newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

జ‌గ‌న్ ప‌గ‌బ‌ట్టారా..? చంద్ర‌బాబును ఇరికిస్తున్నారా..?

28-06-201928-06-2019 08:10:08 IST
2019-06-28T02:40:08.729Z28-06-2019 2019-06-28T02:39:49.322Z - - 26-08-2019

జ‌గ‌న్ ప‌గ‌బ‌ట్టారా..? చంద్ర‌బాబును ఇరికిస్తున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ హ‌యాంలో రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా అవినీతి జ‌రిగింద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందునుంచీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు టీడీపీ ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డుతోందని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేసింది.

ఇప్పుడు ఏకంగా వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబు హ‌యాంలో అవినీతి జ‌రిగింద‌ని నిరూపించాల‌ని ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. ఇందుకోసం మంత్రివ‌ర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.

బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, అనీల్ కుమార్ యాద‌వ్‌, మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి, క‌న్న‌బాబుల‌తో మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఏర్పాటైంది. ఈ క‌మిటీలో ప్ర‌త్యేక ఆహ్వానితులుగా ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిల‌ను నియ‌మించారు జ‌గ‌న్‌.

వీరంతా టీడీపీని, చంద్ర‌బాబును ముందునుంచీ గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తున్న వారే. సాధార‌ణంగా మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఒక‌టి, రెండు అంశాలకే ప‌రిమితం చేస్తారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఏకంగా 30 అంశాల‌పై విచార‌ణ‌కు ఉప‌సంఘాన్ని ఆదేశించారు.

ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వైసీపీ ఆరోపిస్తోంది.

ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు కూడా జ‌గ‌న్ ఓ ఇంటర్వ్యూలో తాము క‌చ్చితంగా చంద్ర‌బాబుపై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పారు. గెలిచాక కూడా ఇదే మాట మీద ఉన్నారు. ప‌దేప‌దే టీడీపీ అవినీతి అంటూ విమ‌ర్శిస్తున్నారు. ఇందులోభాగంగానే మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఏర్పాటు చేశారు.

ఆరు వారాల్లో ఈ క‌మిటీ నివేదిక ఇవ్వ‌నుంది. దీంతో ఇప్పుడు రెండు పార్టీల మ‌ధ్య రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. కేవ‌లం త‌మ‌పై అవినీతి మ‌ర‌క అంటించాల‌నే దురుద్దేశ్యంతోనే జ‌గ‌న్ మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని ఏర్పాటుచేశార‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.

అయితే, దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కూడా గెలిచాక చంద్ర‌బాబుపై ప‌లు విచార‌ణ‌లు జ‌రిపించారు. అయినా ఏమీ తేల‌లేద‌ని, ఇప్పుడు కూడా త‌మకు అవినీతి మ‌ర‌క అంటించ‌డం జ‌గ‌న్‌కు క‌ల‌గానే మిగిలిపోతుంద‌ని మాజీ మంత్రి నారా లోకేష్ కౌంట‌ర్ ఇస్తున్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి త‌మ హ‌యాంలోనే పెంచిన అంచ‌నాల‌ను కేంద్రం ఇప్పుడు ఆమోదించినందున అవినీతి ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని నిరూపిత‌మైంద‌నేది టీడీపీ వాద‌న‌.

అయితే, జ‌గ‌న్ మాత్రం ప‌దేపదే చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన అవినీతిని వెలికితీయాల‌ని ఆదేశాలు ఇస్తున్నారు. మొద‌టి క్యాబినెట్ స‌మావేశంలోనే ఆయ‌న గ‌త ప్ర‌భుత్వ అవినీతిని బ‌య‌ట‌పెట్టిన మంత్రుల‌కు స‌న్మానం చేస్తా అని ఆఫ‌ర్ ఇచ్చారు.

త‌ర్వాత వివిధ శాఖ‌ల‌కు సంబంధించి జ‌రుగుతున్న స‌మీక్ష‌ల్లోనూ ఉన్న‌తాధికారుల‌కు జ‌గ‌న్ ఇదే ఆఫ‌ర్ చెబుతున్నారు.

ఇలా అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి వివిధ సంద‌ర్భాల్లో జ‌గ‌న్ మాట‌లు, మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఏర్పాటు చేయ‌డం వంటివి చూస్తుంటే మాత్రం క‌చ్చితంగా టీడీపీ అవినీతికి పాల్ప‌డింద‌ని ఆధారాల‌తో స‌హా నిరూపించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అయితే, టీడీపీ నేత‌లు మాత్రం మంత్రివ‌ర్గ ఉప‌సంఘంతో ఏమీ కాద‌ని బ‌య‌ట చెబుతున్నా లోలోన మాత్రం కొంత దిగులుగానే క‌నిపిస్తున్నారు.

జ‌గ‌న్‌ను అవినీతిప‌రుడిగా ముద్ర‌వేయ‌డానికి తెలుగుదేశం పార్టీ ప‌దేళ్లుగా తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కాంగ్రెస్ నేత‌ శంక‌ర్రావు వేసిన కేసులో టీడీపీ నేతలు ఇంప్లీడ్ అయ్యి మ‌రీ కేసును న‌డిపించారు. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా సైతం జ‌గ‌న్‌ను అవినీతిప‌రుడిగా బాగా ప్రొజెక్ట్ చేశాయి.

దీంతో జ‌గ‌న్ 16 నెల‌లు జైలు జీవితం గ‌డిపారు. పైగా త‌న‌కు ఎవ‌రిపై కోపం లేదని, క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు ఉండ‌వ‌ని జ‌గ‌న్ చెబుతున్నా ఆయ‌న మ‌న‌స్సులో మాత్రం పాత విష‌యాలు ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి, మంత్రివ‌ర్గ ఉపసంఘం ఏమీ తేలుస్తుందో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle