newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

జ‌గ‌న్ గ‌ర్వించే దృశ్యం రానే వ‌చ్చింది..!

04-11-201904-11-2019 11:14:08 IST
Updated On 04-11-2019 18:11:32 ISTUpdated On 04-11-20192019-11-04T05:44:08.050Z04-11-2019 2019-11-04T05:44:03.796Z - 2019-11-04T12:41:32.108Z - 04-11-2019

జ‌గ‌న్ గ‌ర్వించే దృశ్యం రానే వ‌చ్చింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సామాన్యుడికి ప్ర‌భుత్వ కార్యాల‌యం వ‌ద్దకు వెళ్లాలంటే ఏదో తెలియ‌ని భయం. అందులోను ఉరుకులు. చ‌దువురాని వారైతే త‌మ‌ను ప్ర‌భుత్వ కార్యాల‌యంలో త‌మ‌ను ప‌ట్టించుకునే నాధుడు ఉంటారా..? అన్న శంస‌యంతో సామాన్యులు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వెళ్తుంటారు. అయితే ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తొలి రోజు నుంచి కూడా తన స‌హ‌చ‌రులకు, ఉద్యోగుల‌కు మ‌న‌మంతా ప్ర‌జా సేవ‌కులం మాత్ర‌మే అని చెబుతూ వ‌స్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల రూపు రేఖ‌లను మార్చాల‌న్న ఉద్దేశంతో గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి శ్రీ‌కారం చుట్టారు. ల‌క్షా 30 వేల ఉద్యోగాల‌ను గ్రామ స‌చివాల‌యాల కోసం భ‌ర్తీ చేశారు. ప్ర‌భుత్వానికి మంచి పేరు రావ‌డ‌మా..?  లేదా..? అన్న‌ది గ్రామ స‌చివాల‌యాల ఉద్యోగ‌లపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని, త‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాల‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దే కోరుతూ వచ్చారు.

అందుకు త‌గ్గ‌ట్టుగానే గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు ముందుకు వెళుతున్నారు. వారి ప‌నితీరుకు అద్దంప‌ట్టేలా ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. గ్రామ స‌చివాల‌య ఉద్యోగులూ అందుకుంటున్నారు. పింఛ‌న్ కోసం వ‌చ్చిన వృద్ధులు కింద కూర్చునేందుకు ఇబ్బంది ప‌డుతున్న విషయాన్ని గ‌మ‌నించిన గ్రామ స‌చివాల‌య ఉద్యోగి అంజ‌న్‌రెడ్డి తాను నేల‌మీద కూర్చొని పింఛ‌న్ కోసం వ‌చ్చిన వృద్ధుల‌కు త‌న కుర్చ‌లో కూర్చోబెట్టి వారి నుంచి ఫింగ‌ర్ ప్రింట్ తీసుకున్నారు. 

అంజ‌న్‌రెడ్డి కింద కూర్చొని కుర్చీలో కూర్చున్న వృద్ధుల‌కు పింఛ‌న్ న‌గ‌దును అంద‌జేస్తున్న దృశ్యాన్ని కెమెరాలో బంధించిన కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఆ ఫోటో బాగా వైర‌ల్ అయింది. ఇదే క‌దా.. ప్ర‌జ‌లు కోరుకునే మార్పు అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. ఆ ఫోటోను చూసిన పంచాయ‌తీరాజ్ ముఖ్య కార్య‌ద‌ర్శి గోపాల‌కృష్ణ ద్వివేది కూడా ఉప్పొంగిపోయారు. 

స‌ద‌రు ఉద్యోగికి ప్ర‌భుత్వం త‌రుపున స‌న్మానం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. స‌ద‌రు ఉద్యోగి వివ‌రాల కోసం చాలా మంది ఆరా తీస్తున్నారు. వృద్ధుల‌ను కుర్చ‌లో కూర్చోబెట్టి.. కింద కూర్చొని విధులు నిర్వ‌హించిన ఉద్యోగి పేరు అంజ‌న్‌రెడ్డి. ఇత‌డు అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని అంపాపురం గ్రామ స‌చివాల‌య ఉద్యోగిగా ఇటీవ‌లె చేరారు. 

అంజ‌న్‌రెడ్డి గ‌తంలో 108 సర్వీసుల‌కు సంబంధించి రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల ప్రోగ్రామ్ మేనేజ‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఇత‌ను శ్రీ కృష్ణ దేవ‌రాయ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతంలో స‌ర్వీసు చేయ‌డం త‌న‌కు ఇష్ట‌మ‌ని, అందుకే గ‌తంలో 108లో ప‌నిచేశాన‌ని, ఇటీవ‌ల గ్రామ స‌చివాల‌య ప‌రీక్ష‌ల్లో ఉద్యోగం రావ‌డంతో ఇటువైపు వ‌చ్చిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle