింది.

ఇప్ప‌టికి కూడా టీడీపీపై, టీడీపీ అనుకూల మీడియాపై వైసీపీ ఇలా కులాన్ని అంట‌గ‌ట్టి విమ‌ర్శ‌లు చేస్తుంటుంది. తెలుగుదేశం పార్టీది కూడా ఇదే వైఖ‌రి. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై కుల ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నించింది.

జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారితోనే ఆయ‌నపై విమ‌ర్శ‌లు చేయించ‌డం వంటివి చేసింది. మొత్తంగా తాను కులాల‌పై రాజ‌కీయం చేయ‌నని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతున్నా ఆయ‌న‌ను జ‌గ‌న్‌ను జ‌గ‌న్‌రెడ్డి అని పిల‌వ‌డం మాత్రం ప‌క్కా రాజ‌కీయ‌మే అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle