newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

జ‌గ‌న్ ప్లాన్ ప‌క్కాగా ఉందే..!

01-06-201901-06-2019 12:44:32 IST
Updated On 25-06-2019 12:31:28 ISTUpdated On 25-06-20192019-06-01T07:14:32.844Z01-06-2019 2019-06-01T07:14:30.919Z - 2019-06-25T07:01:28.854Z - 25-06-2019

జ‌గ‌న్ ప్లాన్ ప‌క్కాగా ఉందే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ నూత‌న ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌క్కా ప్లాన్‌తో క‌నిపిస్తున్నారు. ప‌దేళ్ల క‌ష్టం, ఎదురుచూపుల త‌ర్వాత అఖండ విజ‌యాన్ని సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ‌స్వీకారం చేసిన జ‌గ‌న్ ప‌క్కా ప్లాన్ తోనే ఉన్నారు. ప్రమాణ‌స్వీకారం అనంత‌రం ఆయ‌న ప్రసంగం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఐదేళ్లు చంద్రబాబుది అవినీతి పాల‌న అని ప‌దేప‌దే విమ‌ర్శించిన జ‌గ‌న్ ఇప్పుడు ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. ఇక‌, త‌న‌పై ఉన్న అవినీతిప‌రుడు అనే ఏకైక మ‌ర‌క‌ను తుడిచేసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి నిన్నటి ప్రమాణ‌స్వీకారం అనంత‌రం చేసిన ప్రసంగం వ‌ర‌కు జ‌గ‌న్ కొన్ని విష‌యాల‌ను ప‌దే ప‌దే చెబుతున్నారు. తాను అవినీతి లేని పాల‌న అందిస్తాన‌ని, పూర్తిగా ప్రక్షాళ‌న చేస్తాన‌ని చెబుతున్నారు. టెండ‌ర్లు, కాంట్రెక్టుల జారీలో అత్యంత పార‌ద‌ర్శకంగా వ్యవ‌హ‌రిస్తామ‌ని జ‌గ‌న్ స్పష్టంగా చెప్పారు. ప‌థ‌కాల‌ను డోర్ డెలివ‌రీ చేస్తామ‌ని, లంచాలు లేకుండా చూస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు. త‌న‌పై ఉన్న అవినీతి మ‌ర‌క‌ను తొల‌గించుకునేందుకు జ‌గ‌న్ ప్రయ‌త్నిస్తున్నట్లు ఇవే స్పష్టం చేస్తున్నాయి.

త‌మ‌కు ప్రభుత్వం నుంచి అందాల్సిన స‌హాయం లేదా ప‌థ‌కాలు లంచ‌నాలు లేకుండా అందితే ప్రజ‌ల్లో సంతృప్తి ఉంటుంది. ఇది నేరుగా ముఖ్యమంత్రిగా ఉన్న జ‌గ‌న్ కే మంచి పేరు తెస్తుంది. అవినీతి లేని పాల‌న జ‌గ‌న్ అందిస్తున్నార‌నే భావ‌న ప్రజ‌ల్లో వ్యక్తమ‌వుతుంది. జ‌గ‌న్ కు కావాల్సింది కూడా ఇదే.

ఇక‌, టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని త‌వ్వి తీస్తాన‌ని జ‌గ‌న్ బాహాటంగానే చెబుతున్నారు. గ‌త ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులను స‌మీక్షించి త‌క్కువ ధ‌ర‌ల‌కు రీటెండ‌రింగ్ చేస్తామ‌ని, ఇలా త‌మ ప్రభుత్వం రావ‌డం వ‌ల్ల ఎంత డ‌బ్బు మిగిలిందో ప్రజ‌ల‌కు చెప్పాల‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న. ఇది టీడీపీని బాగా ఇరుకున‌పెట్టే ప‌ని. కాంట్రాక్టుల్లో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేసింద‌నే భావ‌న ప్రజ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

ఇక‌, అధికారంలో ఉన్న పార్టీలు త‌మ‌కు అనుకూలంగా ఉండే వారికి కాంట్రాక్టులు ఇచ్చుకోవ‌డం అనేది స‌హ‌జ‌మే. ఇలా చంద్రబాబు ఇచ్చిన కాంట్రాక్టుల‌ను రివ‌ర్స్ టెండ‌రింగ్ చేయ‌డం, ప‌నులు ప్రారంభించని కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేయ‌డం వంటివి జ‌గ‌న్ చేయాల‌ని భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే చంద్రబాబు అభ‌యంతో కాంట్రాక్టులు ద‌క్కించుకున్న టీడీపీ నేత‌లు క‌మ్ వ్యాపారులు ఆర్థికంగానూ ఇక్కట్లను ఎదురుకోక త‌ప్పదు. అయితే, ఏ ప్రభుత్వం వ‌చ్చినా గ‌త ప్రభుత్వం చేసిన త‌ప్పొప్పుల‌ను త‌వ్వితీయ‌డం, ఇరుకున పెట్టడం స‌హ‌జ‌మే. ఈ విష‌యాన్ని ఏ ముఖ్యమంత్రి బాహాటంగా చెప్పారు. కానీ, జ‌గ‌న్ మాత్రం బాహాటంగానే చెప్పి చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle