newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

జ‌గ‌న్ పెద్ద స్కెచ్‌తోనే ఉన్నారే..!

16-07-201916-07-2019 08:36:53 IST
Updated On 16-07-2019 10:44:27 ISTUpdated On 16-07-20192019-07-16T03:06:53.723Z16-07-2019 2019-07-16T03:06:46.092Z - 2019-07-16T05:14:27.793Z - 16-07-2019

జ‌గ‌న్ పెద్ద స్కెచ్‌తోనే ఉన్నారే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కులాల‌కు ఉన్న ప్రాధానత ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కొన్ని సామాజ‌క‌వ‌ర్గాల్లో మెజారిటీ ఓట్లు కొన్ని పార్టీల‌కు ప‌డతాయ‌నే లెక్క‌లు ముందు నుంచే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బీసీలు బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. ముందు కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌కు రెడ్డి, ఎస్సీ, మైనారిటీలు ఓటు బ్యాంకుగా ఉండేవారు.

అయితే, ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో మాత్రం ఈ లెక్క‌లు మారాయ‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఎప్పుడూ టీడీపీ వైపు ఉండే బీసీలు ఈసారి కొంత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపిన‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇందుకోసం జ‌గ‌న్ ముందు నుంచే క‌స‌ర‌త్తు చేశారు. పాద‌యాత్ర‌లో బీసీల‌కు అనేక హామీలు ఇచ్చారు. త‌ర్వాత బీసీ గ‌ర్జ‌న ఏర్పాటు చేసి బీసీ డిక్ల‌రేష‌న్ ఇచ్చారు. ఎన్నిక‌ల ముందు ఖాళీ అయిన ఎమ్మెల్సీ ప‌ద‌విని బీసీల‌కు ఇచ్చారు.

ఎన్నిక‌ల్లోనూ కీల‌క‌మైన అనంత‌పురం, క‌ర్నూలు, హిందూపురం, రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానాల‌ను బీసీల‌కు కేటాయించి ఆ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకున్నారు. ఎన్నిక‌ల్లో వైసీపీ గెల‌వ‌డంతో ఈ విష‌యంలో వైసీపీ ఫార్ములా వ‌ర్కౌట్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా బీసీల‌ను పూర్తిగా త‌మ‌వైపు ఉంచుకునేలా వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంది.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా బీసీల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. ఇంత‌వ‌ర‌కు మంత్రివ‌ర్గంలో లేని సామాజిక‌వ‌ర్గాల‌కు ఈసారి జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, బీసీల్లో ఉన్న డిమాండ్‌ను ఢిల్లీలోనూ వైసీపీ త‌ల‌కెత్తుకోని బ‌లంగా వాణి వినిపిస్తోంది.

జ‌నాభా ప్రాతిపాదిక‌న బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పార్ల‌మెంటులో ప్రైవేటు మెంబ‌ర్ బిల్లు పెట్టారు.

ఈ బిల్లుపై చ‌ర్చ కోసం ఆయ‌న గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు. అయినా, చ‌ర్చ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో నిర‌స‌న‌గా రాజ్య‌స‌భ నుంచి వాకౌట్ కూడా చేశారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మొద‌టి బ‌డ్జెట్‌లోనూ బీసీల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. బీసీ డిక్ల‌రేష‌న్‌లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసే దిశ‌గా బ‌డ్జెట్‌లో కేటాయింపులు జ‌రిపారు.

దీంతో బీసీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న వారు జ‌గ‌న్‌, వైసీపీని ప్ర‌శంసిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడిగా ఉన్న ఆర్‌.కృష్ణ‌య్య ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.జ‌గ‌న్ త‌మ డిమాండ్ల‌ను నెర‌వేరుస్తున్నార‌ని, తాము ఒక‌ట‌డిగితే జ‌గ‌న్ రెండు చేస్తున్నార‌ని కితాబిచ్చారు. బీసీల కోసం జ‌గ‌న్ చేస్తున్న కృషి వ‌ల్ల త‌మ‌కు పోరాడేందుకు అజెండానే లేకుండా పోయింద‌ని సైతం ఆయ‌న ప్ర‌శంసించారు.

ఇలా, బీసీల‌ను త‌మ‌తోనే ఉంచుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇదే, జ‌రిగితే మాత్రం బీసీ ఓటు బ్యాంకుగా ఉన్న టీడీపీకి మ‌రిన్ని తిప్ప‌లు త‌ప్పేలా లేవనే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

0


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle