newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

జ‌గ‌న్ నిర్ణ‌యంతో తెలంగాణ‌లో రాజ‌కీయ ర‌చ్చ‌

10-05-202010-05-2020 08:32:34 IST
Updated On 10-05-2020 11:21:16 ISTUpdated On 10-05-20202020-05-10T03:02:34.513Z10-05-2020 2020-05-10T03:02:28.128Z - 2020-05-10T05:51:16.063Z - 10-05-2020

జ‌గ‌న్ నిర్ణ‌యంతో తెలంగాణ‌లో రాజ‌కీయ ర‌చ్చ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాజ‌కీయాలు ఎప్పుడూ ఏక‌ప‌క్షంగా సాగుతూ ఉంటాయి. అంశం ఏదైనా ప్ర‌తిప‌క్షాల‌పైన ప్రభుత్వానిది పైచేయి అవుతుంది. కాంగ్రెస్‌, బీజేపీ అడ‌పాద‌డ‌పా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తినా పెద్ద ప‌ట్టించుకునే వారు లేరు. మీడియాలోనూ వీరి వాయిస్‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌దు. దీంతో ప్ర‌తిప‌క్షాలు చేసే ఆరోప‌ణ‌లు ఆరోణ్య‌రోద‌న‌లుగా మిగిలిపోతూ ఉంటాయి. పైగా ప్ర‌తిప‌క్షం బ‌ల‌హీనంగా ఉంద‌నే ఒక నింద‌ను కూడా మోయాల్సి వ‌స్తోంది.

ఏ చిన్న విమ‌ర్శ చేసినా ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరుగుతుంటారు. బ్రోక‌ర్లు, జోక‌ర్లు, లోఫ‌ర్లు అంటూ నోటికొచ్చిన‌ట్లు తిట్టిపోస్తారు. కేసీఆర్ వ్యూహాలు, బ‌లాలు, వాక్చాతుర్యం ముందు ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు పెద్దగా వినిపించ‌వు, క‌నిపించ‌వు. ఇక‌, తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గా సంతృప్తి ఉండ‌టం, కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రైతుల‌కు పెద్ద పీట వేస్తుండ‌టంతో ప్ర‌జ‌ల్లోనూ టీఆర్ఎస్ పాల‌న ప‌ట్ల న‌మ్మ‌కం ఉంది. దీంతో ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డానికి స‌రైన అస్త్రం దొర‌క‌డం లేదు.

ఇటువంటి స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్షాల‌కు ఓ అస్త్రాన్ని అందించారు. ప్ర‌భుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని నిల‌దీసేందుకు అవ‌కాశం క‌ల్పించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయ‌ల‌సీమ‌కు నీరందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యం రెట్టింపు చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నిర్ణ‌యాన్ని గ‌తంలో అసెంబ్లీలోనే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఇందుకు సంబంధించి జ‌గ‌న్ స‌ర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.

రాయ‌ల‌సీమ పంపింగ్ ప్రాజెక్ట్ పేరిట డిజైన్ కూడా పూర్తైంద‌ని తెలుస్తోంది. రూ.6,829 కోట్ల‌తో ప‌నుల‌కు ఆమోద‌ముద్ర కూడా ప‌డిందనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా పోతిరెడ్డిపాడు ప్ర‌స్తుత సామ‌ర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల‌కు పెంచాల‌నేది ఏపీ ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. శ్రీశైలం నుంచి రాయ‌ల‌సీమ‌కు రోజుకు 3 టీఎంసీల నీరు అద‌నంగా త‌ర‌లించాల‌నేది ప్రాజెక్టు ల‌క్ష్యంగా చెబుతున్నారు. అయితే, ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సైలెంట్‌గా ఉండ‌టంతో ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యం పెంచి శ్రీశైలం నుంచి రోజూ 3 టీఎంసీల నీళ్లు అద‌నంగా రాయ‌ల‌సీమ‌కు తీసుకువెళ్తే తెలంగాణ‌లో శ్రీశైలంపై ఆధార‌ప‌డిన ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టు ఎండిపోతుంద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మ‌డి మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాపై ఈ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆ జిల్లా నేత‌లు నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి, డీకే అరుణ వంటి వారు ఆరోపిస్తున్నారు. పోతిరెడ్డిపాడు విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో కేసీఆర్ కుమ్మ‌క్క‌య్యార‌ని నిందిస్తున్నారు. లేక‌పోతే ప్ర‌భుత్వం ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి ముందునుంచీ వివాదంగా ఉంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో ఈ ప్రాజెక్టు నిర్మించి రాయ‌ల‌సీమ‌కు నీరందించారు. ఈ విష‌యాన్ని అప్పుడు తెలంగాణ ఉద్య‌మ‌సారథిగా ఉన్న కేసీఆర్ గ‌ట్టిగా నిల‌దీశారు. వైఎస్సార్‌ను, అప్ప‌టి కాంగ్రెస్ నాయ‌కుల‌ను ఈ విష‌య‌మై కేసీఆర్ నిందించేవారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణ‌కు వైఎస్ అన్యాయం చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు హార‌తులు ప‌ట్టార‌ని కేసీఆర్ ఆరోపించారు.

దీంతో అప్పుడు త‌మ‌ను అంత‌గా విమ‌ర్శించిన కేసీఆర్ ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై ఎందుకు స్పందించ‌డం లేద‌ని తెలంగాణ‌లోని కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ విష‌య‌మై టీఆర్ఎస్ స్పందించ‌డం లేదు. అయితే, జ‌గ‌న్‌తో కేసీఆర్‌కు స‌యోధ్య బాగా ఉంది.

నీటి ప్రాజెక్టుల విష‌యంలో రెండు రాష్ట్రాలూ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని, గోదావ‌రి నీటిని కృష్ణ‌కు మ‌ళ్లించి రెండు రాష్ట్రాలకు సాగునీటి స‌మ‌స్య లేకుండా చేయాల‌నేది ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల ఆలోచ‌న‌. మ‌రి, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పోతిరెడ్డిపాడుపై తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తార‌నేది చూడాల్సి ఉంది. అయితే, ఈ అంశంలో తెలంగాణ రాజ‌కీయ ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది.

 

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle