newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

20-11-201920-11-2019 12:19:31 IST
2019-11-20T06:49:31.750Z20-11-2019 2019-11-20T06:49:30.133Z - - 21-01-2020

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ ర‌ద్ద‌వుతుంద‌ని, ఆయ‌న మ‌ళ్లీ జైలుకు వెళ‌తార‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో, రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల కోర్టుకు వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి జ‌గ‌న్‌ మిన‌హాయింపు కోరిన స‌మ‌యంలో సీబీఐ కొన్ని తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం, కోర్టులో జ‌గ‌న్‌కు చుక్కెదురు కావ‌డంతో ఈ ప్ర‌చారం ఊపందుకుంది.

కేసీఆర్ కూడా త‌న అంత‌రంగికుల‌తో ఈ విష‌యం చెప్పిన‌ట్లుగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ మీడియా సంస్థ అధిప‌తి ప్ర‌చారం చేశారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి హోదా విచార‌ణ‌ను ప్ర‌భావితం చేస్తార‌నే ఆరోప‌ణ‌ల‌ను సీబీఐ చేసింది. దీనికి తోడు తీవ్ర‌మైన కేసుల్లో ఎక్కువ కాలంగా బెయిల్‌పై బ‌య‌ట ఉన్న వారి బెయిల్‌ల‌ను ర‌ద్దు చేయించాల‌ని కేంద్రం కూడా నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌చారం మొద‌లైంది.

ఇవ‌న్నీ క‌లిసి జ‌గ‌న్ ఇక జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. ఇక‌, గ‌వ‌ర్న‌ర్‌ను జ‌గ‌న్ త‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి వెళ్లడాన్ని కూడా ఈ ప్ర‌చారానికి జ‌త చేస్తున్నారు.

జ‌గ‌న్ జైలుకు వెళ్తే భార‌తిని ముఖ్య‌మంత్రిని చేస్తార‌ని, అందుకే ఇప్ప‌టి నుంచే ఆమెకు పాల‌నాప‌ర‌మైన విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నార‌ని, గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు ఆమెను అందుకే తీసుకెళ్లార‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని, ఆయ‌న జైలుకు వెళ్ల‌బోతున్నారు అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యాఖ్యానించారు.

అయితే, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా ? జ‌గ‌న్ మ‌ళ్లీ జైలుకు వెళతారా ? అనే విష‌యాల‌ను ప‌క్క‌న‌పెడితే ఈ ప్ర‌చారం మాత్రం తెలుగుదేశం పార్టీకి అత్య‌వ‌స‌రంగా క‌నిపిస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ చ‌రిత్ర‌లోనే దారుణ ప‌రాభ‌వానికి గురైంంది.

ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నేత‌ల్లో పార్టీ భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కం కోల్పోతున్నారు. స్వ‌యానా అధినేత చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌గా ఉండే వ్య‌క్తులే పార్టీని వీడి పోతున్నారు.

తాజాగా, వ‌ల్ల‌భ‌నేని వంశీతో ఎమ్మెల్యేల వ‌ల‌స‌లు కూడా మొద‌ల‌య్యాయి. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన‌డం లేదు.

ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు వెళ్లిపోతే తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా పోతుంది. టీడీపీకి ఆది నుంచి వెన్నుద‌న్నుగా నిలుస్తున్న క‌మ్మ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు కూడా ఆ పార్టీని వీడిపోతున్నారు.

ఓ వైపు ప్ర‌భుత్వంపై యుద్ధం చేస్తూ చంద్ర‌బాబు పార్టీని మ‌ళ్లీ ప్ర‌జల్లో నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నా వైసీపీ వ్యూహంతో వ‌రుస‌గా టీడీపీ నేత‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు. పార్టీ నుంచి ఇప్ప‌టికిప్పుడు వైసీపీలోకి వ‌ల‌స‌లు వెళ్ల‌కుండా చూసుకోవ‌డం టీడీపీకి అత్య‌వ‌స‌రం. అందుకే టీడీపీ భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కం క‌లిగించ‌డం కంటే వైసీపీ భ‌విష్య‌త్‌పై అప‌న‌మ్మ‌కం క‌ల్పించాల‌ని టీడీపీ భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ మ‌ళ్లీ జైలుకు వెళ‌తార‌నే ప్ర‌చారం తెలుగుదేశం వ‌ర్గాల నుంచే మొద‌లైంది. జ‌గ‌న్ జైలుకు వెళ్తే వైసీపీకి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని, దీంతో మ‌ళ్లీ టీడీపీనే ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌నే భావ‌న నేత‌ల్లో రావాల‌నే వ్యూహం ఈ ప్ర‌చారం వెనుక ఉండ‌వ‌చ్చు.

అయితే, ఈ ప్ర‌చారం ఫ‌లిస్తుందా ? టీడీపీ నేత‌ల‌ను వైసీపీలోకి వెళ్ల‌కుండా పార్టీ నిలువ‌రించ‌గ‌లుగుతుందా అనే దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle