newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

జ‌గ‌న్ టీంలో చోటెవ‌రికి..?

28-05-201928-05-2019 11:43:37 IST
Updated On 26-06-2019 15:01:38 ISTUpdated On 26-06-20192019-05-28T06:13:37.250Z28-05-2019 2019-05-28T06:13:13.407Z - 2019-06-26T09:31:38.357Z - 26-06-2019

జ‌గ‌న్ టీంలో చోటెవ‌రికి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తిరుగులేని విజ‌యం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ నెల 30వ తేదీన విజ‌య‌వాడ‌లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. త‌న తండ్రిలానే మొద‌ట జ‌గ‌న్ ఒక్క‌రే ఆ రోజు ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారు. త‌ర్వాత వారం రోజుల పాటు అన్ని శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేసిన త‌ర్వాత జ‌గ‌న్ త‌న క్యాబినెట్ ను ఏర్పాటు చేసుకుంటారు.

అయితే, ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు విజ‌యం సాధించ‌డంతో జ‌గ‌న్ క్యాబినెట్ లో బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. సీనియ‌ర్ ఎమ్మెల్యేలు, 2009 నుంచీ జ‌గ‌న్ తో న‌డిచిన ఎమ్మెల్యేలు, జ‌గ‌న్ నుంచి ఎన్నిక‌ల్లో హామీ పొందిన ఎమ్మెల్యేలు క్యాబినెట్ బెర్త్ ను ఆశిస్తున్నారు. సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు, జ‌గ‌న్ తో వారికున్న సంబంధాల‌ను లెక్క‌లు వేసుకుని మంత్రి ప‌ద‌విపై ప‌లువురు ధీమాగా క‌నిపిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో సీనియ‌ర్ నేత‌లుగా ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు లేదా ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ల‌లో ఒక‌రికి, త‌మ్మినేని సీతారం లేదా రెడ్డి శాంతికి మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంది. ఇక‌, మొత్తం సీట్ల‌ను వైసీపీకి క‌ట్ట‌బెట్టిన విజ‌య‌న‌గ‌రంలో జిల్లా నుంచి సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మే. ఆయ‌న‌తో పాటు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చు.కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి మంత్రి ప‌ద‌వి లేదా ఇత‌ర ప్రాధాన్య‌త ఉన్న ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంది.

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస‌రావు బెర్త్ ఆశిస్తున్నారు. మిగ‌తా ఎమ్మెల్యేలంతా కొత్త వారే కావ‌డంతో ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు. ఇక‌, పోల‌వ‌రం ఎమ్మెల్యే తెల్లం బాల‌రాజు ఎస్టీ కోటాలో, పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. ఆయ‌న 2009 నుంచి జ‌గ‌న్ తోనే ఉన్నారు.

తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు కోటాలో కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కుర‌సాల క‌న్నబాబుకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మండ‌పేట నుంచి పోటీ చేసి ఓడినా ఎమ్మెల్సీగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ కు కూడా ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చు. ఆయ‌న వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత మంత్రి ప‌ద‌వి వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిచారు. ఇక‌, దాడిశెట్టి రాజా, పినిపె విశ్వ‌రూప్ కూడా మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు. ఇక్క‌డ మ‌రో బెర్త్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ పేరును ప‌రిశీలిస్తున్నారు. 

కృష్ణా జిల్లాలో మంత్రి ప‌ద‌వుల‌కు పోటీ బాగానే ఉంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి క‌మ్మ కోటాలో మంత్రి ప‌ద‌వి ఖాయ‌మైంది. మ‌రో బెర్త్ కోసం మాజీ మంత్రి పార్థ‌సార‌థి, బ్రాహ్మ‌ణ కోటాలో సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ప్ర‌య‌త్నిస్తున్నారు. సీనియ‌ర్ నేత‌లు మేకా ప్ర‌తాప్ అప్పారావు, సామినేని ఉద‌య‌భాను సైతం రేసులో ఉన్నారు.

గుంటూరు నుంచి ఇప్ప‌టికే నారా లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని మంత్రిని చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఆయ‌న‌కు వ్య‌వ‌సాయ శాఖ ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ముందునుంచీ జ‌గ‌న్ తో న‌డుస్తున్న పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, మేక‌తోటి సుచరిత‌, అంబ‌టి రాంబాబులు కూడా మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు. బ్రాహ్మ‌ణ కోటాలో మ‌ల్లాది విష్ణుకు ఇవ్వ‌క‌పోతే బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తికి అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు.

ప్ర‌కాశం జిల్లాలో ఎస్సీ కోటాలో ఆదిమూల‌పు సురేష్ పేరు దాదాపు ఖాయ‌మైంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, ఇప్ప‌టికే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రి చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌చారంలో హామీ ఇచ్చారు. ఆయ‌న వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత మంత్రి ప‌ద‌వి వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిచారు.

వైసీపీకి ముందునుంచీ అండ‌గా ఉంటున్న నెల్లూరు జిల్లాలో మంత్రిప‌ద‌వుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇక్క‌డ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంది. ఇక‌, 2009 నుంచి జ‌గ‌న్ వెంట న‌డుస్తున్న‌మేక‌పాటి కుటుంబానికి క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ఊహాగానాలు ఉన్నాయి. ఇక‌, సీనియ‌ర్ నేత న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, జ‌గ‌న్ కు స‌న్నిహితులు రాంరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి సైతం రేసులో ఉన్నారు. బీసీ కోటాలో యువ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ కు కూడా మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంది.

జ‌గ‌న్ స్వంత జిల్లా క‌డ‌ప‌లో జ‌గ‌న్ మిన‌హా అంద‌రు ఎమ్మెల్యేలూ మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు. వీరంతా జ‌గ‌న్ కు స‌న్నిహితులు. ముందునుంచీ జ‌గ‌న్ తో న‌డుస్తున్న వారు ఎక్కువ‌. అయితే, గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి, ముస్లిం కోటాలో క‌డ‌ప ఎమ్మెల్యే  అంజాద్ పాషా, ఎస్సీ కోటాలో కోర‌ముట్లు శ్రీనివాసులు మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు.

వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన మ‌రో జిల్లా క‌ర్నూలులోనూ మంత్రి ప‌ద‌వుల‌కు పోటీ తీవ్రంగా ఉంది. ఇక్క‌డ ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌దులుకొని వైసీపీలో చేరిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాట‌సాని రాంభూపాల్ రెడ్డి మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు. డోన్ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి జ‌గ‌న్ కు స‌న్నిహితులు, స‌మ్మ‌క‌స్థులు కావ‌డంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయం. మంత్రాల‌యం ఎమ్మెల్యే బ‌ల‌నాగిరెడ్డి సోద‌రులు ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ ఇంటి నుంచి ఒక‌రికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. దీంతో క‌ర్నూలు జిల్లాలో మంత్రుల‌ను ఎంపిక చేయ‌డం జ‌గ‌న్ కు ఇబ్బందే.

అనంత‌పురం జిల్లాలో సీనియ‌ర్ నేత అనంత వెంక‌ట్రామిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. మ‌రో ప‌ద‌వి కోసం కాపు రామ‌చంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. 

మంత్రుల‌ను తీసుకోవ‌డంతో చిత్తూరు జిల్లా జ‌గ‌న్ కు త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి కీల‌క మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం ఖాయ‌మే. మ‌రో బెర్త్ కోసం జ‌గ‌న్ కు స‌న్నిహితులు భూమ‌న క‌రుణాకర్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు మ‌హిళా కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

మొత్తంగా జ‌గ‌న్ టీమ్ లో చోటు ద‌క్కించుకునేందుకు సుమారు 50 మంది ఎమ్మెల్యేలు పోటీ ప‌డుతున్నారు. మరి, వీరిలో జ‌గ‌న్ ఎవ‌రెవ‌రికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle