newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

జ‌గ‌న్ నిర్ణయం వైసీపీకి క‌లిసొచ్చిందా..?

28-04-201928-04-2019 11:48:55 IST
Updated On 04-07-2019 11:09:50 ISTUpdated On 04-07-20192019-04-28T06:18:55.628Z28-04-2019 2019-04-28T06:11:41.233Z - 2019-07-04T05:39:50.928Z - 04-07-2019

జ‌గ‌న్ నిర్ణయం వైసీపీకి క‌లిసొచ్చిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాద‌యాత్ర స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్తల విష‌యంలో ఊహించ‌ని నిర్ణ‌యాలు తీసుకున్నారు. పార్టీలో చాలారోజులుగా ఉంటూ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన వారిని ఏమాత్రం మొహ‌మాటం లేకుండా తొల‌గించి కొత్త వారిని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా నియ‌మించారు. దీంతో జ‌గ‌న్ నిర్ణ‌యాల ప‌ట్ల పాత నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తాము ఇన్నేళ్లు క‌ష్ట‌ప‌డితే త‌మ‌ను ప‌క్క‌న పెట్టి కొత్త వారికి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు ఇవ్వ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. త‌ర్వాత కొంద‌రు స‌ర్దుకొని పార్టీలోనే కొన‌సాగ‌గా మ‌రికొంద‌రు మాత్రం పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇలా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా నియ‌మించిన వారికే జ‌గ‌న్ టిక్కెట్లు క‌ట్ట‌బెట్టారు.

పాత వారిని ప‌క్క‌న పెట్టి కొత్త‌గా చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వ‌డంతో జ‌గ‌న్‌పై  తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. డ‌బ్బులు ఉన్న వారికే జ‌గ‌న్ పెద్ద‌పీట వేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. టీడీపీ అయితే జ‌గ‌న్ టిక్కెట్ల‌ను వేలం వేస్తున్నార‌ని, ఎక్కువ డ‌బ్బులు ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తున్నార‌ని ఆరోపించింది. జ‌గ‌న్ ప‌దేప‌దే పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు, అభ్య‌ర్థుల‌కు ఖ‌ర్చు చేయాల‌ని అంటార‌నే ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఎవ‌రైనా టిక్కెట్ అడ‌గ‌గానే ఎంత ఖ‌ర్చు పెట్ట‌గ‌ల‌ర‌ని అడుగుతార‌ని జ‌గ‌న్ పై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అయితే, ఈ విష‌యంలో జ‌గ‌న్ ప‌క్కా ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడిలానే వ్య‌వ‌హ‌రించారు. దేశంలో ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల్లో డ‌బ్బు ప్ర‌భావం ఎంత‌లా పెరిగిపోయిందో తెలిసిందే. త‌మ‌కు ఓట్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని ప్ర‌జ‌లు రోడ్డెక్కుతున్న సంఘ‌ట‌న‌లూ చూస్తున్నాం. దీంతో ఎన్ని సేవ‌లు చేశామ‌న‌న్న‌దే కాకుండా ఎన్నిక‌ల్లో ఎంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టామ‌న్న‌దానిపైనే అభ్య‌ర్థుల‌ గెలుపోట‌ములు ఎక్కువ‌గా ఆధార‌ప‌డి ఉంటున్నాయి. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ క‌చ్చితంగా న‌మ్మారు. అందుకే డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌గ‌లిగిన వారికే మొహ‌మాటం లేకుండా టిక్కెట్లు ఇచ్చారు.

పైగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు భారీగా డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డం స‌హ‌జం. అందుకే వారిని ఢీకొట్టాలంటే అదే స్థాయిలో త‌మ అభ్య‌ర్థులూ డ‌బ్బు పెట్టాల‌ని జ‌గ‌న్ భావించార‌ట‌. అందుకే రిజ‌ర్వుడ్ స్థానాలు మిన‌హా డ‌బ్బు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే నియోజ‌క‌వ‌ర్గాల‌ టిక్కెట్లు డ‌బ్బుల ఆధారంగా ఇచ్చారంటున్నారు. ఇప్పుడు ఇదే వైసీపీకి బాగా అడ్వాంటేజ్‌గా క‌నిపిస్తుంద‌ట‌.

ఐటీ దాడులు, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు పెద్ద‌గా డ‌బ్బులు పంపిణీ చేయ‌లేక‌పోయార‌ట‌. ఇదే స‌మ‌యంలో వైసీపీ అభ్య‌ర్థులు మాత్రం ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌కుండా పంపిణీ చేశార‌ని తెలుస్తోంది. కొన్ని చోట్ల టీడీపీ అభ్య‌ర్థుల‌కు పోటీ ప‌డి వైసీపీ డ‌బ్బులు పంపిణీ చేసింది. ఓ ద‌శ‌లో చంద్ర‌బాబు అస‌హ‌నంతో ప్ర‌తిప‌క్ష పార్టీకి డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 

ఎన్ని ప‌థ‌కాలు పెట్టినా ఎన్నిక‌ల ముందు అభ్య‌ర్థి ఇచ్చే డ‌బ్బు గెలుపోట‌ముల‌ను బాగానే ప్ర‌భావితం చేస్తుంది. దీంతో టీడీపీకి వైసీపీ ధీటుగా పోటీ ఇచ్చింద‌న‌టానికి డ‌బ్బు పంపిణీ కూడా ఒక కార‌ణం అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో డ‌బ్బుల విష‌యంలో వైసీపీ కొంత వెనుక‌బ‌డింది. ఈసారి మాత్రం ఈ విష‌యంలో టీడీపీతో ఢీకొట్టింది. మ‌రి, ఈ ఎన్నిక‌ల్లో డ‌బ్బు   ప్ర‌భావం ఏ మేర‌కు ప‌నిచేసిందో ఫ‌లితాలు వచ్చాకే తెలుస్తుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle