newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జ‌గ‌న్ టైమ్ కోసం ఎమ్మెల్యేల వెయిటింగ్‌

30-11-201930-11-2019 14:24:34 IST
2019-11-30T08:54:34.504Z30-11-2019 2019-11-30T08:54:32.533Z - - 05-08-2020

జ‌గ‌న్ టైమ్ కోసం ఎమ్మెల్యేల వెయిటింగ్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌లు పూర్త‌య్యింది. ఊహ‌ల‌కు సైతం అంద‌ని విధంగా 151 సీట్లు గెలుచుకున్న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బిజీబిజీగా ఉన్నారు.

అయితే, ఆయ‌న బిజీగా ఉండ‌ట‌మే ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది. త‌మ అధినేతను క‌లిసేందుకు స‌మ‌యం దొర‌క‌క వైసీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది ప‌డుతున్నారు. పైకి చెప్పుకోలేక జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. వైసీపీ ఇంత భారీ విజ‌యం సాధించింది అంటే ఆ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అన్ని ఆశ‌లు ఉన్న‌ట్లు అర్థం. ముఖ్యంగా వైసీపీ గుర్తుపై పోటీ చేసిన అభ్య‌ర్థులు ప్ర‌జ‌ల‌కు తెలిసిన వారైనా, తెలియ‌ని వారైనా సునాయ‌సంగా విజ‌యం సాధించారు.

చాలా మంది మొద‌టిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌య్యారు. గెలిచిన ఏ ఎమ్మెల్యే అయినా నియోజ‌క‌వ‌ర్గానికి చేత‌నైనంత మంచి చేయాల‌నే ప్ర‌య‌త్నిస్తారు. ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలు అయితే నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసి మంచి మార్కులు వేయించుకుంటే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కూడా బాగుంటుంద‌ని ఆశ‌ప‌డుతుంటారు.

ఇక‌, ఎన్నిక‌ల్లో పార్టీ కోసం ప‌నిచేసిన క్యాడ‌ర్‌కు ఏ ర‌కంగానో న్యాయం చేయాల్సిన బాధ్య‌త కూడా వారిపై ఉంటుంది. ఇవ‌న్నీ చెప్పుకొని త‌మ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు పార్టీ మంచిచెడులు మొర పెట్టుకునేందుకు ఎమ్మెల్యేల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అందుబాటులో ఉండ‌టం లేద‌నే అసంతృప్తి మొద‌లైంది.

వైసీపీ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ దొర‌క‌డం క‌ష్టంగా మారింది. ఆయ‌న‌ను క‌లిసి త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి నిధులో, ప‌నులో అడుగుదామ‌ని ప్ర‌య‌త్నిస్తున్న ఎమ్మెల్యేలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటి వారు నెల‌లో రెండుసార్లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌ల‌వ‌గ‌లిగినా స్వంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం క‌ల‌వ‌లేక‌పోతున్నారు.

రాజ‌ధాని స‌మీప జిల్లాల ఎమ్మెల్యేలు రెండు రోజులు అటోఇటో జ‌గ‌న్‌ను క‌ల‌వ‌గ‌లుగుతున్నా దూర జిల్లాల ఎమ్మెల్యేలు మాత్రం క‌ల‌వ‌లేక‌పోతున్నారు. జ‌గ‌న్ ఏదైనా కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వారి జిల్లాల‌కు వ‌చ్చిన‌ప్పుడే క‌ల‌వ‌డం త‌ప్ప జ‌గ‌న్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి మాట్లాడే ఛాన్స్ ఎమ్మెల్యేల‌కు దొర‌క‌డం లేదు.

ఓ వైపు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలు అనేక హామీలు ఇచ్చారు. వాటిని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించాల‌నే ఆశ‌తో ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, కొత్త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు పాల‌నా అనుభ‌వం లేనందున‌, ఆయ‌న పాల‌న‌పై ప‌ట్టు సాధించేందుకే ఎక్కువ స‌మ‌యం తీసుకుంటున్నారు.

త‌ర‌చూ వివిధ శాఖ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు ఎన్నిక‌ల మేనిఫెస్టోను వేగంగా అమ‌లు చేయ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఆయ‌న‌కు ఎమ్మెల్యేల‌కు విడిగా అపాయింట్‌మెంట్ ఇచ్చే స‌మ‌యం దొర‌క‌డం లేద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతానికైతే చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తూ, ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో కీల‌కంగా ఉండే అధికారులు, స‌ల‌హాదారుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి, ఆరు నెల‌ల పాల‌న త‌ర్వాతైనా జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌కు స‌మ‌యం ఇస్తారో లేదో చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle