newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

జ‌గ‌న్ టీంలో జూనియ‌ర్ల హ‌వా..!

09-06-201909-06-2019 08:12:38 IST
Updated On 24-06-2019 14:10:33 ISTUpdated On 24-06-20192019-06-09T02:42:38.439Z09-06-2019 2019-06-09T02:42:35.708Z - 2019-06-24T08:40:33.853Z - 24-06-2019

జ‌గ‌న్ టీంలో జూనియ‌ర్ల హ‌వా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయ విశ్లేష‌కులు, పార్టీ నేత‌ల అంచ‌నాల‌కు సైతం అంద‌కుండా క్యాబినెట్ కూర్పు చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోర్టుఫోలియోల కేటాయింపుల‌ లోనూ త‌న ముద్ర వేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కీల‌క మంతృత్వ శాఖ‌లు జూనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు ఇవ్వ‌డం, సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు మామూలు ప్రాధాన్య‌త ఉన్న శాఖ‌లు క‌ట్ట‌బెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

25 మందిని మంత్రివ‌ర్గంలోకి తీసుకున్న జ‌గ‌న్ ఊహ‌ల‌కు కూడా అంద‌కుండా కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చారు. ఏకంగా ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రుల‌ను నియ‌మించారు. సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు పాటిస్తూ ఎస్సీ, బీసీల‌కు క్యాబినెట్ లో పెద్ద పీట వేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపులోనూ జ‌గ‌న్ ఇదేశైలిలో నిర్ణ‌యాలు తీసుకున్నారు.

కీల‌క‌మైన హోంశాఖ‌ను ఎస్సీ మ‌హిళ అయిన మేక‌తోటి సుచ‌రిత‌కు కేటాయించారు. ఈ విష‌యంలో ఆయ‌న త‌న తండ్రి వైఎస్ బాట‌లో న‌డిచారు. వైఎస్ మొద‌టిసారిగా రాష్ట్ర చ‌రిత్ర‌లో 2009లో మ‌హిళ‌కు హోంశాఖ కేటాయించి కొత్త చ‌రిత్ర రాశారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇదే నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక‌, ఆర్థిక శాఖ‌ను సైతం జ‌గ‌న్ రెండోసారి ఎమ్మెల్యే అయిన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి కి అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌నపై జ‌గన్ కు న‌మ్మ‌కం ఎక్కువ‌. అందుకే గ‌తంలో పీఏసీ ఛైర్మ‌న్ వంటి కీల‌క బాధ్య‌త‌లు ఆయ‌న‌కు ఇచ్చారు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఆయ‌న లెక్క‌ల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టి ఇరుకున‌పెట్టారు. దీంతో ఆయ‌న‌కు ఇప్పుడు కీల‌క‌మైన ఆర్థిక‌శాఖ ఇచ్చారు.

ఇక‌, మ‌రో కీల‌కశాఖ అయిన నీటిపారుద‌ల శాఖ‌ను కూడా రెండోసారి ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాద‌వ్ కు ఇచ్చారు జ‌గ‌న్‌. జ‌ల‌య‌జ్ఞం కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ ప్ర‌తిప‌ష్టాత్మ‌కంగా తీసుకొని ప్రాజెక్టులు పూర్తి చేయాల‌నే ల‌క్షంతో ఉన్నారు. దీంతో అనిల్ కుమార్ యాద‌వ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

వ్య‌వ‌సాయ శాఖ‌ను సైతం రెండోసారి ఎమ్మెల్యే అయిన కుర‌సాల క‌న్న‌బాబుకు, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను కూడా రెండోసారి గెలిచిన మేక‌పాటి గౌతమ్ రెడ్డికి ఇచ్చారు. ఈ రెండో కీల‌క‌మైన ప‌ద‌వులే. ఇలా జూనియ‌ర్ ల‌కు జ‌గ‌న్ కీల‌క పోర్టుఫోలియోలు అప్ప‌గించారు. వీరంతా జ‌గ‌న్ వ‌య‌స్సుకు కాస్త అటుఇటుగా ఉంటారు. అంద‌రూ విద్యావంతులు కావ‌డంతో వారిపై న‌మ్మ‌కంతో జ‌గ‌న్ కీల‌క ప‌దవులు క‌ట్ట‌బెట్టారు. ఇదే స‌మ‌యంలో ఎంతో ప్రాధాన్య‌త ఉన్న శాఖ‌లు ద‌క్కుతాయ‌నుకున్న సీనియ‌ర్‌లకు మాత్రం పెద్ద‌గా ప్రాధాన్య‌త ఉన్న శాఖ‌లు ద‌క్క‌లేదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle