newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జ‌గ‌న్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌... డిఫెన్స్‌లో విప‌క్షాలు

18-12-201918-12-2019 08:07:55 IST
Updated On 18-12-2019 10:53:47 ISTUpdated On 18-12-20192019-12-18T02:37:55.337Z18-12-2019 2019-12-18T02:37:51.295Z - 2019-12-18T05:23:47.437Z - 18-12-2019

జ‌గ‌న్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌... డిఫెన్స్‌లో విప‌క్షాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విష‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు.

అధికార వికేంద్రీక‌ర‌ణ జ‌రిపేందుకు అమ‌రావ‌తిని లెజిస్లేటీవ్ క్యాపిట‌ల్‌గా కొన‌సాగిస్తూ, విశాఖ‌ప‌ట్నంలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిట‌ల్‌, క‌ర్నూలులో జ్యుడీషియల్ క్యాపిట‌ల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి అవ‌స‌రం ఉంద‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల్లో హ‌ర్షాతిరేక‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రాజ‌ధానిని నిర్ణ‌యించేందుకు గానూ శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీని నియ‌మించారు.

ఈ క‌మిటీ నివేదిక రాక‌ముందు అన్ని జిల్లాల‌కు మ‌ధ్య‌లో ఉండే విజ‌య‌వాడ - గుంటూరు మ‌ధ్య‌లో అమ‌రావ‌తి పేరుతో రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

అయితే, ఐదేళ్ల కాలంలో అమ‌రావ‌తికి ఓ రూపు తీసుకురావ‌డంలో చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యారు. దీంతో పాటు ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు, ఒకే సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన రాజ‌ధానిగా నిర్మిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు రావడం, అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ కూడా ఇవే విమ‌ర్శ‌లు చేస్తూ రాజ‌ధాని నిర్మాణ ప‌నుల‌ను నిలిపి వేయ‌డంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగింపుపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.

రాజ‌ధాని ఎక్క‌డ ఉండాలి ? ఎలా ఉండాలి ? అనే దానిపై వైసీపీ ప్ర‌భుత్వం కూడా క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీ నివేదిక రాక‌ముందు జ‌గ‌న్ అసెంబ్లీలో వ్య‌క్తం చేసిన మూడు రాజ‌ధానుల అభిప్రాయం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఒక క్లారిటీని ఇచ్చింది. ప్ర‌జ‌ల స్పంద‌న‌ను తెలుసుకోవ‌డానికి కూడా జ‌గ‌న్ ఈ ప్రక‌ట‌న చేసి ఉండ‌వ‌చ్చు.

రాయ‌ల‌సీమ రాజ‌ధానిని లేదా కనీసం హైకోర్టును ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే ఉద్య‌మాలు మొద‌ల‌య్యాయి. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌కు ఒక‌రోజు ముందే సీమ విద్యార్థులు ఈ డిమాండ్‌తో అసెంబ్లీని ముట్ట‌డించారు.

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో సీమ జిల్లాల్లో బాణాసంచా కాల్చి సంబ‌రాలు చేసుకున్నారు. ఇక‌, రాష్ట్రంలో వెనుక‌బాటుకు గుర‌వుతున్న ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు ఊర‌ట‌నిచ్చేలా విశాఖ‌ప‌ట్నంను ఎగ్జిక్యూటీవ్ క్యాపిట‌ల్ చేయాల‌నే నిర్ణ‌యం ప‌ట్ల అక్క‌డే హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది.

ఇప్పుడు ఇది రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల సెంటిమెంట్‌గా మారింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ కళ్యాణ్‌కు ఈ ప్రాంతాల్లో న‌ష్టం త‌ప్ప‌దు. మూడు రాజ‌ధానులు వ‌ద్దంటే ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ అభివృద్ధికి అడ్డుప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు వీరిపై మొద‌ల‌వుతాయి.

విశాఖ‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల దృష్ట్యా మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకించ‌డం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా ఇబ్బందిగా మారనుంది.

ఇక‌, అమ‌రావ‌తి నిర్మాణం ఎందుకు సాధ్యం కాదో, మూడు రాజ‌ధానులు ఎందుకు మేలో కూడా అసెంబ్లీలో జ‌గ‌న్ వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఇది ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేసేలా ఉంది. ఇక‌, జ‌గ‌న్ నిర్ణయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల‌నేది చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌న‌.

అయితే, బీజేపీ ముందు నుంచీ అధికార వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆ పార్టీ నేత‌లు కూడా జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నారు. మొత్తానికి త‌న ప్ర‌క‌ట‌న‌తో రాజ‌ధాని విష‌యంలో విప‌క్షాల‌ను డిఫెన్స్‌లో ప‌డేశారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle