newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

జ‌గ‌న్ పాలిట చింత‌మ‌నేని.. ఈ కోటంరెడ్డి

06-10-201906-10-2019 09:13:15 IST
2019-10-06T03:43:15.566Z06-10-2019 2019-10-06T03:43:12.474Z - - 31-05-2020

జ‌గ‌న్ పాలిట చింత‌మ‌నేని.. ఈ కోటంరెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎంపీడీవో దౌర్జన్యం కేసులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. అధికారం చేతిలో ఉంద‌ని, పాలిస్తున్న పార్టీ త‌మ‌ద‌ని విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రిస్తే ఎంత‌టి బ‌ల‌మైన నాయ‌కుడికైనా ఏ గ‌తి ప‌డుతుందో ఇటీవ‌లి ఎన్నిక‌ల్లోనే రుజువైంది.

తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ నోటిని, చేతుల‌ను అదుపులో పెట్టుకోలేని దూకుడుతో అనేక వివాదాలు సృష్టించుకున్నారు. ఏకంగా డ్యూటీలో ఉన్న మ‌హిళా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షిపైన దాడి చేయ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

అయితే, ఈ ఘ‌ట‌న‌లో చింత‌మ‌నేనిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు అప్ప‌టి ప్ర‌భుత్వం. పైగా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షిదే త‌ప్పు అనేలా వ్య‌వ‌హ‌రించింది. ఇవ‌న్నీ గ‌మ‌నించిన ప్ర‌జ‌లు ఎన్నిక‌ల వేళ త‌మ విజ్ఞ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. నియోజ‌క‌వ‌ర్గంలో చాలా బ‌ల‌మైన నాయ‌కుడైన చింత‌మ‌నేనిని ఓడించారు. రాష్ట్రంలో టీడీపీలో ఓట‌మికి అనేక కార‌ణాల్లో చింత‌మ‌నేని వ్య‌వ‌హారం కూడా ఒక ప్ర‌ధాన కార‌ణం.

అయితే, ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ చింత‌మ‌నేని లాంటి ఓ క్యారెక్ట‌ర్ త‌యారైంది. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి సైతం అచ్చం చింత‌మ‌నేనిలా నోటిని, చేతుల‌ను అదుపులో పెట్టుకోవ‌డం లేదు. అధికార పార్టీ వాడిన‌నో, అధికారం చేతిలో ఉన్న ఎమ్మెల్యేన‌నో కానీ విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

గ‌తంలో జ‌మీన్ రైతు వార‌ప‌త్రిక అధినేత డోలేంద్ర ప్ర‌సాద్‌పై ఇంటికి వెళ్లి దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో శ్రీధ‌ర్ రెడ్డిపై కేసు న‌మోదైంది. అంత‌కుముందు టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా సోష‌ల్ మీడియోలో త‌న‌కు వ్య‌తిరేకంగా పోస్టు పెట్టాడ‌నే కార‌ణంతో ఓ వ్య‌క్తిని ఫోన్‌లో బండ బూతులు తిట్టిన ఆడియో వైర‌ల్‌గా మారి వివాదాస్ప‌దమైంది.

ఇక‌, తాజాగా ఆయ‌న నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం ఎంపీడీఓ ఇంటిపై దాడికి పాల్ప‌డ్డార‌ని తెలుస్తోంది. రాత్రివేళ త‌మ‌ ఇంటికి మ‌ద్యం తాగి వ‌చ్చి దాడి చేశార‌ని ఎంపీడీఓ స‌ర‌ళ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆమె ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రాను, తాగునీటి క‌నెక్ష‌న్‌ను క‌ట్ చేయించార‌ని ఆమె ఆరోపిస్తూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఓ లేఅవుట్‌కు సంబంధించి అనుమ‌తుల విష‌యంలో త‌మ మాట విన‌నందుకే ఎమ్మెల్యే దాడి చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఈ వివాదం వైసీపీకి, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మార‌నుంది. గ‌తంలో చింత‌మ‌నేని వ్య‌వ‌హారంలో ఇదే వైసీపీ పెద్ద ఎత్తున టీడీపీపై, చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు చేసింది. మ‌రి, ఇప్పుడు అటువంటి చ‌ర్య‌ల‌కే కోటంరెడ్డి పాల్ప‌డుతున్నారు.

ఆయ‌న‌పై జ‌గ‌న్ ఎటుంటి వైఖ‌రి తీసుకుంటారో చూడాల్సి ఉంది. అరెస్ట్ చేసినా.. చర్యలు ఎలాంటివి తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు చేసిన‌ట్లు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం వైసీపీ ప్ర‌జ‌ల్లో అప్ర‌తిష్ఠ మూట‌గ‌ట్టుకోక త‌ప్ప‌దు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle