newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వివాదాస్ప‌ద‌ం అవుతుందా..?

16-06-201916-06-2019 08:17:40 IST
Updated On 21-06-2019 16:36:23 ISTUpdated On 21-06-20192019-06-16T02:47:40.569Z16-06-2019 2019-06-16T02:47:08.349Z - 2019-06-21T11:06:23.278Z - 21-06-2019

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వివాదాస్ప‌ద‌ం అవుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కం తీసుకొని నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర‌రావు సిద్ధం అవుతున్నారు.

ఈ నెల 21న జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల‌తో స‌త్సంబ‌ధాలు క‌లిగి ఉంటే అన్ని రాష్ట్రాల‌కూ మేలు జ‌రుగుతుంద‌ని బ‌లంగా విశ్వసిస్తున్న కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ‌్నవీస్‌ను ఆహ్వానిస్తున్నారు.

ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర వెళ్లి ఫ‌డ‌్నవీస్‌ను ఆహ్వానించిన కేసీఆర్ 17న విజ‌య‌వాడ‌కు వెళ్లి జ‌గ‌న్‌ను కూడా ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పుడు ఇదే వివాద‌మ‌వుతోంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ జ‌గ‌న్ పర్య‌ట‌న‌ను అవ‌కాశంగా తీసుకొని వివాదంగా మారుస్తోంది. ముఖ్యంగా రెండు విష‌యాల‌ను కాంగ్రెస్ తెర‌పైకి తీసుకువ‌స్తోంది. జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశారు.

త‌ర్వాత ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగ‌లేదు. కేసీఆర్ స‌ర్కార్ ఏర్ప‌డ్డాక ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టును త‌ప్పుప‌ట్టి రీడిజైనింగ్ చేసి కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరుతో నిర్మాణం చేప‌ట్టారు.

ఇప్పుడు ఇదే అంశాన్ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క తెర‌పైకి తీసుకువ‌చ్చారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి జ‌గ‌న్ వ‌స్తే త‌న తండ్రి వైఎస్ఆర్‌ను అవ‌మానించిన‌ట్టేన‌ని అంటున్నారు. ప్రాణహిత - చేవెళ్ల నిర్మించాల‌నుకున్న  వైఎస్ నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ త‌ప్పుబ‌ట్టిన‌ట్లేన‌ని మెలిక పెడుతున్నారు.

ఇక‌, మూడేళ్ల క్రితం తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా ఏపీకి అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆరోపిస్తూ జ‌గ‌న్ మూడురోజుల పాటు జ‌ల‌దీక్ష చేశారు. ఈ పేపర్ క‌టింగ్‌లు, దీక్ష‌లో జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని బాగా వైర‌ల్ చేస్తున్నారు. ఇక‌, తెలుగుదేశం పార్టీ సైతం ఇవే విమ‌ర్శ‌లు ప్రారంభించే అవ‌కాశం ఉంది. అయితే, విమ‌ర్శ‌ల సంగ‌తి ఎలా ఉన్నా కేసీఆర్ స్వ‌యంగా వ‌చ్చి ఆహ్వానించ‌నున్నందున‌, తెలంగాణ‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నందున ఈ కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ హాజ‌ర‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

కాంగ్రెస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను టీఆర్ఎస్ ఖండిస్తోంది. రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాలు ఉంటే ఇరువురికీ మంచిద‌నేది టీఆర్ఎస్ వాద‌న‌. మ‌రి ఇటువంటి జ‌గ‌న్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి హాజ‌రై ఈ విమ‌ర్శ‌ల‌కు ఎలా స‌మాధానం ఇస్తారో చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle